మాజీ భార్యతో పవర్ స్టార్ పవన్! | Pawan Kalyan Family Recent Dinner Photo | Sakshi
Sakshi News home page

మాజీ భార్యతో పవర్ స్టార్ పవన్!

Feb 24 2016 5:10 PM | Updated on Jul 6 2019 4:08 PM

మాజీ భార్యతో పవర్ స్టార్ పవన్! - Sakshi

మాజీ భార్యతో పవర్ స్టార్ పవన్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ,మాజీ భార్య రేణూ దేశాయ్, పిల్లలతోకలిసి వున్న ఓ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

హైదరాబాద్ : పవర్ స్టార్  పవన్ కల్యాణ్, మాజీ భార్య రేణూ దేశాయ్, పిల్లలతో కలిసి వున్న ఓ ఫోటో  ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సాధారణంగా పవన్ కల్యాణ్ బయట ఫంక్షన్లలోనూ, రెస్టారెంట్లలోనూ కనిపించడం చాలా అరుదు . అలాంటిది కొడుకు అకిరా, కూతురు ఆద్య సహా  రేణూ దేశాయ్ తో కలిసి ఉన్న  ఓ ఫోటోను  అభిమానులు షేర్ చేస్తున్నారు. 

 

హైదరాబాద్ లోని ఓ ప్రముఖ రెస్టారెంట్ లో  డిన్నర్ చేస్తున్న  ఫోటో ఇప్పడు  హల్ చల్ చేస్తోంది. రెస్టారెంట్ కి వచ్చిన సందర్భంగా  ఓ కస్టమర్ ఈ ఫోటోను తీసినట్టుగా తెలుస్తోంది.  సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నప్పటికీ పిల్లలతో సమయం గడిపేందుకు పవన్ ఇలా తీరిక చేసుకున్నట్టు  సమాచారం. 

Advertisement
 
Advertisement
Advertisement