హీరోయిన్ ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్ | Madonna Sebastian Facebook account hacked | Sakshi
Sakshi News home page

హీరోయిన్ ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్

Mar 9 2017 3:09 PM | Updated on Jul 26 2018 5:23 PM

హీరోయిన్ ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్ - Sakshi

హీరోయిన్ ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్

తమిళ నాట సుచీలీక్స్ సంచలనాలు మరువక ముందే దక్షిణాది సినీ రంగంలో మరో హీరోయిన్ సోషల్ మీడియా పేజ్ హ్యాక్

తమిళ నాట సుచీలీక్స్ సంచలనాలు మరువక ముందే దక్షిణాది సినీ రంగంలో మరో హీరోయిన్ సోషల్ మీడియా పేజ్ హ్యాక్ అయినట్టుగా వార్తలు వస్తున్నాయి. ప్రేమమ్ సినిమాతో మలయాళ, తెలుగు ప్రేక్షకులకు చేరువైన మడోనా సెబాస్టియన్ ఫేస్ బుక్ పేజ్ హ్యాక్ అయ్యింది. ఈ విషయాన్ని మడోనా స్వయంగా ప్రకటించింది. ' నా ఫేస్ బుక్ పేజ్ హ్యాక్ అయ్యింది. నేను చెప్పేంతవరకు నా పేజ్ లో వచ్చే పోస్ట్ లను పట్టించుకోవద్దు. ఏవైనా అభ్యంతరకర పోస్ట్ లు వస్తే నా బాధ్యత కాదు' అంటూ పోస్ట్ చేసింది మడోనా.

Advertisement
 
Advertisement
Advertisement