అక్బరుద్దీన్ త్వరగా కోలుకోవాలి : వైఎస్‌ జగన్‌ | Ys jagan Praying for the speedy recovery of Akbaruddin Owaisi | Sakshi
Sakshi News home page

అక్బరుద్దీన్ త్వరగా కోలుకోవాలి : వైఎస్‌ జగన్‌

Jun 11 2019 10:04 AM | Updated on Jun 11 2019 11:51 AM

Ys jagan Praying for the speedy recovery of Akbaruddin Owaisi - Sakshi

అక్బరుద్దీన్‌ అనారోగ్యం నుంచి త్వరగా కోలుకుని ఆయురారోగ్యాలతో ఉండాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆకాంక్షించారు.

సాక్షి, హైదరాబాద్‌: మజ్లిస్‌ పార్టీ శాసనసభాపక్ష నేత, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ అనారోగ్యం నుంచి త్వరగా కోలుకుని ఆయురారోగ్యాలతో ఉండాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆకాంక్షించారు. ఈమేరకు తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. కాగా తీవ్ర అనారోగ్యానికి గురైన ఒవైసీ రెగ్యులర్‌ వైద్య సేవల కోసం లండన్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. గత మూడు రోజుల క్రితం అక్బరుద్దీన్‌ తిరిగి ఆకస్మికంగా వాంతులు, తీవ్రమైన కడుపు నొప్పికి గురికావడంతో కుటుంబ సభ్యులు అక్కడి ఆసుపత్రిలో చేర్పించారు.

Advertisement
 
Advertisement
Advertisement