భద్రాద్రి జిల్లాలో భారీ వర్షం | heavy rain in bhadadri dist | Sakshi
Sakshi News home page

భద్రాద్రి జిల్లాలో భారీ వర్షం

May 7 2017 11:16 AM | Updated on Sep 5 2017 10:38 AM

జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆదివారం ఉదయం భారీ వర్షం కురిసింది.

భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆదివారం ఉదయం భారీ వర్షం కురిసింది. అశ్వాపురం, మణుగూరు, బూర్గంపాడు, పినపాక, పాల్వంచ, ములకలపల్లి, భద్రాచలంలో ఉదయం నుంచి ఈదురు గాలులతో కూడిన అకాల వర్షం కురుస్తోంది. ఉరుములు, మెరుపులతో వాతావరణం చల్లబడి పెను గాలులతో కూడిన వర్షం కురుస్తుండటంతో.. రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేతికి వచ్చిన పంట అకాల వర్షాల బారిన పడి తడిసి పోవడంతో.. అన్నదాతలు కన్నీరుమున్నీరవుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement