రజనీ బ్లాక్‌బస్టర్‌ మూవీ.. అక్కడ మళ్లీ రిలీజ్‌!

Rajinikanth Muthu Movie Re Releasing In Japan - Sakshi

ఇండియన్‌ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కు ప్రపంచవ్యాప్తంగా అభిమానగణం ఉన్న సంగతి తెలిసిందే. తలైవా అంటూ ఫ్యాన్స్‌ మురిసిపోతుంటారు. రజనీ సినిమా విడుదలవుతుందంటే వారు చేసే హంగామానే వేరు. రజనీకి సింగపూర్‌, మలేషియా, జపాన్‌లాంటి దేశాల్లో తిరుగులేని ఫాలోయింగ్‌ ఉందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 

రజనీకాంత్‌, మీనా జంటగా నటించిన ‘ముత్తు’ సినిమా జపాన్‌లో ఎన్నో రికార్డులను క్రియేట్‌ చేసింది. ఇప్పటికీ అక్కడ ఈ చిత్రానికి ఆదరణ తగ్గలేదు. అయితే ఈ చిత్రం జపాన్‌లో విడుదలై ఇరవై యేళ్లు గడిచిన సందర్భంగా మళ్లీ ఈ సినిమాను 4కె, అత్యాధునిక సాంకేతికతతో కూడిన సౌండ్‌ ఎఫెక్ట్స్‌తో నవంబర్‌ 23న రీరిలీజ్‌ చేయనున్నారు. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. జపాన్‌లో రజనీని డ్యాన్సింగ్‌ కింగ్‌ అని, మీనాను డ్యాన్సింగ్‌ క్వీన్‌ అని ఫ్యాన్స్‌ సంభోదిస్తుంటారట. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top