
ఆరడుగుల అందగాడు!
దేశంలో ఉన్న అత్యంత అందమైన 25 మంది అగ్రనటుల్లో ప్రిన్స్ మహేష్బాబు టాప్ టెన్ లో నిలిచాడు.
అతడు టాలీవుడ్ 'రాజకుమారుడు'. తెలుగు తెరను ఏలుతున్న 'యువరాజు'. 'మురారి'గా మగువల మనసు దోచిన 'టక్కరి దొంగ'. 'పోకిరి'గా వచ్చి తెలుగు సినిమా రికార్డులు తిరగరాసిన 'బిజినెస్మేన్'. 'దూకుడు'తో తెలుగు తెరపై దుమ్ము రేపిన 'ఒక్కడు'. నూతన శకానికి 'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు'తో స్వాగతం చెప్పిన 'అతిథి'. ఆరంభంలో 'వంశీ'గా వచ్చిన 'అర్జున్' ఇప్పుడు 'వన్'టరిగా మరోసారి సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు. 'అతడు' ఎవరో కాదు ప్రిన్స్ మహేష్బాబు.
మిల్కీబాయ్ ఇమేజ్తో తారాపథంలో దూసుకుపోతున్న ఈ హ్యాండ్సమ్ హీరో అమ్మాయిల కలల రాకుమారుడిగా మారాడు. హిట్, ఫ్లాపులతో సంబంధం లేకుండా అభిమానులను అలరిస్తున్నాడు. ఈ ఆరడుగుల అందగాడు మన రాష్ట్రంలోనే కాదు దేశమంతా పాపులయ్యాడు. దేశంలో ఉన్న అత్యంత అందమైన 25 మంది అగ్రనటుల్లో టాప్ టెన్ లో నిలిచాడు. ఐఎమ్డీబీ విడుదల చేసిన ఈ జాబితాలో ప్రిన్స్ మహేష్ 6వ స్థానంలో నిలిచాడు. టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున 21వ స్థానం దక్కించుకున్నాడు.
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ఖాన్ అగ్రస్థానంలో నిలిచాడు. ధర్మేంద్ర, హృతిక్ రోషన్, వినోద్ ఖన్నా, దేవానంద్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ 9, విలక్షణ నటుడు ఆమిర్ ఖాన్ 22, మమ్ముట్టి 25 స్థానాల్లో నిలిచారు. బాలీవుడ్ బాద్ షా షారూఖ్ఖాన్ ఈ లిస్టులో లేకపోవడం ట్విస్టు. టాలీవుడ్ నుంచి మహేష్బాబు, నాగార్జున మాత్రమే ఈ జాబితాలో ఉన్నారు.
లిస్టు సంగతి పక్కనపెడితే మహేష్, నాగార్జున టాలీవుడ్ మన్మథులని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఐదు పదుల వయసులోనూ నాగ్ కుర్రహీరోలకు దీటుగా గ్లామర్ కాపాడుకుంటూ 'కింగ్'లా తెలుగు ఇండస్ట్రీని ఏలుతున్నాడు. ఇక మహేష్ అయితే మైండ్ బ్లాక్ చేస్తున్నాడు. వీరిద్దరూ వారసత్వంగా తెరమీదకు వచ్చినా తమ కంటూ ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్నారు. తెరను ఏలుతున్నారు.