​‘సైనికుడై ఉండి కుటుంబ హత్య.. ఆత్మహత్య’ | Afghanistan War Veteran Kills Himself And His Family In Canada | Sakshi
Sakshi News home page

​‘సైనికుడై ఉండి కుటుంబ హత్య.. ఆత్మహత్య’

Jan 10 2017 6:18 PM | Updated on Sep 5 2017 12:55 AM

​‘సైనికుడై ఉండి కుటుంబ హత్య.. ఆత్మహత్య’

​‘సైనికుడై ఉండి కుటుంబ హత్య.. ఆత్మహత్య’

అతడు యుద్ధంలో వీర సైనికుడు. శత్రు మూకల్ని పరుగెత్తించి తుదముట్టించాడు. ఆ సైన్యంలోని సైనికులందరిలోకెల్లా కూడా గుర్తింపు పొందాడు.

కెనడా: అతడు యుద్ధంలో వీర సైనికుడు. శత్రు మూకల్ని పరుగెత్తించి తుదముట్టించాడు. ఆ సైన్యంలోని సైనికులందరిలోకెల్లా కూడా గుర్తింపు పొందాడు. కానీ, చివరకు హంతకుడయ్యాడు. మొత్తం కుటుంబాన్ని చంపేసి తనను తాను కాల్చుకొని చనిపోయి అందరినీ షాక్‌ గురిచేశాడు. వివరాల్లోకి వెళితే.. అమెరికాకు చెందిన లియోనల్‌ డెస్మాండ్‌ (33) అనే వ్యక్తి కెనడా సైనిక విభాగంలో 2004లో చేరాడు. జనవరి 2007 నుంచి అదే ఏడాది ఆగస్టు వరకు అఫ్గనిస్థాన్‌లో అమెరికా చేపట్టిన మిషన్‌లో పాల్గొని అక్కడ అత్యుత్తమ కనబరిచాడు.

అతడు సైన్యంలో చేరిన తర్వాత పాల్గొన్న తొలి విదేశీ మిషన్‌ కూడా ఇదే. ఈ మిషన్‌ పూర్తయిన తర్వాత తిరిగి ప్రస్తుతం కెనడాలోని నోవా స్కోటియాలో ఉంటున్నారు. అయితే, అనూహ్యంగా గత వారం వారి కుటుంబం మొత్తం శవాలుగా మారి కనిపించింది. లియోనల్‌ తన భార్య షానాను, పదేళ్ల కూతురు అలియాను, తల్లి బ్రెండాను తుపాకీతో కాల్చి చంపడమే కాకుండా తనను తాను కాల్చుకొని చనిపోయినట్లు పోలీసులు గుర్తించారు. తీవ్ర ఒత్తిడి కారణంగానే అతడు ఇలా చేశాడని పోస్టుమార్టం నివేదికలో తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement