'చంద్రబాబుకు విదేశీ పిచ్చి పట్టుకుంది' | bhumana karunakar reddy slams chandrababu over BLF-2017 | Sakshi
Sakshi News home page

'చంద్రబాబుకు విదేశీ పిచ్చి పట్టుకుంది'

Nov 3 2016 1:24 PM | Updated on Sep 4 2017 7:05 PM

'చంద్రబాబుకు విదేశీ పిచ్చి పట్టుకుంది'

'చంద్రబాబుకు విదేశీ పిచ్చి పట్టుకుంది'

చంద్రబాబుకు విదేశీ సంస్కృతి పిచ్చి పట్టుకుందని భూమన కరుణాకరరెడ్డి విమర్శించారు.

తిరుపతి: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకు విదేశీ సంస్కృతి పిచ్చి పట్టుకుందని వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి విమర్శించారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా విశాఖపట్నం సముద్ర తీరంలో డిస్కో డాన్సులు నిర్వహించాలని యోచిస్తుండడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. గురువారం  ఆయన విలేకరులతో మాట్లాడుతూ... తెలుగువారి మది నిండా ప్రేమ ఉందని, ఇప్పుడు మళ్లీ ప్రేమికుల దినోత్సవం పేరుతో ఆర్భాటాలు అవసరం లేదని స్పష్టం చేశారు. కేవలం ప్రచారం కోసమే చంద్రబాబు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారని మండిపడ్డారు.

గోవా తరహాలో విశాఖ తీరంలో బీచ్ లవ్ ఉత్సవాన్ని నిర్వహించేందుకు చంద్రబాబు ప్రభుత్వం పూనుకోవడం పట్ల సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఫిబ్రవరి 12 నుంచి ప్రేమికుల దినమైన 14వ తేదీ వరకు మూడురోజుల పాటు బీఎల్‌ఎఫ్-2017 పేరిట ఉత్సవాలు జరగనున్నాయి. ఇది విదేశీ విష సంస్కృతికి బీజమంటూ మహిళా, విద్యార్థి, ప్రజా సంఘాల మండిపడుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement