శ్రీవారి సేవలో సుమలత | srivari seva sumalata | Sakshi
Sakshi News home page

శ్రీవారి సేవలో సుమలత

Jun 20 2014 3:57 AM | Updated on Oct 2 2018 2:44 PM

శ్రీవారి సేవలో సుమలత - Sakshi

శ్రీవారి సేవలో సుమలత

సినీతార సుమలత గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. రాత్రి నైవేద్య విరామ సమయంలో ఆమె శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.

తిరుమల: సినీతార సుమలత గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. రాత్రి నైవేద్య విరామ సమయంలో ఆమె శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సుమలత దర్శనం అనంతరం ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు. చాలా రోజుల తరువాత స్వామిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు.

ప్రస్తుతం ఏ చిత్రాల్లోనూ నటించడం లేదని చెప్పారు. రాజకీయలపై కూడా ఆసక్తి లేదన్నారు. ‘చిరంజీవి సినిమాలో అవకాశం వస్తే మళ్లీ నటిస్తారా’ అనే ప్రశ్నకు నవ్వుతూ చూద్దామని సమాధానమిచ్చారు. ఆలయం వెలుపల సుమలతను చూడడానికి అభిమానులు ఉత్సాహం చూపారు. ఆమెతో కలిసి ఫొటోలు, ఆటోగ్రాఫ్‌లు తీసుకున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement