చెన్నైలో నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తుల అపార్ట్‌మెంట్ కుప్పకూలిన ప్రమాదంలో మృతుల సంఖ్య 22కు చేరింది. మృతు ల్లో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన నలుగురు పురుషులు, నలుగురు స్త్రీలు ఉన్నారు.
మృతుల్లో 8 మంది ఆంధ్రప్రదేశ్ వారు.. శిథిలాల కింద మరికొందరు
చెన్నైలో నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తుల అపార్ట్‌మెంట్ కుప్పకూలిన ప్రమాదంలో మృతుల సంఖ్య 22కు చేరింది. మృతు ల్లో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన నలుగురు పురుషులు, నలుగురు స్త్రీలు ఉన్నారు. మధురైకి చెందిన ఐదుగురు, ఒడిశాకు చెందిన నలుగురి మృతదేహాలను కూడా వెలికితీశారు. మరో ఐదుగురిని గుర్తించాల్సి ఉంది. సోమవారం సాయంత్రం 6 గంటల సమయంలో ఒకేసారి నాలుగు మృతదేహాలను శిథిలాల కింద నుంచి వెలికితీశారు. ఇప్పటి వరకు 23 మందిని తీవ్రగాయాలతో రక్షించారు. శిథిలాల కింద మరికొందరు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మరో 17 మంది ఆచూకీ ఇప్పటికీ తెలియరాలేదు.