దయ్యాలు తిరుగుతున్నాయి.. | mysterious behaviors in rangareddy district | Sakshi
Sakshi News home page

దయ్యాలు తిరుగుతున్నాయి..

Sep 19 2015 9:25 PM | Updated on Mar 28 2018 11:11 AM

దయ్యాలు తిరుగుతున్నాయి.. - Sakshi

దయ్యాలు తిరుగుతున్నాయి..

'అదిగో.. అటు చూడండి.. దయ్యాలు తిరుగుతున్నాయ్.. మనుషుల్ని పీక్కుతింటాయ్..' అంటూ గత రెండు రోజులుగా హల్ చల్

పెద్దెముల్(రంగారెడ్డి): 'అదిగో.. అటు చూడండి.. దయ్యాలు తిరుగుతున్నాయ్.. మనుషుల్ని పీక్కుతింటాయ్..' అంటూ గత రెండు రోజులుగా హల్ చల్ చేస్తున్న కొందరి వ్యవహారం కుటుంబ సభ్యులకు భయం కలిగించడంతోపాటు చుట్టుపక్కల వారికి ఇబ్బందికరంగా మారింది. రంగారెడ్డి జిల్లా పెద్దేముల్లో ఇలా వింతగా ప్రవర్తిస్తున్న కొందరి వ్యవహారం శనివారం వెలుగులోకి వచ్చింది. అసలు విషయం ఏమంటే..

కల్తీ కల్లుకు అలవాటు పడిన కొందరు వ్యక్తులు అది అందుబాటులో లేకపోవడంతో ఇలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. రాత్రి పూట దయ్యాలు వస్తున్నాయని.. అందరినీ పీక్కొతింటాయని వింత వింతగా మాట్లాడుతున్నారు. దీంతో గ్రామస్థులకు ఈ వ్యవహారం తలనొప్పిగా మారింది. చివరికి పోలీసులకు ఫిర్యాదు చేయాలని గ్రామస్తులు నిర్ణయించుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement