సినిమాలంటే భయం లేదు | I am careful, but not scared of doing films: Yami Gautam | Sakshi
Sakshi News home page

సినిమాలంటే భయం లేదు

Feb 25 2014 12:34 AM | Updated on Sep 2 2017 4:03 AM

సినిమాలంటే భయం లేదు

సినిమాలంటే భయం లేదు

సినిమాలు ఎంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటానని, అయితే వాటికి భయపడేదాన్ని మాత్రం కాదని చెబుతోంది యామీ గౌతమ్. మొదటి సినిమా వికీ డోనర్ విజయం

సినిమాలు ఎంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటానని, అయితే వాటికి భయపడేదాన్ని మాత్రం కాదని చెబుతోంది యామీ గౌతమ్. మొదటి సినిమా వికీ డోనర్ విజయం సాధించడంతో ఈ బ్యూటీకి అవకాశాలు బాగానే వస్తున్నా తొందరపడడం లేదు. కథల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. ‘నా మనసు చెప్పింది చేయడమే నాకిష్టం. ఒక సినిమా భారీ హిట్ కాగానే తరువాతి వాటిని ఎంపిక చేసుకోవడంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. 
 
అయితే నాకు సినిమా కుటుంబం లేదు. ముంబై యువతినీ కాదు కాబట్టి రెండో అవకాశం రావడం కాస్త కష్టమే. అయితే జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. అంతమాత్రాన నేను భయపడ్డట్టు కాదు’ అని యామీ వివరించింది. తాజా సినిమా టోటల్ సియప్పా తనకు మనసుకు నచ్చిన కథ అని తెలిపింది. ‘నాకు అవకాశాలు చాలా వచ్చాయి. వద్దనుకున్న సినిమాల గురించి మాట్లాడడం ఇష్టముండదు’ అని చెప్పింది. అయితే నీరజ్ పాండే నిర్మిస్తున్న టోటల్ సియప్పా ప్రాజెక్టుపై సంతకం చేయడానికి కూడా ఈమె చాలా సమయమే తీసుకుంది. ‘భిన్న నేపథ్యాలున్న కథ ఇది. హాస్యం, ఉద్వేగం, కోపం వంటి అంశాలూ ఉంటాయి. 
 
ఇందులో అవకాశం ఇచ్చిన నీరజ్ పాండేకు ఎంతో కృతజ్ఞురాలిని. సినిమా కథ గంభీరమైనదే అయినా ప్రేక్షకులు దీనిని పూర్తిగా ఆస్వాదించవచ్చు’ అని యామీ వివరించింది. టోటల్ సియప్పాకు నీరజ్ కథ కూడా అందించగా, ఈశ్వర్ నివాస్ దర్శకత్వం వహించాడు. దీనిని వచ్చే నెల ఏడున విడుదల చేస్తున్నారు. పాకిస్థానీ నటుడు, గాయకుడు అలీ జఫర్, యామీ, అనుపమ్ ఖేర్, ఆయన సతీమణి కిరణ్ ఖేర్ తదితరులు ఇందులో కనిపిస్తారు. వికీ డోనర్ తీసిన జాన్‌అబ్రహం, షూజిత్ సర్కార్ తాజాగా రూపొందించే సినిమాలోనూ అవకాశం దక్కిందంటూ వచ్చిన వార్తలను యామీ గౌతమ్ తోసిపుచ్చింది.
 

Advertisement
 
Advertisement
Advertisement