ఎలన్‌ మస్క్‌.. ఈ పేరుకు అర్థం ఏంటి? | Elon Musk And Grimes Son With Confused Name Became Viral | Sakshi
Sakshi News home page

ఎలన్‌ మస్క్‌.. ఈ పేరుకు అర్థం ఏంటి?

May 6 2020 12:52 PM | Updated on May 6 2020 1:07 PM

Elon Musk And Grimes Son With Confused Name Became Viral - Sakshi

స్పేస్‌ఎక్స్, టెస్లా కార్ల సంస్థ సీఈవో ఎలన్‌ మస్క్‌ ప్రియురాలు గ్రిమ్స్‌కు మే 5న బిడ్డ పుట్టిన సంగతి తెలిసిందే. కాగా తన బిడ్డ ఫోటోలను ఎలన్‌ మస్క్‌ ట్విటర్లో‌ కూడా షేర్‌ చేశారు. నెటిజన్లు ఫోటోలను చూసి బేబీ క్యూట్‌గా ఉందంటూ ట్వీట్స్‌ కూడా చేశారు. మీకు పుట్టిన బిడ్డకు ఏం పేరు పెట్టారని ఎలన్‌ మస్క్‌ను ఒక నెటిజన్‌ ట్విటర్లో ప్రశ్నించాడు. దీనికి ఎలన్‌ మస్క్‌ స్పందిస్తూ.. మాకు పుట్టిన బిడ్డ పేరు  'X Æ A-12 మస్క్‌' అని చెప్పాడు. అయితే ఎలన్‌ మస్క్‌ చెప్పిన పేరు అర్థం కాక నెటిజన్లు నెత్తి గోక్కున్నారు.అంతేగాక ఎలన్‌‌ చెప్పిన పేరు సంభావ్యతను(ప్రాబబిలిటీ)ని పోలి ఉందంటూ కామెంట్లు చేశారు.  
(నా బిడ్డకు తండ్రి ఎలన్‌ మస్క్‌: సింగర్‌)

దీనిపై ఎలన్‌ మస్క్‌ ప్రియురాలు గ్రిమ్స్ ట్విటర్‌లో క్లారిటీ ఇచ్చారు. ' X Æ A-12 లో  X అంటే అన్‌నోన్‌ వేరియబుల్‌,  Æ A అంటే ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌, A-12 అంటే తమ ఫేవరెట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌( ఎస్‌ఆర్‌-12) అంటూ ' పేర్కొన్నారు. అయితే గ్రిమ్స్‌ ఇంత వివరంగా చెప్పినా  ఇప్పటికి ఆ పేరును ఎలా పలకాలో అర్థం కావడం లేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ట్వీట్‌కు 17వేలకు పైగా రీట్వీట్‌లు, 86వేలకు పైగా లైకులు రావడం విశేషం. కాగా విజువల్‌ ఆర్టిస్టు, రికార్డు ప్రొడ్యూసర్‌, గాయనిగా గుర్తింపు పొందిన 31 ఏళ్ల క్లేర్‌ బౌచర్‌.. గ్రిమ్స్‌ అనే పేరుతో పాపులరయ్యారు. 2018 నుంచి  గ్రిమ్స్‌ ఎలన్‌ మస్క్‌తో డేటింగ్‌లో ఉన్నారు.
(హిజ్‌బుల్ టాప్ క‌మాండ‌ర్ దిగ్బంధం)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement