అమ్మ కోసం..

Kangana Ranaut workout For Jayalalitha Biopic - Sakshi

చెన్నై : భారతీయ సినిమాలో సంచలన నటి ఎవరన్నా ఉన్నారంటే అందులో నటి కంగనా రనౌత్‌ పేరు కచ్చితంగా నమోదవుతుంది. అంతే కాదు ఇప్పుడు అత్యధిక పారితోషికం పుచ్చుకుంటున్న కథానాయకిగానూ ఎదిగిపోయింది. కాగా అప్పుడెప్పుడో తమిళంలో ధామ్‌ ధూమ్‌ అనే చిత్రంతో పరిచయమైంది. ఆ తరువాత ఇక్కడ మళ్లీ కనిపించలేదు. బాలీవుడ్‌లో అగ్రనాయకిగా రాణిస్తున్న కంగనారనౌత్‌ను దర్శకుడు విజయ్‌ తాజాగా కోలీవుడ్‌కు తీసుకొస్తున్నారు. ఈయన తెరకెక్కించనున్న జయలలిత బయోపిక్‌లో టైటిల్‌ రోల్‌లో నటించడానికి నటి కంగనారనౌత్‌ను ఎంచుకున్నారు. తలైవి పేరుతో ఈ చిత్రం తమిళం, తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కించనున్నారు. త్వరలోనే తలైవి చిత్ర షూటింగ్‌ సెట్‌పైకి వెళ్లనుంది.

ఈ చిత్రంలో నటించనుండడం గురించి నటి కంగనారనౌత్‌ మాట్లాడుతూ జయలలిత పాత్రలో నటించనుండడం ఘనంగా ఉందని చెప్పింది. ఇందు కోసం జయలలిత ప్రచారాల వీడియోలను తెప్పించుకుని వింటున్నానని తెలిపింది. ఆమెకు తగ్గట్టుగా తన శారీరక భాషను మార్చుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పింది. కష్టాలను అధిగమించి ముఖ్యమంత్రి పదవిని చేపట్టారని చెప్పింది.  అలాంటి జయలలిత పాత్రలో తాను నటించనుండడంసంతోషకరంగా పేర్కొంది. మహిళలు కష్టాలను అధిగమించి ఎదగవచ్చునన్నందుకు జయలలిత ఉదాహరణ అని అంది. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కనున్న తలైవి చిత్రం త్వరలోనే ప్రారంభం కానుందని చెప్పింది. జయలలిత చదువును పక్కన పెట్టి నటించడానికి ఆసక్తి చూపిన కాలం నుంచి తలైవి చిత్ర కథ మొదలవుతుందని చెప్పింది. ఆ చిత్ర కథకు  విజయేంద్రప్రసాద్, అజిత్‌ ఆరోరా స్క్రీన్‌ప్లేను రాస్తున్నట్లు తెలిపింది. తాను ఇతర చిత్రాలన్నింటినీ పక్కన పెట్టేసి ఈ చిత్రం కోసం 100 శాతం శ్రమించడానికి సిద్ధం అవుతున్నట్లు నటి కంగనారనౌత్‌ చెప్పింది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top