ఖుషి కాంబినేషన్ రిపీట్ అవుతుందా..? | pawan kalyan to work with kushi director again | Sakshi
Sakshi News home page

ఖుషి కాంబినేషన్ రిపీట్ అవుతుందా..?

Dec 15 2015 10:41 AM | Updated on Mar 22 2019 5:33 PM

ఖుషి కాంబినేషన్ రిపీట్ అవుతుందా..? - Sakshi

ఖుషి కాంబినేషన్ రిపీట్ అవుతుందా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ను మలుపు తిప్పిన సూపర్ హిట్ సినిమా ఖుషి. తమిళ దర్శకుడు ఎస్జె సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ అప్పట్లో సంచలన విజయం...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ను మలుపు తిప్పిన సూపర్ హిట్ సినిమా ఖుషి. తమిళ దర్శకుడు ఎస్జె సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ అప్పట్లో సంచలన విజయం సాధించింది. ఈ ఒక్క హిట్తో పవన్ కళ్యాణ్ యూత్ ఐకాన్గా టాప్ క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఈ సినిమా సక్సెస్ పవన్ కెరీర్కే కాదు.. డైరెక్టర్ సూర్య కెరీర్కు కూడా చాలా ప్లస్ అయ్యింది.

ఖుషి సినిమా తరువాత కొమరం పులి సినిమా కోసం మరోసారి కలిసి పని చేసిన పవన్, ఎస్ జె సూర్యలు ఆకట్టుకోలేకపోయారు. ఈ సినిమా పవన్ కెరీర్లోనే బిగెస్ట్ డిజాస్టర్ అనిపించుకోవటంతో ఎస్ జె సూర్య పూర్తిగా తెలుగు సినిమాలకు దూరమయ్యాడు. ఈ సినిమా తరువాత సూర్య తమిళ్లో చేసిన సినిమాలు కూడా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. వరుస ఫ్లాప్లతో కష్టాల్లో పడ్డ దర్శకుడికి మరో ఛాన్స్ ఇచ్చే ఆలోచనలో ఉన్నాడట పవర్ స్టార్.

బ్లాక్ బస్టర్ హిట్తో తన కెరీర్ను మలుపు తిప్పిన ఎస్ జె సూర్య దర్శకత్వంలో మరో సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు పవర్ స్టార్. ఈ ఇద్దరి కాంబినేషన్లో ఖుషి సినిమాకు సీక్వల్ తెరకెక్కనుందన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఇప్పటి వరకు కథా కథనాల విషయంలో క్లారిటీ లేకపోయినా ఖుషి కాంబినేషన్ రిపీట్ అవ్వటం మాత్రం ఖాయం అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు.

Advertisement
 
Advertisement
Advertisement