వైరల్‌: హోటల్‌లో దూరిన గజరాజు!

Elephant Enters Into Hotel Lobby Video Goes Viral - Sakshi

హోటల్‌ లాబీలోకి ఏనుగు ప్రవేశించిన వీడియో సోషల్‌ మీడియాలో నవ్వులు పూయిస్తోంది. శ్రీలంకలో చోటుచేసుకున్న ఈ ఘటనపై స్పందించిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ‘‘ మా అమ్మ మెసేజ్‌తో నిద్రలేచాను. శ్రీలంక హోటల్‌లోకి ప్రవేశించిన ఓ ఏనుగు తన తొండంతో అక్కడున్న వస్తువులను తడిమిచూడటం గురించి తెలుసుకున్నాను’’ అంటూ ఓ ట్విటర్‌ యూజర్‌ షేర్‌ చేసిన ఏనుగు వీడియో ఇప్పటికే 2 మిలియన్లకు పైగా వ్యూస్‌ సాధించింది. 

ఈ క్రమంలో... ‘గజరాజు ఏం చేసినా భలే ముద్దుగా ఉంటుంది. చూశారా.. ఏనుగు ఎంత మర్యాదగా హోటల్‌లోకి వెళ్లి అన్నీ పరీక్షిస్తుందో!!’’అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ వీడియోపై స్పందించిన మరో నెటిజన్‌....ఆ ఏనుగు పేరు నట్టా కోటా అని... శ్రీలంకలో ఉన్న జెట్‌వింగ్‌ యాలా హోటల్‌కి తరచుగా వెళ్తూ ఉంటుందని పేర్కొన్నారు. ఏనుగుకు సంబంధించిన మరిన్ని వీడియోలు యూట్యూబ్‌లో చూడవచ్చని తెలిపారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top