లండన్ వెళ్లనున్న 'సుచీలీక్స్' సుచిత్ర | Suchitra Karthik going to London for rehabilitation | Sakshi
Sakshi News home page

లండన్ వెళ్లనున్న 'సుచీలీక్స్' సుచిత్ర

Mar 8 2017 12:32 PM | Updated on Sep 5 2017 5:33 AM

లండన్ వెళ్లనున్న 'సుచీలీక్స్' సుచిత్ర

లండన్ వెళ్లనున్న 'సుచీలీక్స్' సుచిత్ర

కోలీవుడ్ టాప్ స్టార్స్కు సంబంధించిన ప్రైవేట్ ఫోటోస్ను లీక్ చేసి సంచలనం సృష్టించిన తమిళ గాయని సుచిత్ర,

కోలీవుడ్ టాప్ స్టార్స్కు సంబంధించిన ప్రైవేట్ ఫోటోస్ను లీక్ చేసి సంచలనం సృష్టించిన తమిళ గాయని సుచిత్ర, మరోసారి వార్తల్లో నిలిచారు. ట్విట్టర్ వేదికగా కోలీవుడ్ ప్రముఖలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన, సుచిత్ర మానసిక పరిస్థితి సరిగా లేదన్న ప్రచారం జరుగుతోంది. అందుకే చికిత్స కోసం త్వరలో లండన్ వెళ్లే ఆలోచనలో ఉందట సుచిత్ర. ప్రస్తుతం సుచిత్ర చెన్నైలోనే ఉంది.

త్వరలోనే ఆమె కుటుంబ సభ్యులు చికిత్సకు సంబంధించి నిర్ణయం తీసుకోనున్నారు. హీరో ధనుష్, హీరోయిన్లు త్రిషా, ఆండ్రియా, హన్సికలతో పాటు సంగీత దర్శకుడు అనిరుధ్ పైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేయటంతో పాటు కొన్ని ప్రైవేట్ ఫోటోస్ ను సైతం సుచిత్ర ట్విట్టర్లో పోస్ట్ చేసింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ట్వీట్లపై స్పందించిన సుచిత్ర భర్త కార్తీక్ కుమార్, ఆమె మానసిక పరిస్థితి సరిగా లేదని, అర్ధం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement