భార్యతో కలిసి హీరో వర్కవుట్లు | Ramcharan workouts along with wife upasana | Sakshi
Sakshi News home page

భార్యతో కలిసి హీరో వర్కవుట్లు

Oct 24 2016 6:44 PM | Updated on Sep 4 2017 6:11 PM

భార్యతో కలిసి హీరో వర్కవుట్లు

భార్యతో కలిసి హీరో వర్కవుట్లు

సినిమా హీరోలంటే.. తమ ఫిట్‌నెస్‌ను, ఫిజిక్‌ను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం వాళ్లు నిరంతరం వర్కవుట్లు చేస్తూనే ఉండాలి.

సినిమా హీరోలంటే.. తమ ఫిట్‌నెస్‌ను, ఫిజిక్‌ను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం వాళ్లు నిరంతరం వర్కవుట్లు చేస్తూనే ఉండాలి. చేతిలో సినిమాలు ఉన్నా లేకపోయినా కూడా ఇది మాత్రం తప్పదు. ఇక ఇప్పటికే చేతిలో సినిమాలు ఉన్నవాళ్లు మరింత జాగ్రత్తగా ఉంటారు. తమిళంలో సెన్సేషనల్ హిట్ అయిన తని ఒరువన్ రీమేక్ 'ధ్రువ' హీరోగా చేస్తున్న హీరో రాంచరణ్ కూడా ఫిట్‌నెస్ ఫ్రీక్ అనే చెబుతుంటారు. 
 
దానికితోడు ఆయన భార్య ఉపాసన అపోలో ఆస్పత్రుల చైర్మన్ ప్రతాపరెడ్డి మనవరాలు. దాంతో ఇద్దరూ కలిసి మరీ వర్కవుట్లు చేస్తున్నారు. తాజాగా ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. రాంచరణ్, ఉపాసన తలో ట్రెడ్ మిల్ మీద ఒక జిమ్‌లో పరుగులు తీస్తూ ఆ వీడియోలో కనిపించారు. ఏమాత్రం దృష్టి మరలకుండా తదేక దీక్షతో వ్యాయామాలు చేయడం ఈ వీడియోలో కనిపించింది.

Advertisement
 
Advertisement
Advertisement