చంద్రబాబు ఆత్మగౌరవ యాత్ర శవయాత్రగా మారుతుంది: ఆళ్లనాని | Eluru Mla alla nani fire on chandrababu naidu | Sakshi
Sakshi News home page

చంద్రబాబు ఆత్మగౌరవ యాత్ర శవయాత్రగా మారుతుంది: ఆళ్లనాని

Aug 23 2013 1:02 PM | Updated on Sep 1 2017 10:03 PM

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై స్థానిక ఎమ్మెల్యే ఆళ్లనాని శుక్రవారం నిప్పులు చెరిగారు.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై స్థానిక ఎమ్మెల్యే ఆళ్లనాని శుక్రవారం నిప్పులు చెరిగారు. రాష్ట ప్రజలను వంచించడానికే చంద్రబాబు ఆత్మగౌరవ యాత్ర చేపడుతున్నారని ఆళ్లనాని ఆరోపించారు. చంద్రబాబుది ఆత్మగౌరవ యాత్ర కాదని ఆత్మవంచన యాత్ర అని ఆయన ఎద్దేవా చేశారు. శుక్రవారం ఏలూరులో సమైక్యాంధ్రకు మద్దతుగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన నిరసన కార్యక్రమానికి ఆయన తన సంఘీభావం ప్రకటించారు. అనంతరం ఆయన ప్రసగించారు.

 

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి అనుకూలంగా లేఖ ఇచ్చి చంద్రబాబు సీమాంధ్ర ప్రజలను మోసం చేశారని ఆయన గుర్తు చేశారు. అటువంటి చంద్రబాబు యాత్ర పేరుతో ప్రజల ముందుకు ఏవిధంగా వస్తారని ఆళ్లనాని అడిగారు. చంద్రబాబుకు అస్సలు సిగ్గూ శరం ఉన్నాయా అని ప్రశ్నించారు. ఆత్మగౌరవ యాత్ర కావాలంటే తెలంగాణలో చేసుకోవాలిని చంద్రబాబుకు ఆళ్లనాని సూచించారు.

 

సీమాంధ్రలో ప్రజలెవ్వరూ నిన్ను అడుగుపెట్టనివ్వరని ఆయన స్పష్టం చేశారు. సీమాంధ్ర ప్రజల చేతిలో చెప్పుదెబ్బలు, తిరస్కారాలు తప్పవని అన్నారు. ఓ వేళ చంద్రబాబు ఆత్మగౌరవ యాత్ర చేపట్టిన అది ఆయన శవయాత్రగా మారుతుందని ఆళ్లనాని ఈ సందర్బంగా హెచ్చరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement