ఆన్‌లైన్‌ సమస్యలు

Editorial About Guidelines Issued For Online Classes By Central Government   - Sakshi

రోజూ బడి బాదరబందీ ఏమిటన్న బెంగ లేదు... చండామార్కుల వంటి గురువుల ఆగ్రహ నయనాలు తమవైపే తీక్షణంగా చూస్తాయన్న భయం లేదు. అడిగిన ప్రశ్నకు బదులీయకపోతే వీపు పగలవచ్చునన్న బెరుకు లేదు. సెలవులు ఎప్పుడెప్పుడా అన్న చింత లేదు. కరోనా వైరస్‌ మహ మ్మారి పుణ్యమా అని కనీవినీ ఎరుగని రీతిలో నాలుగు నెలలుగా బడులన్నీ తలుపులు మూసుకున్నాయి. పిల్లలంతా వేసవికాలం, వర్షాకాలం తేడా లేకుండా ఇళ్లకే పరిమితమయ్యారు. ఇప్పటికే వారిలో చాలామందికి బడికెళ్తేనే బాగుండునన్న అభిప్రాయం కలిగివుండొచ్చు. కానీ ఈ మహమ్మారి పీడ పోయేదాకా అది సాధ్యమయ్యేలా లేదు.

అందుకే ఒకటి రెండు నెలలుగా ఆన్‌లైన్‌ బోధన అనే మాట వినబడుతోంది. లేడికి లేచిందే పరుగన్నట్టు కొన్ని కార్పొరేట్‌ స్కూళ్లు, కాలేజీలు ఇదే అదునుగా సొమ్ములు పోగేసుకోవచ్చునన్న దురాశతో ఆన్‌లైన్‌ బోధన మొదలుపెట్టేశాయి. కనుకనే తల్లిదండ్రుల నుంచి, విద్యారంగ నిపుణుల నుంచి ఆన్‌లైన్‌ బోధనపై మార్గదర్శకాలను విడుదల చేయాలన్న డిమాండు మొదలైంది. ఆలస్యంగానే అయినా మంగళవారం కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ వీటిని విడుదల చేసింది. 

ఆన్‌లైన్‌ బోధనంటూ మొదలుపెట్టిన పాఠశాలలు, కళాశాలలు మౌలికమైన అంశాలను విస్మ రించాయి. తరగతి గదిలో జరిగే బోధన మాదిరే ఆన్‌లైన్‌లోనూ బోధిస్తే సరిపోతుందని అవి భావిం చాయి. ఎదురుగా ఒక కెమెరా పెట్టుకుని బ్లాక్‌ బోర్డు ముందు టీచర్‌ నించుని చెప్తే ఎప్పటిలానే విద్యార్థికి అవగాహన కలుగుతుందని యాజమాన్యాలు అనుకున్నాయి. కానీ తరగతిలో పిల్లలనుద్దేశించి బోధించడం వేరు. ఆ పిల్లలకే ఆన్‌లైన్‌లో పాఠం చెప్పడం వేరు. పిల్లలు బడికొచ్చి టీచర్‌ చెప్పే పాఠాలు వినడం, నోట్సు రాసుకోవడం మాత్రమే చేయరు. తమ తోటివారితో సంభాషణల్లో నిమగ్నమవుతారు.

అవి బోధనకు సంబంధించి కావొచ్చు... ఊళ్లో జరిగిన ఘటన గురించి కావొచ్చు... ఇంట్లో వచ్చిన కష్టసుఖాల గురించి కావొచ్చు... తమకు ఎదురైన అనుభవం గురించి కావొచ్చు. ఈ క్రమంలో వారికి తమ చుట్టూ వున్న సమాజం గురించి అర్థమవుతుంది. బుద్ధి విక సిస్తుంది. దేన్నయినా నేర్పుగా ఎలా ఎదుర్కొనాలో తెలుస్తుంది. తోటి పిల్లలను వారు అనునిత్యం గమనిస్తారు. ఒక అంశాన్ని వారు అవగాహన చేసుకుంటున్న తీరుకూ, తమ తీరుకూ పోల్చు కుంటారు. మరింత సులభంగా, ప్రభావవంతంగా చదవడం ఎలాగో తెలుసుకుంటారు. వివేచ నాత్మక అధ్యయన నైపుణ్యం అలవడుతుంది. తరగతి గది చర్చల్ని ప్రోత్సహిస్తుంది. ఏకకాలంలో ఉపాధ్యాయులనూ, విద్యార్థులనూ సానబడుతుంది. టీచర్లు చదువు చెప్పి ఊరుకోరు.

తమ ముందున్నవారి ముఖకవళికలు గమనిస్తూ ఎవరికి అవగాహన కలుగుతున్నదో, ఎవరిలో ఇంకా సందేహాలున్నాయో పోల్చుకోగలుగుతారు. వాటిని అడిగేందుకు ప్రోత్సహిస్తారు. వారితో సంభాషిస్తూ... వారి స్థాయికి దిగి బోధించే ప్రయత్నం చేస్తారు. తాము చెప్పే పాఠంపై పిల్లల్లో ఒక రకమైన ఆసక్తిని, అనురక్తిని కలగజేస్తారు. ఈ క్రమంలో మరింత మెరుగ్గా బోధించడమెలాగో తాము కూడా నేర్చుకుంటారు. అటు విద్యార్థులు సైతం తమకు అర్ధమవుతున్నదేమిటో, కానిదేమిటో చెప్పగలిగే సామర్థ్యం అలవర్చుకుంటారు. అంతేకాదు... భిన్న అంశాలపై తార్కికంగా ఆలోచించడం, అభి ప్రాయాలు ఏర్పర్చుకోవడం సాధ్యపడుతుంది. బోధించడమనేది ఒక కళ అయినట్టే... వినడం కూడా కళే. ఆ లక్షణం వారిని ఉన్నతశిఖరాలకు ఎదిగిస్తుంది. చదువుకైనా, ఆటలకైనా, ఇతరత్రా కార్య కలాపాలకైనా తోటివారిని కూడగట్టడం పిల్లలు నేర్చుకుంటారు. ముందురోజు ఇచ్చిన హోంవర్క్‌ పూర్తి చేసుకోవడం, ఎప్పటికప్పుడు అసైన్‌మెంట్లు చేయడం, రోజూ నిర్ణీత సమయానికల్లా బడికి హాజరుకావడం వంటివి పిల్లలను నియమబద్ధ జీవితంవైపు అడుగులేయిస్తాయి. అనంతర కాలంలో సమాజంలో వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతాయి.

దురదృష్టవశాత్తూ ఆన్‌లైన్‌ విద్యాబోధనలో ఇదంతా సాధ్యం కాదు. అవసరమైన మొబైల్‌ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు ఉన్నవారికీ... వాటిని సమకూర్చుకునే స్తోమత లేనివారికీ మధ్య ఎటూ అంతరాలు ఏర్పడుతున్నాయి.  అన్నీ సమకూర్చుకోగలిగినవారు సైతం చదువుకునే క్రమంలో పొందవలసిన జ్ఞానానికి ఆన్‌లైన్‌ విధానం వల్ల దూరమవుతున్నారు. కొన్ని దశాబ్దాలక్రితం దూరవిద్యా విధానం మొదలైనప్పుడు విద్యారంగ నిపుణుల్లో చాలామంది దాన్ని వ్యతిరేకించడానికి ప్రధాన కారణం ఇదే. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆన్‌లైన్‌ బోధన తప్పేలా లేదు. పిల్లల్ని బడికి పంపాలంటే తల్లిదండ్రులు బెంబేలు పడుతున్నారు.

బడిలో ఎన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నా అక్కడికి చేరేలోగా, అక్కడినుంచి తిరిగొచ్చేలోగా ఏమవుతుందోనన్న ఆందోళన వారికుంది. అందుకే సెల్‌ఫోన్‌లు లేదా కంప్యూటర్లు కొనిస్తే చదువుకుంటారని వారనుకున్నారు. అయితే ఎక్కువ సమయం ఆ ఉపకరణాలతో గడిపితే పిల్లల్లో ఏర్పడే సమస్యలపైనా తల్లిదండ్రులకు భయం వుంది. కనుకనే తగిన మార్గదర్శకాలు రూపొందించాలన్న అభిప్రాయం కలిగింది. ప్రీ ప్రైమరీ విద్యార్థులకు రోజుకు అరగంట మించి బోధించరాదని, ఒకటి నుంచి 8వ తరగతి వరకూ రోజుకు రెండు క్లాసులు, అవి కూడా ఒక్కోటి 30–45 నిమిషాల మధ్య మాత్రమే ఉండాలని మార్గదర్శకాలు చెబుతున్నాయి. 9–12 తరగతుల వారికి గరిష్టంగా నాలుగు సెషన్లు మాత్రమే వుండాలని సూచిస్తున్నాయి. వీటిపైనా, ఇతర మార్గదర్శకాలపైనే మరింత లోతుగా చర్చించి, అవసరమైన సవరణలు చేస్తే పిల్లలకు ఉపయోగపడతాయి. బోధనకు రోజులో ఎంత కేటా యించాలన్న అంశంతోపాటు, ఆన్‌లైన్‌ విధానంలో దానికి సృజనాత్మకత జోడించి మరింత ఆసక్తికరంగా తీర్చిదిద్దడమెలాగన్న అంశంపైనా నిపుణులు శ్రద్ధ పెట్టాలి. కరోనాకు వ్యాక్సిన్‌ వచ్చేవరకూ ఇదంతా తప్పదు. 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

04-12-2020
Dec 04, 2020, 14:22 IST
న్యూఢిల్లీ: మరికొన్ని వారాల్లో కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఒక్కసారి శాస్త్రవేత్తల...
04-12-2020
Dec 04, 2020, 13:34 IST
న్యూఢిల్లీ : ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారి ఇప్పుడే వదిలేలా కనిపించడం లేదు. భారత్‌లోనూ విజృంభణ కొనసాగిస్తోంది. ఇప్పటికీ గణనీయ...
04-12-2020
Dec 04, 2020, 11:11 IST
రోగనిరోధక శక్తి పెంచుతుంది.. యాంటీ ఆక్సిడెంట్‌, ఇమ్యూనిటీ బూస్టర్‌  అంటూ కరోనా కాలంలో తేనెను తెగ లాగించేస్తున్నారా?
03-12-2020
Dec 03, 2020, 20:27 IST
న్యూయార్క్‌: ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ను ఆరికట్టేందుకు వ్యాక్సిన్ ఎప్పుడేప్పుడు వస్తుందా అని ప్రపంచ దేశాల ప్రజలు ఎదురు చుస్తున్నారు. ఇప్పటికే బ్రిటన్‌...
03-12-2020
Dec 03, 2020, 17:34 IST
సాక్షి, న్యూఢిల్లీ : ‘ప్రపంచ ప్రజలను భయాందోళనలకు గురి చేస్తోన్న కరోనా వైరస్‌ మహమ్మారిని తుదముట్టించేందుకు ఏడాది కాలంలోగానే ‘కోవిడ్‌’...
03-12-2020
Dec 03, 2020, 13:32 IST
అమెరికాలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో  అమెరికా మాజీ అధ్యక్షులు ముగ్గురు కీలక నిర్ణయాన్ని ప్రకటించారు.
03-12-2020
Dec 03, 2020, 11:29 IST
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారికి వ్యాక్సిన్‌ను బ్రిటన్ ప్రభుత్వం ఆమోదించడంతో  భారతీయులు  బ్రిటన్‌ వెళ్లేందుకు క్యూ కడుతున్నారు....
03-12-2020
Dec 03, 2020, 10:43 IST
ప్రముఖ వ్యాపారవేత్త, పిజ్జా హట్ సహ వ్యవస్థాపకుడు ఫ్రాంక్ కార్నే(82) న్యుమోనియాతో మరణించారు.
03-12-2020
Dec 03, 2020, 10:06 IST
సాక్షి, హైదరాబాద్ ‌: తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 53,686 కరోనా వైరస్‌ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 609 పాజిటివ్‌ కేసులు...
03-12-2020
Dec 03, 2020, 10:05 IST
రాజస్థాన్‌ దౌసాకు చెందిన జైపూర్ మాజీ మహారాజా, మాజీ ఎంపీ పృథ్వీరాజ్ (84) కన్నుమూశారు.
03-12-2020
Dec 03, 2020, 04:09 IST
న్యూఢిల్లీ: ఆశలు చిగురిస్తున్నాయి, ఎదురు చూపులు ఫలించనున్నాయి. 2021 వస్తూ వస్తూ మంచి శకునాలు మోసుకురాబోతోంది కరోనా వ్యాక్సిన్‌ వచ్చే...
03-12-2020
Dec 03, 2020, 01:55 IST
సాక్షి, హైదరాబాద్‌: అక్టోబర్‌లో దసరా.. నవంబర్‌లో దీపావళి.. మరోవైపు చలికాలం.. ఆయా సందర్భాల్లో కరోనా తీవ్రంగా పెరుగుతుందని సర్కార్‌ తీవ్ర...
03-12-2020
Dec 03, 2020, 01:53 IST
లండన్‌: ఫైజర్‌– బయో ఎన్‌ టెక్‌ రూపొందించిన టీకా అత్యవసర వినియోగానికి బ్రిటిష్‌ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఫైజర్‌ వ్యాక్సిన్‌కు...
03-12-2020
Dec 03, 2020, 00:40 IST
మానవాళి అంతా ఆత్రంగా ఎదురుచూస్తున్న కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ శరవేగంతో అందుబాటులో కొస్తోంది. అందరికన్నా ముందు వ్యాక్సిన్‌ తీసుకొచ్చి అగ్రగాములం...
02-12-2020
Dec 02, 2020, 20:42 IST
మాస్కో: ప్రపంచ దేశాలన్ని ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్‌ రేసులో ఉన్నాయి. త్వరగా టీకాని తీసుకువచ్చి.. సురక్షితమని నిరూపించి.. ఇతర దేశాలకు...
02-12-2020
Dec 02, 2020, 15:04 IST
బీజింగ్‌: కరోనా వైరస్‌ ప్రపంచాన్నిగడగడలాడిస్తోంది. మహమ్మారి బారిన పడి లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు...
02-12-2020
Dec 02, 2020, 13:21 IST
కోవిడ్‌-19 కట్టడికి వచ్చే వారం నుంచీ వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నాయి.
02-12-2020
Dec 02, 2020, 10:51 IST
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 565 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటివ్‌...
02-12-2020
Dec 02, 2020, 08:09 IST
గుజరాత్‌కు చెందిన బీజేపీ రాజ్యసభ సభ్యులు అభయ్ భరద్వాజ్  కన్నుమూశారు.
02-12-2020
Dec 02, 2020, 05:26 IST
కరోనాను కట్టడి చేసేందుకు దేశంలోని అందరికీ వ్యాక్సినేషన్‌ చేయాల్సిన అవసరం లేదని, అవసరమైనంత మందికి వ్యాక్సిన్‌ ఇస్తే సరిపోతుందని కేంద్రం...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top