పవన్.. ఆ సినిమా చేస్తాడా..? | Pawan Kalyan in Vijay Theri remake | Sakshi
Sakshi News home page

పవన్.. ఆ సినిమా చేస్తాడా..?

Mar 22 2017 10:40 AM | Updated on Mar 22 2019 5:33 PM

పవన్.. ఆ సినిమా చేస్తాడా..? - Sakshi

పవన్.. ఆ సినిమా చేస్తాడా..?

ఈ శుక్రవారం కాటమరాయుడుగా థియేటర్లలోకి వచ్చేందుకు రెడీ అవుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తరువాత

ఈ శుక్రవారం కాటమరాయుడుగా థియేటర్లలోకి వచ్చేందుకు రెడీ అవుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తరువాత చేయబోయే సినిమాపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ చేయబోయే సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాతో పాటు మరో రీమేక్ చేసేందుకు పవన్ ఇంట్రస్ట్ చూపిస్తున్నాడన్న ప్రచారం జరుగుతోంది.

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ హీరోగా తెరకెక్కిన తేరి సినిమాను కందరీగ, రభస సినిమాల దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రీమేక్ చేయాలనుకుంటున్నాడట. అయితే తేరి సినిమా పోలీస్ పేరుతో తెలుగులోనూ రిలీజ్ అయి యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఇప్పటికే తెలుగులో రిలీజ్ అయిన సినిమాను పవన్ రీమేక్ చేసే సాహసం చేస్తాడా..? అన్న అనుమానం కలుగుతోంది.

ప్రస్తుతం పవన్ చేసిన కాటమరాయుడు కూడా రీమేక్ సినిమానే. అజిత్ హీరోగా తెరకెక్కిన వీరం సినిమాకు రీమేక్ ఇది. వీరం కూడా తెలుగు వీరుడొక్కడే పేరుతో రిలీజ్ అయ్యింది. ఇప్పుడు అదే సినిమాను రీమేక్ చేసిన పవన్, మరోసారి తేరి సినిమా రీమేక్ లోనూ నటిస్తాడన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతానికి తేరీ రీమేక్పై యూనిట్ సభ్యుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement