టెక్నాలజీలో మహిళల సేవలు ఆదర్శనీయం

Women's services in technology are ideal - Sakshi

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రశంసలు

సాక్షి, విశాఖపట్నం: శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారతీయ మహిళలు ఆదర్శనీయ మైన సేవలందిస్తున్నారని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కొనియాడారు. రక్షణ, అంతరిక్ష రంగాల్లో, ముఖ్యంగా క్షిపణి పరిజ్ఞానం, రాకెట్‌ ప్రయోగాల్లో ముందుకు దూసుకుపోతున్నారని ప్రశంసించారు. 

రెండు రోజుల పర్యటన నిమిత్తం విశాఖపట్నం వచ్చిన రాష్ట్రపతి గురువారం ఆంధ్రా వర్సిటీ(ఏయూ)లో ఈ–క్లాస్‌రూమ్‌ కాంప్లెక్స్, ఇంక్యుబేషన్‌ సెంటర్‌ భవనాల శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన ప్రసంగించారు.  విశాఖ సాగర తీరంలో  ఏర్పాటు చేసిన టీయూ 142 యుద్ధవిమాన మ్యూజియాన్ని రాష్ట్రపతి  ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు, సీఎం చంద్రబాబు పాల్గొన్నారు.

Back to Top