
రెల్లికుల ఐక్యపోరాటసమితి ప్రతినిధులు
శ్రీకాకుళం : ఇంటింటికి తిరిగి కూరగాయలు, పళ్లు అమ్ముకుంటూ, పట్టణాల్లో పారిశుద్ధ్య పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న తమని ఆదుకోవాలని రెల్లి ఐక్యపోరాట సమితి రాష్ట్ర కోఆర్డినేటర్ జలుమూరు అమర్‌నాథ్ కోరారు. పాదయాత్రలో భాగంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి తమ గోడు వెళ్లగక్కారు. రాష్ట్రంలో సుమారు 10 లక్షల మంది జనాభా ఉన్నామని, తమకు ఎస్సీ కార్పోరేషన్ ద్వారా సమన్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాలు కేవలం ఓటు బ్యాంకుగా వాడుకున్నాయని వాపోయారు. రెల్లి కార్పోరేషన్ ఏర్పాటుకు కృషి చేయాలని కోరారు. మన ప్రభుత్వం వచ్చాక తప్పక న్యాయం చేస్తామని జగన్‌మోహన్‌రెడ్డి భరోసా కల్పించారు.