కనిష్టంనుంచి కోలుకున్న రూపాయి | Rupee gains strength opens 26 paise higher against US dollar | Sakshi
Sakshi News home page

కనిష్టంనుంచి కోలుకున్న రూపాయి

Aug 21 2019 10:35 AM | Updated on Aug 21 2019 10:40 AM

Rupee gains strength opens 26 paise higher against US dollar - Sakshi

సాక్షి,ముంబై : దేశీయ కరెన్సీ డాలరు మారకంలో   పుంజుకుంది. మంగళవారం నాటి ఆరు నెలల కనిష్టం నుంచి ఎగిసిన రూపాయి  బుధవారం ఆరంభంలోనే 26 పైసలు ఎగిసి 71.45 వద్ద ఉంది.  ఫెడ్‌ సమావేశం, అమెరికా - చైనా ట్రేడ్‌వార్‌ సమస్య సానుకూలంగా పరిష్కారం కానుందన్నఅంచనా ఇతర కరెన్సీలకు బలాన్నిచ్చిందని ట్రేడర్లు భావిస్తున్నారు. కాగా  డాలరుతో మారకంలో వరుసగా రెండో రోజు కూడా నష్టపోయిన రూపాయి మంగళవారం 71.70 వద్ద ముగిసింది. ఇది ఆరు నెలల కనిష్టంకాగా.. ఇంతక్రితం ఫిబ్రవరి 7న మాత్రమే ఈ స్థాయికి చేరింది. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాదాలు ఇటీవల ప్రపంచ ఆర్థిక వృద్ధిని దెబ్బతీస్తున్న సంకేతాలు వెలువడుతున్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement