
'ప్రత్యేక హోదాపై ఇద్దరు నాయుడులవి నాటకాలు'
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదాపై నాయుడు ధ్వజం (చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు) నాటకాలు ఆడుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు.
మంగళగిరి (గుంటూరు): ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదాపై నాయుడు ధ్వజం (చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు) నాటకాలు ఆడుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. సీపీఐ ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా సాధన సమితి శ్రీకాకుళం నుంచి చేపట్టిన బస్సు యాత్ర బుధవారం సాయంత్రం గుంటూరు జిల్లా మంగళగిరికి చేరుకుంది. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ.. ప్రత్యేక హోదాపై ఈనెల 10లోపు కేంద్రం నుంచి స్పష్టమైన ప్రకటన రావాలని, లేకుంటే 11న అఖిలపక్షం ఆధ్వర్యంలో రాష్ట్ర బంద్ చేపడతామన్నారు.
ప్రత్యేక హోదాతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, దీని సాధనకు మరో ఉద్యమానికి సిద్ధం కావాలని ఐక్య కార్యాచరణ సమితి నేతలు ముప్పాళ్ల నాగేశ్వరరావు తదితరులు పిలుపునిచ్చారు.