76 శాతం అనుసంధానం పూర్తి: ఎల్పీజీ కో అర్డీనేటర్ | Sakshi
Sakshi News home page

76 శాతం అనుసంధానం పూర్తి: ఎల్పీజీ కో అర్డీనేటర్

Published Fri, Nov 14 2014 12:46 PM

Aadhar card and bank account link 76 percent over, says LPG state coordinator

హైదరాబాద్: దేశంలో ఎంపికైన 54 జిల్లాల్లో నగదు బదిలీ పథకం శనివారం నుంచి పునరుద్ధించనున్నట్లు ఎల్పీజీ స్టేట్ కో ఆర్డినేటర్ సిహెచ్ శ్రీనివాస్ వెల్లడించారు. శుక్రవారం హైదరాబాద్లో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్లో ఎంపిక చేసిన 9 జిల్లాల్లో 76 శాతం ఆధార్, బ్యాంక్ అకౌంట్ల అనుసంధానం పూర్తి కాగా, తెలంగాణలో ఎంపిక చేసిన 3 జిల్లాల్లో 76 శాతం ఆధార్, బ్యాంకు అనుసంధానం పూర్తి చేసినట్లు ఆయన వివరించారు.

ఆధార్ లేకపోయినా 3 నెలల పాటు నగదు బదిలీ పథకం వర్తిస్తుందని చెప్పారు. ఆధార్ అనుసంధానం చేయకపోతే 6 నెలలు గడువుదాటిన తర్వాత మార్కెట్ ధరకు గ్యాస్ కొనుగోలు చేయాల్సి ఉంటుందన్నారు. సంవత్సరానికి సబ్సీడీపై 12 సిలిండర్లు యధావిధిగా సరఫరా చేస్తామన్నారు.

Advertisement
Advertisement