'పీకే' తెలివైన సినిమా: కశ్యప్ | 'PK' a clever film, says Anurag Kashyap | Sakshi
Sakshi News home page

'పీకే' తెలివైన సినిమా: కశ్యప్

Dec 26 2014 7:23 PM | Updated on Sep 2 2017 6:47 PM

'పీకే' తెలివైన సినిమా: కశ్యప్

'పీకే' తెలివైన సినిమా: కశ్యప్

ఆమిర్ఖాన్ 'పీకే' సినిమాపై ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ప్రశంసలు కురిపించారు.

ముంబై: ఆమిర్ఖాన్ 'పీకే' సినిమాపై ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ప్రశంసలు కురిపించారు. మత సంబంధ సున్నితమైన విషయాన్ని చాలా తెలివిగా తెరకెక్కించారని అన్నారు.

'ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాను చాలా తెలివిగా తీశారు. ఎటువంటి వివాదాలకు తావులేకుండా మతం, దేవుడు, స్వాములపై సినిమా తీయడం మామూలు విషయం కాదు. రాజ్కుమార్ హిరానీ ఎంతో సాహసంతో ఈ సినిమా తెరకెక్కించారు' అని అనురాగ్ కశ్యప్ ప్రశంసించారు. తాము ఇలాంటి సినిమాలు వెనుకాడతామని, కాని హిరానీ, నిర్మాత విదూ వినోద్ చోప్రా, హీరో ఆమిర్ ఖాన్ ధైర్యంగా ముందుకెళ్లారని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement