సుల్తాన్‌పూర్‌ తండాలో ఘోర అగ్ని ప్రమాదం | Fire Accident At Sultanpur Tanda | Sakshi
Sakshi News home page

సుల్తాన్‌పూర్‌ తండాలో ఘోర అగ్ని ప్రమాదం

May 4 2018 1:01 PM | Updated on Sep 5 2018 9:47 PM

Fire Accident At Sultanpur Tanda - Sakshi

పూర్తిగా కాలిపోయిన పశువుల కొట్టం

హవేళిఘణాపూర్‌(మెదక్‌) : పశువుల కొట్టం దగ్ధమై రూ. 4 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిన సంఘటన గురువారం మండలంలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు బాధితుడు, ఆర్‌ఐ శ్రీహరి కథనం ప్రకారం ఇలా ఉన్నాయి. మండలంలోని నాగాపూర్‌ పంచాయతీ పరిధి సుల్తాన్‌పూర్‌ తండాకు చెందిన గుగులోత్‌ లచ్చిరాం పశువుల కొట్టానికి సాయంత్రం మంటలంటుకున్నాయి. ఈ విషయం గమనించిన చుట్టు పక్కల వారు వెంటనే మెదక్‌ అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు.

ఫైర్‌ ఇంజన్‌ వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చే సరికి 28 మేకలు, 22 గొర్లు, 300 గడ్డిమోపులు, రెండు బోరుమోటార్లు, రెండు ఎడ్ల బండ్లు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. విషయం తెలుసుకున్న కానిస్టేబుల్‌ తాహేర్‌ ఆలీ, రాములు, ఆర్‌ఐ శ్రీహరి, వీఆర్‌ఓ పద్మారావులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆర్‌ఐ శ్రీహరి పంచనామా చేసి రూ. 4 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు నిర్ధారించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement