నెట్లో చిరు సీన్ లీక్ | Megastar Chiranjeevi re entry scene on social media | Sakshi
Sakshi News home page

నెట్లో చిరు సీన్ లీక్

Oct 17 2015 9:06 AM | Updated on Jul 23 2019 11:50 AM

నెట్లో చిరు సీన్ లీక్ - Sakshi

నెట్లో చిరు సీన్ లీక్

ఎన్నో రోజులుగా మెగా అభిమానులు ఎదురుచూస్తున్న పండగరోజు రానే వచ్చింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన బ్రూస్ లీ సినిమాతో మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ...

ఎన్నో రోజులుగా మెగా అభిమానులు ఎదురుచూస్తున్న పండగరోజు రానే వచ్చింది. రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన బ్రూస్ లీ సినిమాతో మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చేశాడు. సినిమా రిజల్ట్ సంగతి ఎలా ఉన్నా, బ్రూస్ లీ లో చిరు చేసిన క్యారెక్టర్కు మాత్రం భారీ స్పందన వస్తోంది.

అభిమానులు కూడా తమ అభిమాన కథనాయకుడిని చాలా రోజుల తరువాత వెండితెర మీద చూసి పండగ చేసుకుంటున్నారు. కొంత మంది అభిమానులు అత్యుత్సాహంతో చిరు ఎంట్రీ సీన్ను సెల్ ఫోన్ కెమెరాల్లో బందించి సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తున్నారు. అయితే వెంటనే స్పందించిన చిత్రయూనిట్, ఆ వీడియోలను తొలగించే పనిలో ఉన్నారు.

చిరు 150వ సినిమాకు టీజర్గా చిరు చేసిన స్పెషల్ క్యారెక్టర్ మెగాస్టార్ మెగా లాంచ్కు మంచి కిక్ ఇచ్చింది. శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన బ్రూస్ లీ, డివైడ్ టాక్ తో స్టార్ట్ అయినా వసూళ్ల పరంగా మాత్రం మంచి రిజల్ట్స్ చూపిస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్ సీస్ లో కూడా సత్తా చాటుతున్న బ్రూస్ లీ మెగా అభిమానులను అలరిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement