ఫేషియల్ చేస్తానని... | woman stolen mangalsutra | Sakshi
Sakshi News home page

ఫేషియల్ చేస్తానని...

Aug 4 2015 8:28 AM | Updated on Aug 30 2018 5:27 PM

ఫేషియల్ చేస్తానని... - Sakshi

ఫేషియల్ చేస్తానని...

ఫేషియల్ చేస్తానని.. పుస్తెలతాడుతో పరారైన ఘటన సోమవారం మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది.

బోడుప్పల్(హైదరాబాద్): ఫేషియల్ చేస్తానని.. పుస్తెలతాడుతో పరారైన ఘటన సోమవారం మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్ నవీన్‌రెడ్డి కథనం ప్రకారం...  పర్వతాపూర్‌లో స్వప్న అనే యువతి కంగన్ బ్యూటీపార్లర్‌ను నిర్విహిస్తోంది. మూడు రోజుల క్రితం 30 ఏళ్ల ఓ యువతి ఈమె వద్దకు వచ్చి బ్యూటీపార్లర్‌లో ఉద్యోగం కావాలని అడిగింది. తన పేరు సంధ్య అని, ఉప్పల్ కూరగాయల మార్కెట్ వద్ద ఉంటానని చెప్పింది.

రెండు రోజుల క్రితం ఉద్యోగంలో చేరిన సంధ్య సోమవారం నిర్వాహకురాలు స్వప్నకు పేషియల్ చేస్తానని కోరింది. ఆమె ఒప్పుకోవడంతో ఫేషియల్ చేయడం మొదలెట్టింది. ఫేషియల్ చేసేందుకు మెడలోని పుస్తెలతాడు అడ్డొస్తోందని చెప్పింది. దీంతో స్వప్న పుస్తెలతాడు తీసి టేబుల్‌పై పెట్టింది. ఫేషియల్ చేస్తూ కళ్లపై దోసకాయ ముక్కలు పెట్టిన సంధ్య.. గుట్టుచప్పుడు కాకుండా టేబుల్‌పై ఉన్న యజమానురాలి 3 తులాలు పుస్తెల తాడు తీసుకొని ఉడాయించింది.

Advertisement
 
Advertisement
Advertisement