శ్రియా భూపాల్‌ నిశ్చితార్థం | Shriya Bhupal Engagement With Anindith Reddy | Sakshi
Sakshi News home page

శ్రియా భూపాల్‌ నిశ్చితార్థం ఎవరితోనో తెలుసా!

Apr 23 2018 8:12 PM | Updated on Apr 23 2018 8:22 PM

Shriya Bhupal Engagement With Anindith Reddy - Sakshi

శ్రియా భూపాల్‌ ఈ పేరు గుర్తుండే ఉంటుంది కదా. జీవీకే కుటుంబానికి చెందిన ఆమె...అక్కినేని కుటుంబంలో కోడలుగా అడుగుపెట్టబోయి... జస్ట్‌ మిస్‌ అయింది. ప్యాషన్‌ డిజైనర్‌గా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న శ్రియా.. అక్కినేని అఖిల్‌తో  నిశ్చితార్థం జరగడం తర్వాత క్యాన్సిల్‌ అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అఖిల్ తన కెరీర్పై దృష్టి పెట్టి పెట్టాడు. ఈ బ్రేకప్‌ తర్వాత శ్రియా భూపాల్‌..అనిందిత్‌తో ప్రేమలో ఉన్నట్టు పలు వార్తలు వచ్చాయి. వీటిని నిజం చేస్తూ శ్రియా, అనిందిత్‌ల నిశ్చితార్థం ఆదివారం ఘనంగా జరిగినట్టు సమాచారం. ఇందుకు సంబంధించిన ఫొటోలను వీరి బంధువు పింకీ రెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

అనిందిత్‌ గురించి:
చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, అపోలో హాస్పిటల్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సంగీతల కుమారుడు అనిందిత్‌. సంగీత, ఉపాసన తల్లి శోభన అక్కాచెల్లెల్లు. అంటే ఉపాసనకు అనిందిత్‌కు సోదరుడు అన్నమాట. ఈ వేడుకకు రామ్‌ చరణ్‌, ఉపాసనలతో పాటు ఇతర కుటుంబ సభ్యులు హాజరయ్యారు. వీరి వివాహం పారిస్‌లో జరగనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement