రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారికి సమన్యాయం చేసేవిధంగా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షులు వైఎస్ విజయమ్మ చేస్తున్న దీక్షకు మద్దతుగా గురువారం వర్సిటీ బంద్ నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం నాయకులు తెలిపారు.
నేడు యూనివర్సిటీ బంద్
Aug 22 2013 2:39 AM | Updated on Aug 24 2018 2:33 PM
ఏఎన్‌యూ, న్యూస్‌లైన్ : రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారికి సమన్యాయం చేసేవిధంగా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షులు వైఎస్ విజయమ్మ చేస్తున్న దీక్షకు మద్దతుగా గురువారం వర్సిటీ బంద్ నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం నాయకులు తెలిపారు. ఈ మేరకు బుధవారం రిజిస్ట్రార్ ఆర్‌ఆర్‌ఎల్ కాంతంను కలిసి విద్యార్థి విభాగం నాయకులు లేఖ ఇచ్చారు.
ఈ సందర్భంగా విద్యార్థి విభాగం నేత పి.కిషోర్‌బాబు మాట్లాడుతూ గురువారం నిర్వహిస్తున్న వర్సిటీ బంద్‌కు అన్ని విద్యార్థి, సిబ్బంది సంఘాలు సహకరించి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. విజయమ్మ దీక్ష చరిత్రలో నిలిచిపోతుందన్నారు. తెలుగుజాతి పరిరక్షణకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ముందుకు సాగుతోందన్నారు. వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం నాయకులు దర్శనపు శ్రీనివాస్ మాట్లాడుతూ తెలుగుజాతిని విడదీసేందుకు కేసీఆర్ దీక్షచేస్తుంటే ప్రతినిధులను పంపి చర్చలు జరిపిన ప్రభుత్వం తెలుగుజాతి అభివృద్ధిని కాంక్షిస్తూ విజయమ్మ దీక్ష చేస్తుంటే పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు.
కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం నాయకులు రమేష్, రాజు, కిరణ్‌కుమార్, బ్రహ్మయ్య, అనిల్, రాజేష్‌బాబు, మల్లి, అశోక్, నవీన్, కిషోర్, వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావు, వినయ్, లక్ష్మణ్, చంద్ర, నాని తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement