పాక్‌ను వెనకేసుకొచ్చిన డ్రాగన్‌

After PM Modi Slams Terror Export Factory, China Says World Should Support Pakistan - Sakshi

బీజింగ్‌ :  డ్రాగన్‌ మరోసారి కుయుక్తులు చాటింది.  ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్తాన్‌ను ఉగ్రవాద ఎగుమతి ఫ్యాక్టరీగా అభివర్ణించిన నేపథ్యంలో చైనా పాక్‌ను వెనకేసుకొచ్చింది. ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో అంతర్జాతీయ సమాజం పాకిస్తాన్‌కు సహకరించాలని చైనా పిలుపు ఇచ్చింది. ఫాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) భేటీకి ఒకరోజు ముందు చైనా ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ భేటీకి భారత్‌, పాక్‌ విదేశాంగ మంత్రులు హాజరవుతున్నారు.

పాకిస్తాన్‌ ఉగ్ర కార్యకలాపాలపై ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేయడంపై చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి హు చున్‌యంగ్‌ స్పందిస్తూ ఉగ్రవాదం ప్రపంచానికి శత్రువులా పరిణమించిందని ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో అంతర్జాతీయ సమాజం పాక్‌కు వెన్నుదన్నుగా నిలవాలని కోరారు. ఎస్‌సీఓ భేటీలోనూ ఉగ్రవాద సంబంధిత అంశాలు చర్చకు రానున్నాయని చెప్పారు. ఉగ్ర గ్రూపులపై ఉక్కుపాదం మోపాలని ఈ సమావేశంలో తీర్మానిస్తారా అన్న ప్రశ్నకు సూటిగా బదులివ్వకుండా ఉగ్రవాద సంబంధిత అంశాలపై పరస్పర అభిప్రాయాలను పంచుకుంటామని వ్యాఖ్యానించారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top