హిప్‌ రీప్లేస్‌మెంట్‌ కోసమని వెళ్తే.. | Indian Woman Chef Dies In Dubai After Hip Replacement Surgery | Sakshi
Sakshi News home page

హిప్‌ రీప్లేస్‌మెంట్‌ కోసమని వెళ్తే..

May 13 2019 3:58 PM | Updated on May 13 2019 4:36 PM

Indian Woman Chef Dies In Dubai After Hip Replacement Surgery - Sakshi

దుబాయ్‌ : హిప్‌ రీప్లేస్‌మెంట్‌ సర్జరీ వికటించడంతో భారత మహిళ దుబాయ్‌ ఆస్పత్రిలో మృతిచెందింది. ముంబైకి చెందిన బెట్టి రీటా ఫెర్నాండెజ్‌(42) అనే మహిళ వృత్తిరీత్యా చెఫ్‌. ఆమె బెట్టీస్‌ కేన్‌ టేల్స్‌ అనే గ్రోసరీ స్టోర్‌ నిర్వహిస్తూ ఉపాధి పొందుతున్నారు. రీటాకు పుట్టుకతోనే ఎడమ తుంటిలో లోపం ఉంది. దీంతో సర్జరీ కోసమని మే 9న దుబాయ్‌లోని ఆల్‌ జహ్రా ఆస్పత్రిలో చేరింది.

ఈ క్రమంలో సర్జరీ వికటించడంతో బెట్టి రీటా మృతి చెందినట్లు గల్ఫ్‌న్యూస్‌ పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆమె భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన దుబాయ్‌ హెల్త్‌ అథారిటీ విచారణ చేపట్టింది. కమిటీ వేసి రీటా మృతి వెనుక గల కారణాలు తెలుసుకుంటామని, ఆస్పత్రిపై తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.

Advertisement
 
Advertisement
Advertisement