ఎత్తిపోతల పనులు అడ్డగింత | land expats protest at lift irrigation scheme at chintalapudi | Sakshi
Sakshi News home page

ఎత్తిపోతల పనులు అడ్డగింత

May 31 2016 6:27 PM | Updated on Sep 4 2017 1:21 AM

పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులను రైతులు అడ్డుకున్నారు.

చింతలపూడి : పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులను రైతులు అడ్డుకున్నారు. ఎత్తిపోతల పథకం నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోయిన రైతులు పట్టిసీమ తరహాలో తమకు కూడా ఎకరాకు రూ.30 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఈ నెల 23 నుంచి రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. మంగళవారం శిబిరం వద్దకు చేరుకున్న పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు. దీంతో భూ నిర్వాసితులు పనులు జరగకుండా ప్రొక్లెయినర్‌లను అడ్డుకుని ఆందోళనకు దిగారు.
 

Advertisement
 
Advertisement
Advertisement