ఆర్నాల్డ్ ష్క్వార్జ్నెగ్గర్.. ఈ పేరు వినగానే టక్కున గుర్తొచ్చేది టెర్మినేటర్ సినిమా. బాడీ బిల్డింగ్ చాంపియన్ షిప్స్, సినిమాలతో కోట్లు సంపాదించాడు. ఆ వచ్చిన సంపాదనను జల్సాలకంటూ ఖర్చు పెట్టేయకుండా ఇన్వెస్ట్ చేయడంలోనూ తెలివిగానే వ్యవహరించాడు. 400 మిలియన్ డాలర్ల పైగా ఆస్తిని ఆర్జించాడు. బాడీబిల్డర్గాను, యాక్టర్‌గాను, గవర్నర్‌గానూ, ఇన్వెస్టర్గాను వివిధ పాత్రల్లో రాణించిన ఆర్నాల్డ్ ఇన్వెస్ట్మెంట్ విశేషాలే ఈ వారం సెలబ్రిటీ స్టోరీ..
ఆర్నాల్డ్ ప్రపంచవ్యాప్తంగా రెసిడెన్షియల్, కమర్షియల్ కాంప్లెక్స్‌లలో ఇన్వెస్ట్ చేశాడు. రెస్టారెంట్లలో, కన్స్ట్రక్షన్ కంపెనీలో పెట్టుబడులు పెట్టాడు. కమర్షియల్ జంబో జెట్లను కొనుక్కుని, లీజుకు ఇచ్చేవాడు. ఇవే కాకుండా షేర్లు, బాండ్లు మొదలైన వాటిల్లో కూడా భారీగానే పెట్టుబడులు పెట్టాడు.
పద్ధతిగా పెట్టుబడి..
ఆర్నాల్డ్ 1968లో తోటి బాడీబిల్డర్తో కలిసి నిర్మాణ సామగ్రి వ్యాపారాన్ని ప్రారంభించాడు. తమ మార్కెటింగ్ వ్యూహాలను జోడించి వ్యాపారాన్ని సక్సెస్ చేశాడు. అందులో వచ్చిన లాభాలతో కొరియర్ తరహా వ్యాపారాన్ని మొదలుపెట్టాడు. బాడీ బిల్డింగ్, ఫిట్నెస్ సంబంధిత ఉత్పత్తులను విక్రయించడం మొదలుపెట్టాడు. ఈ వ్యాపారాలతో వచ్చిన డబ్బును రియల్టీలోకి మళ్లించాడు.
10,000 డాలర్లు పెట్టి అపార్ట్మెంట్ బిల్డింగ్ కొన్నాడు. ఆ తర్వాత అనేక రియల్ ఎస్టేట్ సంస్థల్లో ఇన్వెస్ట్ చేశాడు. తోటి నటులు బ్రూస్ విల్లీస్, సిల్వెస్టర్ స్టాలోన్ తదితరులతో కలిసి ప్లానెట్ హాలీవుడ్ పేరిట రెస్టారెంట్ చెయిన్‌ని కూడా ప్రారంభించాడు. కానీ దాన్నుంచి తర్వాత వైదొలిగాడు. ఇవే కాకుండా, ఓక్ ప్రొడక్షన్స్ అనే సినీ నిర్మాణ సంస్థ, ఫిట్నెస్ పబ్లికేషన్స్ పేరిట ప్రచురణ సంస్థ కూడా ఏర్పాటు చేశాడు.
పాఠాలు
పెట్టుబడులు, లక్ష్యసాధనకు సంబంధించి ఆర్నాల్డ్ నుంచి చాలానే నేర్చుకోవచ్చు. ప్రతి సంవత్సరం ప్రారంభంలో ఆ ఏడాది సాధించాల్సిన లక్ష్యాలను రాసి పెట్టుకునేవాడు. ఇలాంటి అంశాలన్నీ కూడా టోటల్ రికాల్ పేరుతో రాసిన తన బయోగ్రఫీలో పొందుపర్చాడు. లక్ష్యాలపై స్పష్టత, ఇన్వెస్ట్ చేసే ముందు అధ్యయనం, ఎప్పుడూ నెగటివ్‌గా ఉండే వ్యక్తులు.. పరిస్థితుల నుంచి దూరంగా ఉండటం తదితర విషయాలు ఆయన పుస్తకం నుంచి నేర్చుకోవచ్చు. ఎప్పుడు, ఎందులో ఇన్వెస్ట్ చేయాలన్నది తెలియడంతో పాటు ఎప్పుడు వైదొలగాలన్నది కూడా తెలిసి ఉండటం కీలకం అంటాడు ఆర్నాల్డ్. డబ్బు ఎంత సంపాదించామన్నది కాదు.. మన ం ఎంత దాచుకోగలిగామన్నదే ముఖ్యమని చెబుతాడు.
తాను స్టార్‌గా కంటే బిజినెస్ మ్యాన్‌గా అనేక రెట్లు ఎక్కువగా సంపాదించాననే ఆర్నాల్డ్.. డబ్బు అనేది గొప్ప సంతోషాన్నివ్వదంటాడు. ఒకానొక సందర్భంలో..‘నా దగ్గర ఇప్పుడు 50 మిలియన్ డాలర్లు ఉన్నాయి. కానీ ఇంతకంటే చాలా తక్కువగా ఉన్నప్పుడు కూడా ఎంత సంతోషంగా ఉన్నానో ఇప్పుడూ అంతే సంతోషంగా ఉన్నాను. పెద్దగా తేడా ఏమీ లేదు.’ అని చెప్పుకొచ్చాడు.
ఈ టెర్మినేటర్.. మంచి ఇన్వెస్టర్
Published Fri, Apr 11 2014 10:38 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రత్నగిరిపై కుండపోత
షెల్టర్ శ్లాబు కూలి యువకుడి మృతి
ఉపాధి కూలీలపై తేనెటీగల దాడి
పిడుగు పడి మేకల కాపరి మృతి
జగన్‌తోనే సంక్షేమం
కోనసీమలో పలుచోట్ల అకాల వర్షం
హమ్మయ్య చల్లబడింది
IPl 2024: శాంసన్ ఇన్నింగ్స్ వృథా.. రాజస్తాన్‌పై ఢిల్లీ ఘన విజయం
చాహల్ అరుదైన రికార్డు.. టీ20 క్రికెట్ చరిత్రలోనే
టీ20 వరల్డ్‌కప్‌కు ఐర్లాండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement