శ్రీవారి సేవలో సినీ నటుడు శ్రీకాంత్ | film actor srikanth in srivari service | Sakshi
Sakshi News home page

శ్రీవారి సేవలో సినీ నటుడు శ్రీకాంత్

Dec 29 2014 3:39 AM | Updated on Apr 3 2019 8:56 PM

శ్రీవారి సేవలో సినీ నటుడు శ్రీకాంత్ - Sakshi

శ్రీవారి సేవలో సినీ నటుడు శ్రీకాంత్

సినీ నటుడు శ్రీకాంత్, ఊహ తమ కుమార్తె, కుమారులతో కలిసి ఆదివారం స్వామివారిని దర్శించుకున్నారు.

సాక్షి, తిరుమల : సినీ నటుడు శ్రీకాంత్, ఊహ తమ కుమార్తె, కుమారులతో కలిసి ఆదివారం స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయం అనంతరం వారు ఆలయానికి వచ్చారు. శ్రీవారు, వకుళమాతను దర్శించుకుని హుండీలో కానుకలు సమర్పించారు. అనంతరం రంగనాయక మండపంలో వారికి అధికారులు లడ్డూ ప్రసాదాలు అందజేశారు.

ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ హుదూద్ బాధితులకు తెలుగు చిత్ర పరిశ్రమ అండగా నిలిచిందని తెలిపారు. తాను నటించిన ఢీ అంటే ఢీ జనవరిలో విడుదల కానుందని చెప్పారు. నాటు కోడి, జల్సారాయుడు సెట్‌లో ఉన్నాయని తెలిపారు. రెండు రాష్ట్రాల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు  తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement