breaking news
Suchileaks
-
హీరోయిన్లపై నిర్మాత భార్య దారుణ వ్యాఖ్యలు
సాక్షి, చెన్నై: సుచీ లీక్స్ పేరుతో సింగర్ సుచిత్ర గతేడాది హీరో, హీరోయిన్ల శృంగార చిత్రాలు, ఆంతరంగిక విషయాలు బయటపెట్టడం అప్పట్లో కలకలం రేపింది. కొంతమంది కోలీవుడ్ తారల గుండెల్లో ఆ లీకైన ఫొటోలు, వీడియోలు రైళ్లు పరుగెత్తించాయి. తాజాగా నిర్మాత జ్ఞానవేల్ రాజా భార్య నేహా హీరోయిన్లపై సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లోకెక్కారు. కొందరు హీరోయిన్లు వేశ్యల కంటే దారుణమని, వాళ్లు సంసారాలు కూల్చేస్తారంటూ సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆరోపణలు చేశారు. గతేడాది సుచీ లీక్స్ తర్వాత నేహా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. మౌనంగా ఎందుకుండాలి.. తుపానులా సమస్యలపై విజృంభించాలని నేను భావిస్తున్నాను. మహిళలకు మహిళలే ఎందుకు శత్రువులుగా మారుతున్నారు. తప్పుడు దారులు ఎంచుకుంటూ.. ఎన్నో కుటుంబాల్లో కుంపట్లు పెట్టడం వారికి తగునా అని ప్రశ్నిస్తూ ఇటీవల తాను చేసిన ట్వీట్లు డిలీట్ చేశారు నేహా. భార్యను నియంత్రించడం భర్త బాధ్యతని, అదే సమయంలో భర్త తప్పుచేస్తే భార్యలు కూడా అదే స్థాయిలో స్పందించాలన్నారు. బరితెగించిన ఆడవాళ్లను పబ్లిక్‌లో కొట్టినా తప్పులేదన్నారు. తాజాగా చేసిన ట్వీట్లో ఆమె ఏమన్నారంటే.. నాకు, నా భర్తతో ఎలాంటి సమస్య, విభేదాలు లేవు. చుట్టూ జరుగుతున్న కొన్ని సంఘటనలపై నేను స్పందిస్తున్నాను. వివాహం చేసుకున్న మగవాళ్ల జీవితాల్లోకి కొందరు మహిళలు ప్రవేశిస్తున్నారు. దాంతో కుటుంబాలు సర్వనాశనం అవుతాయి. ప్రచారం లాంటి వాటి కోసం నేను ఈ ట్వీట్లు చేయడం లేదు. ఓ మాధ్యమంగా ఎంచుకుని ట్వీట్లు చేసి విషయాన్ని అందరి దృష్టికి తీసుకొచ్చాను. కొందరు లీక్స్.. అంటున్నారు. కానీ ఎవరి దృష్టినో ఆకర్షించేందుకు నేను ఈ పని చేయలేదు. కొందరు విషయం తెలియకుండా నా భర్తను అపార్థం చేసుకుని కామెంట్లు చేయడం బాధించింది. ఇది నా వ్యక్తిగత సమస్య కానే కాదంటూ పోస్ట్ చేశారు నిర్మాత జ్ఞానవేల్ రాజా భార్య నేహా. నేహా కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేస్తున్న విషయం తెలిసిందే. సింగం 3, గ్యాంగ్, తదితర సినిమాలకు జ్ఞానవేల్ నిర్మాతగా వ్యవహరించారు. Let ppl do their job with ease🙏 it’s ain’t any cheap leaks!! pic.twitter.com/MryNoaKMZ6 — neha nehu:) (@NehaGnanavel) 20 March 2018 -
హీరోయిన్ ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్
తమిళ నాట సుచీలీక్స్ సంచలనాలు మరువక ముందే దక్షిణాది సినీ రంగంలో మరో హీరోయిన్ సోషల్ మీడియా పేజ్ హ్యాక్ అయినట్టుగా వార్తలు వస్తున్నాయి. ప్రేమమ్ సినిమాతో మలయాళ, తెలుగు ప్రేక్షకులకు చేరువైన మడోనా సెబాస్టియన్ ఫేస్ బుక్ పేజ్ హ్యాక్ అయ్యింది. ఈ విషయాన్ని మడోనా స్వయంగా ప్రకటించింది. ' నా ఫేస్ బుక్ పేజ్ హ్యాక్ అయ్యింది. నేను చెప్పేంతవరకు నా పేజ్ లో వచ్చే పోస్ట్ లను పట్టించుకోవద్దు. ఏవైనా అభ్యంతరకర పోస్ట్ లు వస్తే నా బాధ్యత కాదు' అంటూ పోస్ట్ చేసింది మడోనా. -
లండన్ వెళ్లనున్న 'సుచీలీక్స్' సుచిత్ర
కోలీవుడ్ టాప్ స్టార్స్‌కు సంబంధించిన ప్రైవేట్ ఫోటోస్‌ను లీక్ చేసి సంచలనం సృష్టించిన తమిళ గాయని సుచిత్ర, మరోసారి వార్తల్లో నిలిచారు. ట్విట్టర్ వేదికగా కోలీవుడ్ ప్రముఖలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన, సుచిత్ర మానసిక పరిస్థితి సరిగా లేదన్న ప్రచారం జరుగుతోంది. అందుకే చికిత్స కోసం త్వరలో లండన్ వెళ్లే ఆలోచనలో ఉందట సుచిత్ర. ప్రస్తుతం సుచిత్ర చెన్నైలోనే ఉంది. త్వరలోనే ఆమె కుటుంబ సభ్యులు చికిత్సకు సంబంధించి నిర్ణయం తీసుకోనున్నారు. హీరో ధనుష్, హీరోయిన్లు త్రిషా, ఆండ్రియా, హన్సికలతో పాటు సంగీత దర్శకుడు అనిరుధ్ పైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేయటంతో పాటు కొన్ని ప్రైవేట్ ఫోటోస్ ను సైతం సుచిత్ర ట్విట్టర్లో పోస్ట్ చేసింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ట్వీట్లపై స్పందించిన సుచిత్ర భర్త కార్తీక్ కుమార్, ఆమె మానసిక పరిస్థితి సరిగా లేదని, అర్ధం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.