పంటలు కాలువ నీటి పాలు | Pantalu kaluva neeti paalu | Sakshi
Sakshi News home page

పంటలు కాలువ నీటి పాలు

Nov 7 2016 11:05 PM | Updated on Sep 4 2017 7:28 PM

పంటలు కాలువ నీటి పాలు

పంటలు కాలువ నీటి పాలు

మైలవరం జలాశయం ఉత్తర కాలువకు నాలుగు రోజుల క్రితం సాగునీరు విడుదల చేశారు. ఈ సాగు నీరు వల్ల రైతులకు ప్రయోజన కరంగా ఉన్నా కొంతమంది రైతులకు పంట నష్టాన్ని మిగిల్చింది.

రాజుపాళెం:     మైలవరం జలాశయం ఉత్తర కాలువకు నాలుగు రోజుల క్రితం సాగునీరు విడుదల చేశారు. ఈ సాగు నీరు వల్ల రైతులకు ప్రయోజన కరంగా ఉన్నా కొంతమంది రైతులకు పంట నష్టాన్ని మిగిల్చింది. పర్లపాడుకుమ్మరపల్లె గ్రామాల మధ్యలో మైలవరం కాలువకు ఉన్న లైనింగ్‌ తెగిపోవడంతో ఈనీరంతా ఒక్కసారిగా శనగ, జొన్న, మినుము పంటలు నీటమునిగాయి. దాదాపు 80 ఎకరాల వరకు పంట దెబ్బతింది. వివరాల్లోకి వెళితే.. జమ్మలమడుగు మండలం ఉప్పలపాడు గ్రామం నుంచి మొదలయ్యే ఈకాలువ 18వ కిలోమీటరు సైఫాన్‌ వద్ద అమర్చిన సిమెంట్‌ పైపులైను పూడిపోయింది. దీంతో ఒక్కసారిగా కాలువకు వచ్చిన నీరంతా అవతలికి వెళ్లేందుకు వీలులేక  సిమెంట్‌ లైనింగ్‌ తెగిపోయి ఆ నీరంతా పంట పొలాల్లోకి వచ్చింది. అధికారులు నిర్లక్ష్యం వల్ల పంట పొలాల్లోకి ఇలా నీరు వచ్చిందని, ముందస్తుగా ఈలైనింగ్‌ వద్ద పూడిక తొలగించి ఉంటే ఈపరిస్థితి వచ్చేది కాదని రైతులు అంటున్నారు. దీని వల్ల దిగువ ప్రాంతానికి సాగునీరు అడ్డంకిగా మారింది. దిగువన దాదాపు రెండు వేల ఎకరాల వివిధ రకాల పంటలు సాగులో ఉన్నాయి. ఒక్కో రైతు ఎకరాకు రూ.5 నుంచి రూ.10వేల వరకు నష్టం వాటిల్లిందని వాపోతున్నారు. అకస్మాత్తుగా కాలువ లైనింగ్‌ తెగి వచ్చిన నీరు వల్ల తిరిగి రెండోసారి పంట సాగు చేయాల్సిన పరిస్థితిత ఏర్పడింది. ఇప్పటికైనా మైలవరం అధికారులు నిర్లక్ష్యాన్ని వీడి దిగువ ప్రాంతానికి కూడా సాగునీరు అందేటట్లు చర్యలు చేపట్టాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. ఈçపంట నష్టాన్ని ఎవరు తీర్చుతారని రైతులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement