కూతురి ప్రేమకథ.. తండ్రి సర్‌ప్రైజ్‌ | Man Proposes Girlfriend Her Dad Holds Say No Placard | Sakshi
Sakshi News home page

కూతురి ప్రేమకథ.. తండ్రి సర్‌ప్రైజ్‌

Apr 3 2018 2:38 PM | Updated on Apr 3 2018 5:59 PM

Man Proposes Girlfriend Her Dad Holds Say No Placard - Sakshi


స్నేహితులను, దగ్గరివాళ్లను సర్‌ప్రైజ్‌ చేయడానికి అప్పుడప్పుడు చిలిపి చేష్టలతో వారిని ఆటపట్టిస్తుంటాము. అవి జీవితాంతం మధుర ఙ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. బ్లిస్‌, అలీసా అనే యువ జంట ప్రస్తుతం తమ ఆల్బమ్‌లో అలాంటి ఙ్ఞాపకాలను భద్రంగా దాచుకునేందుకు సిద్ధమయ్యారు. అవేమిటో తెలుసుకోవాలంటే వారి కథేంటో తెలుసుకోవాల్సిందే.  ప్రేమించిన అమ్మాయిని పెళ్లాడాలంటే తల్లిదండ్రుల సమ్మతి అవసరం అని భావించిన లెవీ బ్లిస్‌ అమ్మాయికి తన ప్రేమ విషయం చెప్పే కంటే ముందే ఆమె తండ్రిని కలిసి విషయం చెప్పేశాడు. అబ్బాయి ప్రవర్తన నచ్చడంతో పెళ్లికి ఓకే చెప్పేశాడు అమ్మాయి అలీసా బారన్‌ తండ్రి. ఆయన కొంచెం సరదా మనిషి కావడంతో కాబోయే అల్లుడిని ఓ ఆట ఆడుకుందాం అనుకున్నాడు. కూతురికి కూడా స్వీట్‌ షాక్‌ ఇచ్చి సర్‌ప్రైజ్‌ చేయాలని భావించాడు.

అలీసాను సర్‌ప్రైజ్‌ చేసేందుకు ఆమెను ఒక కొండ ప్రాంతానికి తీసుకెళ్లాడు బ్లిస్‌. మోకాళ్లపై కూర్చొని తన ప్రేమను వ్యక్త పరిచాడు. అప్పటికే అక్కడికి చేరుకున్న ఇరువురి కుటుంబాలు వీరిని గమనిస్తూనే ఉన్నాయి. సరిగ్గా అలీసా తన నిర్ణయాన్ని చెప్పే సమయంలో బ్లిస్‌ వెనుకగా నిల్చుని ఉన్న ఆమె తండ్రి ‘సే నో(వద్దని చెప్పు)’  అని రాసి ఉన్న ప్లకార్డును ప్రదర్శించాడు. దీంతో అలీసాకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. అంతలోనే ఇరువురి కుటుంబాలు వచ్చి వారిని ఆశీర్వదించడంతో బ్లిస్‌ నెమ్మదిగా ఊపిరి పీల్చుకున్నాడు. తమ ప్రేమ కథకు ఇలా శుభం కార్డు పడటంతో అలీసా ఆనందంలో మునిగితేలుతోంది. తన తండ్రి కేవలం ఆటపట్టించడానికే అలా చేశారని, నిజానికి ఆయనకు బ్లిస్‌ అంటే చాలా ఇష్టమని అలీసా మురిసిపోతోంది. వీరి ప్రేమ కథ ఇప్పుడు ట్విటర్‌లో ట్రెండింగ్‌ అవుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement