‘ఆర్ఆర్‌ఆర్‌’ నుంచి తప్పుకున్న హీరోయిన్‌ | Daisy Edgar Jones is No Longer a Part of SS Rajamouli RRR | Sakshi
Sakshi News home page

‘ఆర్ఆర్‌ఆర్‌’ నుంచి తప్పుకున్న హీరోయిన్‌

Apr 6 2019 1:57 PM | Updated on Jul 14 2019 4:05 PM

Daisy Edgar Jones is No Longer a Part of SS Rajamouli RRR - Sakshi

దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్‌ సినిమా ఆర్‌ఆర్‌ఆర్‌. రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్ హీరోలుగా రూపొందుతున్న ఈ సినిమాలో అలియాభట్‌, డైసీ ఎడ్గర్‌ జోన్స్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నట్టుగా ప్రకటించాడు జక్కన్న. అయితే ఈ సినిమా నుంచి డైసీ ఎడ్గర్‌ జోన్స్‌ తప్పుకున్నట్టుగా చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించారు.

ఈ విషయంపై డైసీ కూడా ఓ ప్రకటన విడుదల చేశారు. కుటుంబపరమైన కారణాల వల్ల తాను ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో నటించలేకపోతున్నా అన్న డైసీ, ఆర్‌ఆర్‌ఆర్‌ అద్భుతమైన కథ, ఈ సినిమా తాను చేయాల్సిన పాత్రలో ఎవరూ నటించినా గొప్ప స్వాగతం లభిస్తుందని తెలిపారు.

ఎన్టీఆర్‌గా జోడిగా నటిస్తున్న హాలీవుడ్ నటి డైసీ.. ఆర్ఆర్‌ఆర్‌ నుంచి తప్పుకోవటంతో చిత్ర యూనిట్ మరో హాలీవుడ్ భామ కోసం ప్రయత్నాలు ప్రారంభించారట. ఇటీవల రామ్‌చరణ్‌కు గాయం కావటంతో పూణే షెడ్యూల్‌ ను అర్ధాంతరంగా క్యాన్సిల్ చేశాడు రాజమౌళి, మూడు వారాల తరువాత షూటింగ్ తిరిగి ప్రారంభం కానుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement