అల వైకుంఠపురానికి చిన్న రిపేర్‌‌..! | Ala Vaikunthapuramulo Movie Name Changes As Per Numerology | Sakshi
Sakshi News home page

అల వైకుంఠపురానికి చిన్న రిపేర్‌‌..!

Sep 27 2019 12:26 PM | Updated on Sep 27 2019 12:40 PM

Ala Vaikunthapuramulo Movie Name Changes As Per Numerology - Sakshi

సినీ రంగంలో సక్సెస్‌తో పాటు నమ్మకాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ముఖ్యంగా ముహూర్తాలు, శకునాలు లాంటి విషయాలను కొంతమంది దర్శక నిర్మాతలు చాలా స్ట్రిక్ట్‌గా ఫాలో అవుతుంటారు. తాజాగా ‘అల వైకుంఠపురములో’ సినిమా విషయంలోనూ అలాంటి సెంటిమెంట్‌నే ఫాలో అవుతున్నట్టుగా తెలుస్తోంది.

ఈ సినిమా టైటిల్‌ ఎనౌన్స్‌మెంట్‌తో పాటు టీజర్‌ను రిలీజ్‌ చేసిన సమయంలో సినిమా పేరు ఇంగ్లీష్‌లో Ala Vaikunthapuramulo అని రాశారు. కానీ తాజాగా సామజవరగమన సాంగ్‌ టీజర్‌ రిలీజ్‌ సమయంలో మాత్రం టైటిల్‌లో చిన్న మార్పు చేసి Ala Vaikunthapurramuloo అని రాశారు. టైటిల్‌లో అదనంగా మరో ‘ఆర్‌,ఓ’ లను జోడించారు. నిర్మాతలు, నటీనటులు అంతా ఇదే హ్యాష్‌ ట్యాగ్‌తో టీజర్‌ను ట్వీట్ చేశారు. దీంతో నేమ్‌ కరెక్షన్‌లో భాగంగానే ఈ మార్పు చేశారని భావిస్తున్నారు.

గతంలో మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ కూడా సక్సెస్‌ కోసం తన పేరును సాయి తేజ్‌గా మార్చుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం బన్నీ కెరీర్‌ కూడా ఇబ్బందుల్లో ఉంది. గత చిత్రం నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా డిజాస్టర్ కావటంతో లాంగ్‌ గ్యాప్‌ తరువాత అల వైకుంఠపురములో సినిమాను ప్రారంభించాడు బన్నీ.

త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను గీతాఆర్ట్స్‌, హారికా హాసిని క్రియేషన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్‌ సంగీతమందిస్తున్నాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement