breaking news
-
ఇల్లు కాదు జైలే..
సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్టై రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఏసీబీ కోర్టులో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. తనను జైలులో కాకుండా హౌస్ రిమాండ్ (ఇంటి వద్ద)లో ఉంచాలంటూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌ను విజయవాడ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం కొట్టి వేసింది. హౌస్ రిమాండ్‌కు సంబంధించి ఏ చట్టంలో కూడా ఎలాంటి నిర్దిష్ట ప్రస్తావన లేదని స్పష్టం చేసింది. అందువల్ల హౌస్ రిమాండ్ విషయంపై విచారణ జరిపే పరిధి ఈ కోర్టుకు (ఏసీబీ కోర్టు) లేదని పేర్కొంది. అంతేకాక హౌస్ రిమాండ్‌లో ఎందుకు ఉంచాలనేందుకు చంద్రబాబు సరైన కారణాలను తమ ముందుంచలేదని తెలిపింది. హౌస్ రిమాండ్ విషయంలో న్యాయస్థానాన్ని పిటిషనర్ ఒప్పించలేకపోయారని, భద్రత విషయంలో ఇంటి వద్ద కంటే జైలు వద్దే ఎక్కువ భద్రత ఉంటుందన్న అభిప్రాయాన్ని ఏసీబీ కోర్టు వ్యక్తం చేసింది. ప్రత్యేక భద్రతా దళం (ఎస్పీజీ) భద్రత ఉన్న వ్యక్తికి అదే స్థాయిలో ఇంటి వద్ద భద్రత కల్పించడం సాధ్యం కాకపోవచ్చునంది. చంద్రబాబు భద్రత కోసం జైలులో పూర్తిస్థాయి చర్యలు తీసుకున్నామన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనను న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంది. మాకేవీ కారణాలు చెప్పాల్సిన అవసరం లేదు తనను జైలులో కాకుండా హౌస్ రిమాండ్‌లో ఉంచేలా ఆదేశాలు ఇవ్వాలంటూ మాజీ సీఎం చంద్రబాబు ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం రోజు సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రా, సీఐడీ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. వాదనలు విన్న ఏసీబీ కోర్టు తన తీర్పును వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం న్యాయస్థానం తన నిర్ణయాన్ని వెలువరించింది. హౌస్ రిమాండ్ పిటిషన్‌ను కొట్టేస్తున్నట్లు తీర్పు వెలువరించింది. కొట్టివేయటానికి కారణాలు ఏమిటో కూడా కోర్టు వివరించింది. ఈ సమయంలో చంద్రబాబు తరఫు న్యాయవాది జోక్యం చేసుకుంటూ తమకేమీ కారణాలు వివరించాల్సిన అవసరం లేదని పేర్కొనగా, కారణాలను వెల్లడించాల్సిన బాధ్యత తమపై ఉందని కోర్టు స్పష్టం చేసింది. హౌస్ రిమాండ్ పిటిషన్ తిరస్కరణకు కారణాలను వివరించింది. జ్యుడీషియల్, పోలీసు రిమాండ్ మాత్రమే ఉన్నాయి.. మాజీ సీఎం చంద్రబాబు కోరుతున్న హౌస్ రిమాండ్ అసాధారణ అభ్యర్థన అని సోమవారం వాదనల సందర్భంగా అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి కోర్టుకు నివేదించారు. ఈ ప్రస్తావన ఏ చట్టంలో కూడా లేదని, అందువల్ల హౌస్ రిమాండ్ మంజూరు చేయడానికి వీల్లేదని వాదించారు. చంద్రబాబుకు ప్రస్తుతం ఉన్న భద్రత కంటే జైలులో ఇంకా ఎక్కువ భద్రత ఉందని వివరించారు. జైలులో చంద్రబాబు భద్రతకు అన్ని రకాల చర్యలు తీసుకున్నామన్నారు. జైలులో చంద్రబాబు భద్రతకు వచ్చిన ముప్పేమీ లేదని తెలిపారు. చట్టంలో కేవలం జ్యుడీషియల్ రిమాండ్, పోలీసు రిమాండ్ మాత్రమే ఉన్నాయని కోర్టుకు నివేదించారు. ఏసీబీ కోర్టు తీర్పు సందర్భంగా ఈ వాదనలను పరిగణలోకి తీసుకుంది. బెయిల్ పిటిషన్ అంటూ హల్చల్... మాజీ సీఎం చంద్రబాబు తరఫున బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తున్నానంటూ ఏసీబీ కోర్టులో మంగళవారం ఓ న్యాయవాది హడావుడి సృష్టించారు. చంద్రబాబు తరఫున ఓ టీడీపీ కార్యకర్త పేరుతో తాను బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తున్నట్లు ఆ న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ పిటిషన్‌పై విచారణ జరపాలని కోరారు. అయితే చంద్రబాబు వకాలత్ ఇవ్వకుండా ఆయన తరఫున ఎలా బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తారని కోర్టులో ఉన్న న్యాయవాదులు చర్చించుకున్నారు. ఆ న్యాయవాది తీరును గమనించిన న్యాయస్థానం ఈ విషయాన్ని చంద్రబాబు తరఫున గత మూడు రోజులుగా వాదనలు వినిపిస్తున్న న్యాయవాదుల దృష్టికి తెచ్చింది. చంద్రబాబు ఎలాంటి బెయిల్ పిటిషన్ దాఖలు చేయలేదని వారు కోర్టుకు తెలియచేయడంతో ఆ విషయాన్ని అక్కడితో వదిలేసింది. సుదీర్ఘ వాదనలు.. సందేహాల నివృత్తి తరువాతే తీర్పు మాజీ సీఎం చంద్రబాబు దాఖలు చేసిన హౌస్ రిమాండ్ పిటిషన్‌పై ఇరుపక్షాల సుదీర్ఘ వాదనలను ఏసీబీ కోర్టు ఎంతో ఓపికగా విన్నది. దాదాపు మూడు గంటలకు పైగా చంద్రబాబు పిటిషన్‌పైనే విచారణ జరిపింది. ఇరుపక్షాల న్యాయవాదులు తమ వాదనలు వినిపించేందుకు ఎంత సమయం తీసుకున్నా వారిని ఏ దశలోనూ కోర్టు నిలువరించలేదు. అటు చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది వినిపించిన ప్రతీ వాదననూ సావధానంగా ఆలకించింది. ఆయన కోర్టు దృష్టికి తెచ్చిన ప్రతీ తీర్పునూ నిశితంగా పరిశీలించింది. వాటి విషయంలో తనకున్న సందేహాలను సైతం ఏసీబీ కోర్టు నివృత్తి చేసుకుంది. అలాగే సీఐడీ తరఫు న్యాయవాది చేసిన వాదనలను సైతం అదే రీతిలో ఆలకించింది. సీఐడీ న్యాయవాదిని కూడా ప్రశ్నించి తన సందేహాలను ఏసీబీ కోర్టు నివృత్తి చేసుకుంది. చివరకు సీఐడీ న్యాయవాది వాదనలతో ఏకీభవిస్తూ తీర్పును వెలువరించింది. చంద్రబాబుకు హౌస్ రిమాండ్ ఎందుకు ఇవ్వడం లేదో కోర్టు హాలులోనే చాలా స్పష్టంగా వివరించింది. తమకేమీ కారణాలను చెప్పాల్సిన అవసరం లేదని చంద్రబాబు తరఫు న్యాయవాది గట్టిగా వ్యాఖ్యానించినా కూడా, తన బాధ్యత మేరకు కారణాలను వెల్లడిస్తున్నట్లు స్పష్టం చేసింది. గత మూడు రోజులుగా చంద్రబాబు తరఫు న్యాయవాదులు వరుసగా పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తున్నా, తీవ్రమైన పని భారం ఉన్నప్పటికీ అన్ని పిటిషన్లను ఏసీబీ కోర్టు చాలా ఓపికగా విచారించింది. ఎక్కడా కూడా ఎలాంటి తొందరపాటుకు ఆస్కారం లేకుండా విచారణ జరుపుతూ వస్తోంది. న్యాయవాదులతో, ఇతరులతో (చంద్రబాబుకు చెందిన వ్యక్తులు) కోర్టు హాలు కిక్కిరిపోయినప్పటికీ ఏ దశలోనూ ఒత్తిడికి లోనుకాకుండా ఏసీబీ కోర్టు తన బాధ్యతలను నిర్వర్తించింది. -
వ్యవసాయ బావిలో దూకి కుమార్తెతో కలిసి దంపతుల ఆత్మహత్య
కొత్తవలస(విజయనగరం జిల్లా): ఆ కుటుంబానికి ఏం కష్టమొచ్చిందో తెలియదు. ఆరోగ్యం, ఆర్థికంగా బాగానే ఉన్నా... ఊరు కాని ఊరు వచ్చి కుమార్తెతో కలిసి దంపతులిద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన విజయనగరం జిల్లా కొత్తవలస మండలం చింతలపాలెం గ్రామ సమీపంలో మంగళవారం చోటుచేసుకోంది. పోలీసులు, స్థానికులు, మృతుల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖలోని ఓ షిప్పింగ్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న మహ్మద్ మొహిసుద్దీన్ (46) మర్రిపాలెం సమీపంలో ఎఫ్‌సీఐ కాలనీలో ఉంటున్నాడు. అతడికి భార్య సంషినిషా (38), కూతురు ఫాతిమా జహీదా (17), కుమారుడు మహ్మద్ ఆలీ ఉన్నారు. అతడు విజయనగరం జిల్లా కొత్తవలస మండలం చింతలపాలెం గ్రామ సమీపంలో గతంలో కొంత భూమి కొనుగోలు చేశాడు. ఆ భూమిని చూసేందుకు దంపతులిద్దరూ, కుమార్తె క్యాబ్ బుక్ చేసుకొని ఇంటి నుంచి సోమవారం వచ్చారు. సాయంత్రం వరకు ఆ ప్రాంతంలో తిరిగారు. ఇంతలో ఏమైందో గానీ ముగ్గురూ గ్రామ సమీపంలోని వ్యవసాయ బావిలోదూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. బావిగట్టుపై మృతుడికి చెందిన సెల్‌ఫోన్, తమ బంధువులకు సంబంధించిన ఫోన్ నంబర్లు రాసిన కాగితం, ఇతర వస్తువులు ఉండడాన్ని స్థానికులు గుర్తించారు. బావిలోకి చూడగా మృతదేహాలు తేలియాడడం గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో సీఐ ఎస్.చంద్రశేఖర్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ దొరికిన ఆధారాలతో ఫోన్ చేసి మృతుడు మొహిసుద్దీన్ కొడుకు మహ్మద్ ఆలీకి సమాచారం అందించారు. మృతుల కటుంబ సభ్యులు, బంధువులు ఘటనా స్థలానికి చేరుకొని మృతులను గుర్తించారు. ఆలీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శవ పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఎస్.కోట సీహెచ్‌సీకి తరలించినట్లు సీఐ చంద్రశేఖర్ తెలిపారు. మృతురాలు జిహీదా విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. కొడుకు ఆలీ ఎంబీఏ చదువుతున్నాడు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ ఘటనా స్థలాన్ని విజయనగరం డీఎస్పీ ఆర్.గోవిందరావు సందర్శించారు. క్లూస్ టీమ్‌తో క్షుణ్ణంగా పరిశీలించారు. అన్ని కోణాల్లోనూ పరిశీలిస్తున్నట్టు ఆయన తెలిపారు. మృతుల సెల్ఫోన్లను ఓపెన్ చేసి కాల్‌డేటాను సేకరిస్తున్నట్టు డీఎస్పీ తెలిపారు. కాల్ డేటా సేకరిస్తే ఆత్మహత్యకు గల కారణాలు తెలిసే అవకాశం ఉంటుందన్నారు. ఎయిర్‌పోర్టు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు గోపాలపట్నం: కొత్తవలస మండలం చింతలపాలెం గ్రామ సమీపంలో కుమార్తెతో కలిసి దంపతులిద్దరూ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటనతో మర్రిపాలెం ఎఫ్‌సీఐ కాలనీలో విషాదం నెలకొంది. సోమవారం ఉదయం వెళ్లిన తల్లిదండ్రులు చెల్లి ఎంతకీ రాకపోవడంతో కుమారుడు మహ్మద్ ఆలీ ఎయిర్‌పోర్టు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఇంతలో ముగ్గురు మృతి చెందిన వార్త తెలియడంతో కుమారుడు, బంధువులు, స్థానికులు కన్నీరుమున్నీరయ్యారు. ఉదయం వరకు సరదాగా ఉన్న వాళ్లు ఎందుకు ఇంత పనిచేశారంటూ గుండెలవిసేలా రోదించారు. అప్పులే కారణమా...? గతంలో షిప్పింగ్ కంపెనీలో పనిచేసిన మొహిసుద్దీన్ కొన్నాళ్లగా సొంతంగా కాంట్రాక్ట్ పనులు చేపడుతున్నాడు. దీంతో కొంతమేరకు అప్పుల పాలైనట్లు సమాచారం. ఆత్మహ్యతకు ఇది కారణం కావచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
‘హౌస్ రిమాండ్‌లో ఏమైనా జరిగితే ఎవరిది బాధ్యత?’
సాక్షి, విజయవాడ: స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అరెస్టయిన ప్రధాన ముద్దాయి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి ఏసీబీ కోర్టులో ఊరట దక్కలేదు. ఆయన తరపున దాఖలైన హౌజ్ రిమాండ్ కస్టడీ పిటిషన్‌ను ఏసీబీ కోర్టు మంగళవారం సాయంత్రం కొట్టేసింది. ఏపీ సీఐడీ వాదనతో ఏకీభవించిన కోర్టు.. జైల్లోనే ఆయనకు భద్రత ఉంటుందని స్పష్టంగా పేర్కొంటూ హౌజ్ రిమాండ్ పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్లు తీర్పునిచ్చింది. ఏసీబీ కోర్టు న్యాయమూర్తి తీర్పు సందర్భంగా.. ఇంట్లో వుండే భద్రత కంటే.. జైల్లో వుండే భద్రత ఎక్కువ. ఒకసారి కోర్టు రిమాండ్ విధించింది అంటే.. అది వ్యవస్థ బాధ్యత. హౌస్ రిమాండ్ కావాలని అడుగుతున్నారు. కానీ, అక్కడ ఏమైనా జరిగితే ఎవరిది బాధ్యత?. జైల్లో భద్రత కల్పిస్తున్న వాటిపై అన్ని అంశాలు స్పష్టంగా సీఐడీ చెప్పింది. జ్యూడిషియల్ కస్టడీలో ఉన్న వ్యక్తులకు ఎన్ఎస్జీ సెక్యూరిటీ ఇవ్వాలనే అంశాన్ని కోర్టులో చూపకపోవడంతో డిస్మిస్ చేస్తున్నాం. హౌస్ కస్టడీలో ఉంచేందుకు చట్టపరమైన నియమ నిబంధనలను ఏసీబీ కోర్టు ఎదుట చూపలేదు. ఈ కారణాలతో హౌస్ అరెస్టుకు సంబంధించిన పిటిషన్ కొట్టివేస్తున్నాం. స్కిల్ స్కాంలో ఏ1 చంద్రబాబు నాయుడికి ఏసీబీ కోర్టు విధించిన 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్‌ను.. హౌజ్ రిమాండ్‌గా పరిగణించాలని, ఈ మేరకు ఇంట్లోనే ఉండేందుకు ‘హౌజ్ అరెస్ట్’ ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ చంద్రబాబు తరపు న్యాయవాదులు ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. అయితే ఈ విజ్ఞప్తిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కౌంటర్ దాఖలు చేసింది ఏపీ సీఐడీ. చంద్రబాబుకు ప్రాణహాని ఉందంటూ ప్రధానంగా పేర్కొన్న చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ్ లూద్రా.. చంద్రబాబుకు ఉన్న ఎన్ఎస్జీ భద్రత, వీవీఐపీ, 73 ఏళ్ల వయస్సు, ఆరోగ్యాన్ని పరిగణనలోకి తీసుకుని హౌస్ అరెస్ట్‌కు అనుమతి ఇవ్వాలంటూ వాదనలు వినిపించారు. ఈ క్రమంలో 2018 భీమా కోరేగావ్ హింస కేసులో నిందితుడు.. మానవ హక్కుల సంఘం కార్యకర్త గౌతమ్ నవలఖాకు సుప్రీం కోర్టు ‘హౌజ్ అరెస్ట్’ వీలు కల్పించిన కేసును ప్రస్తావించారు కూడా. అయితే సీఐడీ.. రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబుకు ముప్పు లేదని.. ఆయన పూర్తి భద్రతలో ఉన్నారని.. జైలులో ప్రత్యేక గది, ఇంటి భోజనం, మందులు, వ్యక్తిగత సహాయకుడిని కల్పించామని, చంద్రబాబు బయట ఉంటే సాక్షులని ప్రభావితం చేసే అవకాశముందని.. గృహ నిర్బంధం పిటిషన్‌కి విచారణ అర్హత లేదని.. పిటిషన్ తిరస్కరించాలని సీఐడీ తరఫున గట్టి వాదనలు వినిపించారు సుధాకర్ రెడ్డి. ఇరు వర్గాల వాదనలు విన్న విజయవాడ ఏసీబీ న్యాయమూర్తి.. సీఐడీ వాదనలతోనే ఏకీభవించారు. చంద్రబాబు హౌజ్ కస్టడీ పిటిసన్‌ను కొట్టివేస్తున్నట్లు తీర్పు ఇచ్చారు. ప్రైవేట్ హౌజ్‌లో అంత భద్రత ఎక్కడ?: ఏఏజీ ‘‘సీఆర్పీసీలో రెండు కస్టడీలు మాత్రమే ఉన్నాయి. అవి జ్యూడీషియల్, పోలీస్ కస్టడీలు. హౌజ్ అరెస్ట్ అనేది లేనే లేదు. చట్టం ముందు అందరూ సమానమే. చంద్రబాబుకి పూర్తి భద్రత ఉంది. రాజమండ్రి జైలులో హైసెక్యూరిటీ ఉంది. ప్రైవేట్ హౌజ్‌లో అంత భద్రత ఎక్కడ ఉంటుంది. పైగా చంద్రబాబు కోసం ఇంటి నుంచే ఆహారం పంపించేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. చంద్రబాబు విన్నపాలను పరిగణనలోకి తీసుకున్నాం. బాబు అనుమతి లేనిదే వారి బ్లాక్‌కూ ఎవరూ వెళ్లరు. బాబు ఆరోగ్య పర్యవేక్షణకు వైద్యులు అందుబాబులో ఉంటారు.’’ ఎఫ్ఐఆర్లో ఆయన పేరు లేదనడం తప్పుడు సంకేతాలు పంపినట్లవుతుంది. ఎఫ్ఐఆర్లో పేరు లేకపోతే తప్పు చేయలేదని కాదు. చంద్రబాబు పాత్ర దర్యాప్తులో బయటపడింది. దర్యాప్తులో వెల్లడైన వివరాల మేరకే చంద్రబాబు పేరు. :::తీర్పు అనంతరం ఏజీజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి -
రామోజీ, శైలజాలకు బిగ్ షాక్..
సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్‌ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆర్థిక అవకతవకలు, తప్పుడు రికార్డుల నిర్వహణ, నిధుల మళ్లింపు, ఇతర చట్ట ఉల్లంఘనలపై రామోజీరావు, శైలజా కిరణ్‌లతో పాటు ఆ సంస్థకు చెందిన పలువురు కీలక వ్యక్తులు, ఉద్యోగులకు హైకోర్టు నోటీసులు జారీచేసింది. ఈ కేసులో తాము దాఖలు చేసిన చార్జిషీట్లను గుంటూరు, విశాఖపట్నంలోని డిపాజిటర్ల పరిరక్షణ చట్టం ప్రత్యేక కోర్టులు ‘రిటర్న్’ చేస్తూ గత నెల 28న జారీచేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ సీఐడీ దాఖలు చేసిన అప్పీళ్లపై హైకోర్టు విచారణ జరిపింది. ఈ అప్పీళ్లలో ప్రతివాదులుగా ఉన్న మార్గదర్శి చైర్మన్ చెరుకూరు రామోజీరావు, ఎండీ శైలజా కిరణ్, ఆడిటర్ కుదరవల్లి శ్రవణ్‌లతో పాటు వైస్ ప్రెసిడెంట్లు, డైరెక్టర్లు, జనరల్ మేనేజర్లు, బ్రాంచ్ మేనేజర్లు ఇలా మొత్తం 15 మందికి నోటీసులు జారీచేసింది. కౌంటర్లు దాఖలు చేయాలని వీరందరినీ ఆదేశించింది. విచారణ 18కి వాయిదా.. తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. మార్గదర్శి చిట్‌ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆర్థిక అవకతవకలు, తప్పుడు రికార్డుల నిర్వహణ, నిధుల మళ్లింపు, ఇతర చట్ట ఉల్లంఘనలపై చిట్స్ అసిస్టెంట్ రిజిస్ట్రార్లు సీఐడీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా రామోజీరావు, శైలజా కిరణ్‌లతో పాటు మొత్తం 15 మందిపై ఐపీసీ, డిపాజిటర్ల పరిరక్షణ చట్టం, చిట్‌ఫండ్ చట్టాల కింద సీఐడీ కేసులు నమోదు చేసింది. ప్రత్యేక కోర్టుల్లో చార్జిషీట్లు.. దర్యాప్తు చేసి డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద ఏర్పాటైన ప్రత్యేక కోర్టుల్లో చార్జిషీట్లు దాఖలు చేసింది. వీటిని పరిశీలించిన ప్రత్యేక కోర్టులు వాటిని రిటర్న్ చేశాయి. గుంటూరులో ప్రిన్సిపల్ జిల్లా జడ్జి ఉత్తర్వులు జారీచేయగా, విశాఖపట్నంలో మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి ఉత్తర్వులిచ్చారు. ఈ రెండు కోర్టులు కూడా ఆగస్టు 28వ తేదీనే ఉత్తర్వులు వెలువరించడం విశేషం. రెండు కోర్టులు ఇచ్చిన ఉత్తర్వులు దాదాపుగా ఒకే రకంగా ఉండటం మరో విశేషం. ఈ రెండు కోర్టులిచ్చిన ‘రిటర్న్’ ఉత్తర్వులను సవాలు చేస్తూ సీఐడీ హైకోర్టులో గత వారం క్రిమినల్ అప్పీళ్లు దాఖలు చేసింది. ఈ అప్పీళ్లపై సోమవారం జస్టిస్ శ్రీనివాసరెడ్డి విచారణ జరిపారు. ఇది కూడా చదవండి: చంద్రబాబు కేసు అప్డేట్స్.. ఏసీబీ కోర్టులో సీఐడీ మరో పిటిషన్ -
ఆర్థిక నేరగాళ్లకు ‘స్నేహ’హస్తం!
సాక్షి, రాజమహేంద్రవరం: ‘స్నేహ బ్యారక్’.. ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. రాజమండ్రి సెంట్రల్ జైల్లోని ఈ బ్యారక్‌కు అంత క్రేజ్ ఎందుకంటే.. ఆర్థిక నేరాల్లో రిమాండ్‌కు వచ్చే ఖైదీలకు ఆ బ్యారక్‌ను కేటాయిస్తుంటారు. ప్రస్తుతం స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో జ్యుడీషియల్ రిమాండ్ అనుభవిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు సైతం అదే బ్యారక్ కేటాయించడంతో ఆ బ్లాక్ పేరు మరింతగా ప్రాచుర్యంలోకి వచ్చింది. జైలుకు 150 ఏళ్ల చరిత్ర రాజమండ్రి సెంట్రల్ జైలుకు 150 ఏళ్లకుపైగా చరిత్ర ఉంది. అత్యంత భద్రతతో కూడిన జైల్‌గా దీనికి పేరు. జైల్లో చిన్నవి, పెద్దవి కలిపి 11 బ్లాక్‌లు ఉన్నాయి. ఒక్కో బ్లాక్‌కు కనిష్టంగా 6 రూములు ఉంటాయి. ఇలా మొత్తం 52 గదులు ఉన్నాయి. 1602లో డచ్ దేశస్థులు కోట నిర్మిస్తే.. దానిని 1864లో బ్రిటిష్ పాలకులు జైలుగా మార్చారు. 1870లో పూర్తి స్థాయి కేంద్ర కారాగారంగా తీర్చిదిద్దారు. 190 ఎకరాల్లో విస్తరించిన జైల్లో సుమారు 152.76 ఎకరాలు ఖాళీ స్థలం కాగా, 37.24 ఎకరాల్లో భవనాలు ఉన్నాయి. అప్పట్లో నిర్మించిన భవనాలు నేటికీ చెక్కుచెదరలేదు. ఇటీవల కొన్నింటిని ఆధునీకరించారు. చంద్రబాబుకు ప్రత్యేక వసతులు అధునాతన వసతులతో నిర్మించిన స్నేహ బ్లాక్‌లో 13 గదులు ఉంటాయి. చంద్రబాబు రిమాండ్‌కు వచ్చిన సందర్భంగా అప్పటికే ఉన్న ఖైదీలను ఖాళీ చేయించి బ్యారక్ మొత్తం ఆయనకే కేటాయించారు. ఇతర బ్యారక్ల నుంచి ఖైదీలు ఎవరూ అటు వైపు వెళ్లకుండా కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టారు. వీఐపీలకు ఉండే సౌకర్యాలన్నీ కల్పించారు. అందులో ఒక గదిని అత్యంత సౌకర్యవంతంగా తయారు చేసి బాబుకు కేటాయించారు. గదిలో ఫ్యాన్, సేదతీరేందుకు సౌకర్యమైన బెడ్, న్యూస్ పేపర్, ఏసీ కూడా ఏర్పాటు చేసినట్లు తెలిసింది. అయితే గదిలో ప్రత్యేకంగా టీవీ ఉండదు. కామన్ ఏరియాలో ఉంటుంది. బయటకు వెళ్లి ఇతర ఖైదీలతో కలసి టీవీ చూసే వెసులుబాటు చంద్రబాబుకు లేదు. 24 గంటల పాటు వైద్యులను అందుబాటులో ఉంచారు. ఇక చంద్రబాబుకు మందులు, భోజనం లాంటి సేవలు అందించేందుకు ప్రత్యేకంగా ఒక వ్యక్తిని కేటాయించారు. నలుగురు వ్యక్తిగత భద్రత సిబ్బందిని పహారా పెట్టారు. వీరితో పాటు 24 గంటలూ జైలు సిబ్బంది బ్యారక్ చుట్టూ కాపలా ఉంటారు. చంద్రబాబుకు ముందు ఈ బ్లాక్‌ను ఎర్రచందనం అక్రమ రావాణా కేసులో రిమాండ్‌కు వచ్చిన వారికి కేటాయించారు. ఇది కూడా చదవండి: చంద్రబాబుకు జైలు భోజనమే పెట్టాలి -
స్నేహితుడి భార్యను కాపాడబోయి..
అనంతపురం సిటీ: రైలు కిందపడబోతున్న స్నేహితుడి భార్యను కాపాడబోయి ఓ మిత్రుడు ప్రాణాలు కోల్పోయాడు. వివరాలు.. ఉత్తరప్రదేశ్‌లోని ఆవాజ్‌పూర్‌కు చెందిన రక్షపాల్ (34), తన స్నేహితుడు మున్నాకుమార్, అతని భార్య హీరామతితో కలసి రాప్తాడు మండలం హంపాపురం వద్ద ఉన్న సిమెంట్ ఇటుకల ఫ్యాక్టరీలో దిన కూలీగా పనిచేస్తున్నాడు. ఆదివారం ఉత్తరప్రదేశ్‌కు మున్నాకుమార్, హీరామతి దంపతులను రైలు ఎక్కించేందుకు తోడుగా రక్షపాల్ అనంతపురంలోని రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాడు. ఆదివారం రాత్రి 11.30 గంటలకు రైలు స్టేషన్‌కు చేరుకోగానే బోగిని వెతుక్కొని మున్నాకుమార్ ఎక్కేలోపే రైలు ముందుకు కదిలింది. ఆ సమయంలో హీరామతి రైలు ఎక్కే ప్రయత్నంలో కాలు జారి ప్లాట్‌ఫామ్‌కు రైలుకు మధ్య ఇరుక్కుపోయింది. ఆమెను కాపాడే ప్రయత్నంలో రక్షపాల్ కూడా రైలు–ప్లాట్ ఫామ్ మధ్య ఇరుక్కుపోయాడు. బోగిలోని చైన్‌ను మున్నాకుమార్ లాగడంతో రైలు కొద్ది దూరం వెళ్లి ఆగింది. అప్పటికే హీరామతి కుడి పాదం తెగిపడింది. రక్షపాల్ తలకు బలమైన గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే సర్వజనాస్పత్రికి తరలించారు. చికిత్స అందేలోపు రక్షపాల్ మృతి చెందాడు. హీరామతిని మెరుగైన వైద్యం కోసం కర్నూలు పెద్దాస్పత్రికి తీసుకెళ్లారు. రక్షపాల్కు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఘటనపై జీఆర్పీ ఎస్ఐ విజయ్‌కుమార్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
Babu in Jail : చంద్రబాబు రిమాండ్ ఆర్డర్లో కీలకాంశాలు
స్కిల్‌స్కామ్ కేసులో విజయవాడ ACB ప్రత్యేక కోర్టు.. చంద్రబాబు రిమాండ్ ఆర్డర్ కాపీలో కీలక అంశాలను ప్రస్తావించింది. చంద్రబాబునాయుడిని కోర్టు ముందు హాజరు పరిచినప్పుడు CID అధికారులు కేసుకు సంబంధించి పూర్తి రికార్డులు, 700 పేజీలలో సమర్పించారని నివేదికలో తెలిపింది. నంద్యాలలో సెప్టెంబర్ 9, 2023, శనివారం రోజు 6గంటలకు చంద్రబాబును అరెస్ట్ చేసినట్టు పేర్కొన్నారు. చంద్రబాబు అవినీతికి ఆధారాలు ఇవే.. 👉: 30.1.2015న స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్‌ను ఉన్నత విద్యా మండలి ద్వారా నడిపించేందుకే సుబ్బారావును ఎక్స్ అఫిషియో సభ్యునిగా నియమించిన చంద్రబాబు అవినీతికి తెరలేపారు. 👉: ఈ కేసులో కీలక పాత్ర పోషించిన సీమెన్స్ డైరెక్టర్ జీవీఎస్ భాస్కర్ సతీమణి అపర్ణను స్కిల్ డెవలప్మెంట్ కార్పేరేషన్లో డిప్యూటి సీఈఓగా నియమించారు. ఈమెను మూడునెలల ముందే ప్రజంటేషన్లో భాగస్వామ్యం చేయడంతో పాటు ప్రాజెక్టు వివరాలన్నీ అపర్ణకు షేర్ చేశారు. 👉: రూల్సుకు విరుద్ధంగా… సీమెన్స్ నుంచి 90శాతం నిధులు రాకుండానే నేరుగా ప్రభుత్వం వాటా అయిన 10శాతం నిదులు మొత్తం 371కోట్లు రిలీజ్ చేయాల్సిందిగా కార్యదర్శి పివి రమేష్, చీఫ్ సెక్రటరీని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. సాక్ష్యధారాలు మాయం చేసిన చంద్రబాబు… 👉: డిజైన్‌టెక్ వ్యవహారం బయటకు రావడంతో చంద్రబాబు అండ్ కో సాక్ష్యాధారాలను మాయం చేసింది. ఏకంగా 30.06.2016న విడుదలైన జీవో నెంబర్-4కు సంబంధించిన ఒరిజినల్ నోట్ ఫైల్‌ను సుబ్బారావు OSD NVK ప్రసాద్(ఏ-5) ద్వారా మాయం చేశారు. 👉: ఈ కేసులో నిధులు కొల్లగొట్టేందుకు… 20.10.2014న స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ చార్టెడ్ అకౌంటంట్గా లక్ష్మినారాయణ(A-4) బంధువు వెంకటేశ్వర్లును జీవో నెంబర్- 48 ద్వారా నియమించారు చంద్రబాబు విచారణను అడ్డుకునే ప్రమాదం ఉంది… 👉: చంద్రబాబు తన పరపతితో విచారణను అడ్డుకునే ప్రమాదం ఉంది. సాక్షులను బెదిరించి దర్యాఫ్తును ప్రబావితం చేసే ప్రమాదం ఉంది. 👉: చంద్రబాబు రిమాండ్ తరలించి దర్యాఫ్తు సజావుగా జరిగిలే చూడాల్సిన అవసరం ఉందని సీఐడీ కోరింది. 👉: ఈ కేసులో అధికారులతో పాటు ఇతర సాక్ష్యులతో మరింత సమాచారం సేకరించాల్సి ఉంది. 👉: చంద్రబాబునాయుడు తన అధికారం అడ్డుపెట్టుకుని 279కోట్ల నిధులు మాయం చేసిన కేసులో ప్రధాన నిందితుడు. చంద్రబాబు వాదనలపై… 👉: కేవలం రాజకీయ కారణాలతోనే తనను అరెస్టు చేసినట్లు చంద్రబాబు ఆరోపిస్తున్నారు. కక్ష్యసాధింపులో భాగంగానే అరెస్టు చేశారని వాదించారు. కాని దర్యాప్తు అధికారులు సమర్పించిన ఆధారాలనూ చూస్తే పూర్తి సాంకేతిక ఆధారాలు సెక్షన్ 167కింద రిమాండ్ చేశారని అర్ధమవుతోంది. 👉: రాజకీయ కక్ష్య కారణమన్నది పూర్తిగా అసంబద్ధం. 👉: ఇది అవినీతి నిరోదక శాఖ కాబట్టి సీఐడికి విచారణ పరిధిలేదన్న చంద్రబాబు వాదన సరైంది కాదు. గతంలో హైకోర్టు చాలా కేసుల్లో సీఐడికి అధికారాలున్నాయని డిక్లరేషన్ ఇచ్చింది. 👉: అవినీతి నిరోదక కేసులను పీసీ యాక్ట్ కింద సీఐడీ నేరుగా విచారణ చేయవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. 👉: ప్రజాప్రతినిధుల చట్టాన్ని ఉల్లంఘించి తనకు సంక్రమించిన అధికారాలను దుర్వినియోగం చేసి 279కోట్లను అక్రమంగా అవినీతి చేసి ప్రభుత్వానికి నష్టం కలిగించారు. 👉: చంద్రబాబు నిందితులు సుబ్బారావు, లక్ష్మినారాయణతో కలిసి కుట్రచేసినట్లు పూర్తి ఆధారాలున్నాయి. ఈ ఆధారాలు అవినీతి నిరోధక చట్టం పరిధిలో ఉన్నాయి. ఈ ఆధారలను బట్టి ఈ కేసులో సెక్షన్ ఐపీసీ 120బీ, 109 సెక్షన్లు పెట్టడం సబబే. కుంభకోణం బయటకు ఎలా వచ్చింది? తాము చెల్లించిన పన్నులకు సంబంధించి కొంత మొత్తం తమకు రావాలంటూ ఆదాయంపన్ను శాఖను డిజైన్ టెక్ సిస్టమ్స్ సంప్రదించింది. దీనిపై అనుమానం వచ్చిన ఐటీ అధికారులు మొత్తం కూపీ లాగారు. 2015 నుంచి 2018 మధ్య కాలంలో ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు రూ.241 కోట్లు షెల్ కంపెనీలకు రూట్ అయినట్టు గుర్తించారు. దీనిపై ఆదాయంపన్ను శాఖ, ఎన్ఫోర్స్మెంట్ శాఖ ఆరా తీయడంతో మొత్తం వ్యవహారం బయటకు వచ్చింది. 👉: చంద్రబాబు రిమాండ్ కాపీ పూర్తి డాక్యుమెంట్ కోసం క్లిక్ చెయ్యండి -
LIVE Updates : చంద్రబాబు హౌజ్ అరెస్టుపై విచారణ రేపటికి వాయిదా
రాజమండ్రి జైల్లో చంద్రబాబు ఖైదీ నెంబర్ 7691గా ఉన్నారు. నిన్న టిడిపి నేతలు, ఎల్లో మీడియా హడావిడి చూస్తే.. ఈ రోజు కోర్టు ప్రారంభం కాకముందే బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తారని అంతా భావించారు, కానీ చంద్రబాబు తరపు లాయర్లు ఎలాంటి బెయిల్ పిటిషన్ కోర్టులో వేయలేదు. చంద్రబాబును జైల్లో వద్దు, గృహ నిర్భంధంలో ఉంచండి అంటూ బాబు తరపు లాయర్లు వేసిన పిటిషన్‌పై వాదనలు జరిగాయి. ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్, పొన్నవోలు సుధాకర్ రెడ్డి, చంద్రబాబు తరపున సిద్ధార్థ లుథ్రా వాదనలు వినిపించారు 7.10PM - కేసు విచారణ రేపటికి వాయిదా ► ఏసీబీ కోర్టులో ఇవ్వాళ్టికి ముగిసిన వాదనలు 6.30pm - ఏసీబీ కోర్టులో మళ్లీ విచారణ ప్రారంభం ► చంద్రబాబు హౌజ్ కస్టడీ పిటిషన్ పై మళ్లీ వాదనలు ప్రారంభం ► ఏసిబీ కోర్టులో వాదనలు వినిపిస్తున్న సిఐడీ తరపు న్యాయవాది ► చంద్రబాబుకు జైల్లో పూర్తి భద్రత ఉందని చెప్పిన CID లాయర్ 5.07pm - చంద్రబాబు తరపున వరుస పిటిషన్లపై కోర్టు ఆగ్రహం 5.50pm - వాదనలకు విరామం ప్రకటించిన న్యాయమూర్తి 5.07pm - చంద్రబాబు తరపున వరుస పిటిషన్లపై కోర్టు ఆగ్రహం ► కోర్టులో ఎన్నో అంశాలుంటాయి ► ఒక పిటిషన్ వాదనలు పూర్తి కాకముందే మరో పిటిషనా? ► దేనికయినా ఒక ప్రొసీజర్ ఉంటుంది ► మిగతా కేసులు జాప్యం కావా? ► ఏ పిటిషన్ అయినా మధ్యాహ్నం 12లోపు వేయాలి ► నేరుగా పిటిషన్ వేసి వాదనలు వినాలనడం సరికాదు 5.06pm - బాబుకు మినహాయింపులేమీ వద్దు : పొన్నవోలు ► చంద్రబాబును హౌజ్ అరెస్ట్‌కు అనుమతిస్తే కేసును ప్రభావితం చేసే ప్రమాదం ► CRPCలో హౌజ్ అరెస్ట్ అనేదే లేదు ► మరో 2 కేసుల్లోనూ చంద్రబాబు నిందితుడిగా ఉన్నారు 5.05pm - చంద్రబాబుకు వెసులుబాటు ఇవ్వాలి : లూథ్రా ► చంద్రబాబుకు జైలులో ప్రమాదం ఉంది ► జైలులో కరుడుగట్టిన నేరగాళ్లు ఉంటారు ► చంద్రబాబుకు జైలులో కల్పించిన భద్రతపై అనుమానం ఉంది 4.50pm - కేసు డాక్యుమెంట్లు కావాలి : లుథ్రా ► స్కిల్ కుంభకోణం కేసుకి సంబంధించి పూర్తి వివరాలు కావాలి ►సిట్ కార్యాలయంలో డాక్యుమెంట్లని పరిశీలించడానికి అనుమతించండి ►సెక్షన్ 207 ప్రకారం అనుమతి ఇవ్వాలి ►పిటిషన్ వేసిన లాయర్ సిద్దార్ద లూథ్రా 4.45pm - చంద్రబాబు హౌస్ కస్టడీ పిటిషన్‌పై క్లారిఫికేషన్ కోరిన ఏసీబీ కోర్టు ►సుప్రీంకోర్టులోని కొన్ని కేసులను ఉదహరించిన బాబు తరపు న్యాయవాదులు ►కోట్ చేసిన కేసులకు సంబంధించి వివరాలు అడిగిన న్యాయమూర్తి ►చంద్రబాబు హౌజ్ అరెస్టు పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో ముగిసిన వాదనలు ►త్వరలోనే ఆదేశాలు వెలువడే అవకాశం 4.15pmచంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ లుథ్రా ►చంద్రబాబు ఇప్పటివరకు ఎన్ఎస్జీ భద్రతలో ఉన్నారు ►చంద్రబాబుకు జైలులో కల్పించిన భద్రతపై అనుమానం ఉంది ►హౌజ్ కస్టడీకి సంబంధించి గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఉంది ►గౌతం నవార్కర్ కేసు పరిశీలించండి ►హైకోర్టుకు వెళ్లి తెచ్చుకున్న భద్రత పెంపు ఆదేశాలు అమల్లో ఉన్నాయి ►చంద్రబాబును హౌస్ కస్టడీకి అనుమతి ఇవ్వాలి 3.30pm : AAG పొన్నవోలు సుధాకర్ రెడ్డి ►రాజమండ్రి సబ్ జైల్ 50 అడుగుల గోడ, అక్కడికి ఎవరు రాలేరు ►రాజమండ్రి జైల్ కంటే మించిన సెక్యూరిటీ ఎక్కడా ఉండదు ►అలాగే డాక్టర్స్ 24 గంటలు అందుబాటులో ఉంటారు ►కాబట్టి చంద్రబాబుకు హౌజ్ అరెస్ట్ అవసరం లేదు ►చంద్రబాబుకు ఇంట్లో కంటే జైల్లోనే భద్రత ఉంటుంది ►చంద్రబాబు ఆరోగ్యం బాగుంది ►చంద్రబాబు భద్రత.. ఆరోగ్యంపై అనుక్షణం ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది. 3.20pm : అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ ►చంద్రబాబు భద్రతకి ఎటువంటి ఇబ్బంధులు లేవు ►రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబు కి గట్టిభద్రత కల్పించాం ►జైలులో చంద్రబాబుకి ప్రత్యేక గదితో పాటు సిసి కెమెరాల పర్యవేక్షణ కొనసాగుతోంది ►చంద్రబాబు భద్రతపై తీసుకున్న చర్యలపై జైళ్ల శాఖ డిజి ఆదేశాల లేఖని మీ ముందు ఉంచుతున్నా ►జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న నిందితుడి భధ్రతా బాధ్యత ప్రభుత్వానిదే ►చంద్రబాబు కోరిన విధంగా కోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబుకి ఇంటి భోజనం, మందులు అందుతున్నాయి ►చంద్రబాబుకి భద్రత కొనసాగుతోంది ►గృహ నిర్బందం పిటిషన్ డిస్మిస్ చేయాలి ►ఈ పిటిషన్‌ను కోర్టు పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు ►చంద్రబాబు సాక్ష్యులను ప్రభావితం చేసే ప్రమాదం ఉంది 3:00pm 3గంటల తర్వాత చంద్రబాబు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ సిద్ధం చేసినట్టు టిడిపి వర్గాల్లో ప్రచారం జరిగింది. ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ వేస్తారని, 437(1) ప్రకారం మధ్యంతర బెయిల్ పిటిషన్ వేస్తారని, రెండు పిటిషన్లను న్యాయవాదులు ఒకేసారి దాఖలు చేయనున్నట్టు సమాచారం. మరో వైపుచంద్రబాబుతో కుటుంబ సభ్యుల ములాఖత్ రద్దు అయినట్టు టిడిపి వర్గాల సమాచారం. చంద్రబాబును కుటుంబ సభ్యులు రేపు కలవాలని భావిస్తున్నట్టు తెలిసింది. ఇటు రాజమండ్రిలోనే ఉన్న లోకేష్ బస్సులోనే ముఖ్య నేతలతో సమావేశం జరిపినట్టు సమాచారం. చంద్రబాబు అరెస్టు తర్వాతి పరిణామాలపై చర్చించిన టిడిపి నేతలు.. స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో బయటపడ్డ ఆధారాలపై మంతనాలు జరిపారు. కొందరు సీనియర్లు లోకేష్‌తో కేసు బలంగా ఉందని చెప్పినట్టు సమాచారం. ACB Court Live Updates ►చంద్రబాబు హౌస్ రిమాండ్ పిటిషన్ పై కొనసాగుతున్న వాదనలు ►సీఐడీ తరఫున ఏజీ శ్రీరామ్, ఏఏజీ పొన్నవోలు వాదనలు ►చంద్రబాబు హౌజ్ అరెస్టు పిటిషన్‌ను తిరస్కరించాలన్న సీఐడీ కౌంటర్ పిటిషన్ ►రాజమండ్రి జైలులో పూర్తి భద్రత మధ్య చంద్రబాబు ఉన్నారు ►బాబును హౌజ్ అరెస్టులో ఉంచాల్సిన అవసరం లేదు ►ఆర్థిక నేరాల్లో ఉన్న నిందితుడికి హౌజ్ అరెస్ట్ అనేది అవసరం లేదు ► చంద్రబాబు హౌజ్ అరెస్ట్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేసింది ఏపీ సీఐడీ. సీఆర్పీసీలో హౌజ్ అరెస్ట్ అనేదే లేదు. బెయిల్ ఇవ్వలేదు కాబట్టే హౌజ్ రిమాండ్ కోరుతున్నారు. అరెస్ట్ సమయంలో చంద్రబాబు ఆరోగ్యంగా ఉన్నారు అని సీఐడీ కౌంటర్ కాపీలో పేర్కొంది. ► చంద్రబాబు ఇన్నర్ రింగ్ రోడ్ కుంభకోణంలో అరెస్ట్ కోరుతూ ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్ ( ప్రిజనర్ ట్రాన్సిట్ వారెంట్) వేశారు సిట్ తరపు న్యాయవాదులు. ఈ క్రమంలో.. కోర్టుకి 6 వేల పేజీల డాక్యుమెంట్లు సమర్పించినట్లు తెలుస్తోంది. మరో కేసులో చంద్రబాబు అరెస్ట్ కోసం పీటీ వారెంట్? విజయవాడ ఏసీబీ కోర్టులో.. సీఐడీ మరో పిటిషన్ దాఖలు చేసింది. అమరావతి ఇన్నర్ రింగ్‌రోడ్ కేసులో కూడా చంద్రబాబు అరెస్ట్ కోసం పీటీ వారెంట్(పీటీ వారెంట్ (ప్రిజనర్ ఇన్ ట్రాన్సిట్) కోరింది. 2022లో నమోదైన కేసులో పీటీ వారెంట్‌పై బాబును విచారించేందుకు కోర్టు అనుమతి సీఐడీ కోరింది. ఈ కేసులో ఏ1గా చంద్రబాబు, ఏ2గా నారాయణ, ఏ6గా నారా లోకేష్ ఉన్నారు. చంద్రబాబును విచారించాల్సిన అవసరం ఉందని పిటిషన్లో పేర్కొంది సీఐడీ. ► చంద్రబాబు కస్టడీ కోరుతూ ఏపీ సీఐడీ వేసిన పిటిషన్‌పై మధ్యాహ్నం 2.30కి వాదనలు జరగనున్నాయి. ప్రభుత్వం తరపున ఏఏజీ పొన్నవోలు.. చంద్రబాబు తరపున లాయర్ సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించనున్నారు. అదే సమయంలో.. భద్రతా కారణాల రీత్యా చంద్రబాబు రిమాండ్‌ను.. హౌజ్ అరెస్ట్‌గా పరిగణించాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌పైనా ఏసీబీ న్యాయమూర్తి వాదనలు వినే అవకాశం ఉంది. ► చంద్రబాబు హౌజ్ అరెస్ట్ పిటిషన్‌పై మధ్యాహ్నాం తర్వాత విచారణ జరగనుంది. ► చంద్రబాబు హౌజ్ అరెస్టుకు అవకాశం ఇవ్వాలని ఆయన తరపున న్యాయవాదులు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో విచారణ కొనసాగుతోంది. అయితే ఏఏజీ అందుబాటులో లేరని.. సమయం ఇవ్వాలని సిట్ స్పెషల్ జీపి న్యాయమూర్తిని కోరారు. దీంతో.. హౌజ్ కస్టడీ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని జడ్జి ఆదేశిస్తూ.. విచారణ మధ్యాహ్నానికి వాయిదా వేశారు. ఈ పిటిషన్‌పై విచారణ అనంతరమే ఆదేశాలేవైనా ఇస్తామని న్యాయమూర్తి చంద్రబాబు లాయర్లకు స్పష్టం చేశారు. ► ఏఏజీ స్పందన స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో చంద్రబాబు నుంచి సీఐడీ ఇంకా వివరాలు సేకరించాల్సి ఉందని సీఐడీ తరపున వాదనలు వినిపిస్తున్న అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి చెబుతున్నారు. చంద్రబాబు తరపున ఇంకా బెయిల్ పిటిషన్ దాఖలు కాలేదు. ఏసీబీ కోర్టు తీర్పు కాపీ ఇవాళ అందుతుంది. చంద్రబాబుని ఐదురోజుల కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ వేశాం. చంద్రబాబు భద్రతా పరంగా చూసుకుంటే.. రాజమండ్రి సెంట్రల్ జైలు కంటే మంచి చోటు ఉండదు అని ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి.. హౌజ్ అరెస్ట్ పిటిషన్ పరిణామంపై స్పందించారు. ఎఫ్ఐఆర్ లో పేరులేకపోయినా దర్యాప్తు తర్వాత పేర్లు చేర్చొచ్చు. FIR అనేది దర్యాప్తునకు మొట్టమొదటి అడుగు. దర్యాప్తులో ఎవరి ప్రమేయం బయటపడినా , వాళ్ల పేర్లు చేర్చొచ్చు. FIR లో లేదు కాబట్టి ముద్దాయి కాదంటే , న్యాయసూత్రాలకు విరుద్ధం - ఈ కేసు ఏపీ ప్రభుత్వం పెట్టింది కాదు అని ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి తెలిపారు. ► చంద్రబాబును జైల్లో ఉంచడం ప్రమాదకరం - హౌస్ అరెస్ట్ పిటిషన్ పై మా వాదనలు వినిపిస్తాం - గతంలో వెస్ట్ బెంగాల్ మంత్రుల విషయంలో సుప్రీం కోర్టు తీర్పును ప్రస్తావిస్తాం - బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తున్నాం : అడ్వకేట్ కౌన్సిల్ సిద్ధార్ద్ లూద్రా ► విజయవాడ కోర్టులో మరోసారి హౌజ్ అరెస్ట్ పిటిషన్ వేయనున్న లూథ్రా!. ఎన్ఎస్జీ సెక్యూరిటీ వీవీఐపీగా ఉన్న చంద్రబాబు నాయుడను హౌజ్ అరెస్ట్ చేయాలని, భద్రతా కారణాల వల్ల ప్రత్యేక అనుమతి ఇవ్వాలని కోర్టును కోరే ఛాన్స్ కనిపిస్తోంది. ► ఏసీబీ కోర్టు తీర్పు కాపీ కోసం చంద్రబాబు లాయర్ల ఎదురుచూపులు. తీర్పులోని అంశాల ఆధారంగానే.. బెయిల్ పిటిషన్ ఏసీబీ కోర్టులో దాఖలు చేయాలా? హైకోర్టులో వేయాలా? అనే దానిపై నిర్ణయం తీసుకునే ఛాన్స్. ఏసీబీ కోర్టుకు వచ్చిన చంద్రబాబు తరపు లాయర్లు విజయవాడ కోర్టుకు వచ్చిన సిద్ధార్థ్ లూథ్రా , ఇతర లాయర్లు. సీఐడీ కస్టడీ పిటిషన్ పై చంద్రబాబు తరపున తన వాదనలు వినిపించనున్న లూథ్రా. అలాగే బెయిల్ పిటిషన్ ఎక్కడ వేయాలన్నదానిపైనా లీగల్ టీంతో చర్చలు. సాక్షి, విజయవాడ: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసుకు సంబంధించి.. విజయవాడ ఏసీబీ కోర్టు ముందుకు పిటిషన్లు విచారణకు రానున్నాయి. స్కిల్ స్కాంలో ప్రధాన ముద్దాయి అయిన చంద్రబాబును తమ కస్టడీకి ఇవ్వాలని, తద్వారా మరిన్ని వివరాలు రాబట్టగలిగే అవకాశం కల్పించాలని ఏపీ సీఐడీ ఏసీబీ కోర్టును కోరనుంది. స్కిల్ స్కామ్ కేసుపై ఇవాళ మొత్తం మూడు పిటిషన్లు విచారణకు రానున్నాయి. ముందుగా విచారణకు రానుంది చంద్రబాబు కస్టడీ పిటిషన్. ఐదురోజులపాటు కస్టడీకి ఇవ్వాలని సీఐడీ తరపు న్యాయవాదులు కోరనున్నాయి. అలాగే.. ఏ 1 ముద్దాయి చంద్రబాబుని లోతుగా విచారించాల్సిన అవసరం ఉందని సిట్ అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు విచారణలో చంద్రబాబు తమకు సహకరించలేదని కోర్టుకు విన్నవించారు అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి. దీనికి కౌంటర్‌గా చంద్రబాబు తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తారు. ఇక.. కస్టడీ పిటీషన్ పై విచారణ తర్వాత చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ జరగనుంది. మరోవైపు హైకోర్టుని ఆశ్రయించే ఆలోచనలో చంద్రబాబు తరపు న్యాయవాదులు ఉన్నట్లు తెలుస్తోంది. రిమాండ్ రిపోర్ట్ ని రిజెక్ట్ చేయాలని హై కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేయనున్నట్లు తెలుస్తోంది. కానీ, జైలుకు తరలించడం తో హౌస్ అరెస్ట్ పిటిషన్ విచారణకు తీసుకోరని సీనియర్ న్యాయవాదులు చెబుతున్నారు. దీంతో ఏసీబీ కోర్టులోనే బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేయొచ్చని తెలుస్తోంది. -
భర్త ఇంటి ముందు రెండో భార్య దీక్ష
చేజర్ల (సోమశిల): భర్త ఇంటి ముందు అతని రెండో భార్య దీక్షకు దిగిన ఘటన అనంతసాగరం మండలం రేవూరులో ఆదివారం జరిగింది. స్థానికుల సమాచారం మేరకు.. రేవూరుకు చెందిన పోలయ్య అనంతసాగరం విద్యాశాఖ కార్యాలయంలో సీఆర్పీగా విధులు నిర్వహిస్తున్నారు. పోలయ్యకు ఇది వరకే పెళ్లి అయింది. మనస్పర్థలు కారణంగా భార్యాభర్తలు విడిపోయారు. దీంతో మస్తాన్‌బీ అనే మహిళ అతనికి దగ్గర కావడంతో 12 ఏళ్ల నుంచి సహ జీవనం చేస్తున్నట్లు తెలిపారు. పోలయ్య మరో పెళ్లి చేసుకుని మస్తాన్‌బీని వదిలించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుసుకుని ఆమె ఈ విషయమై రెండు నెలల క్రితం జిల్లా పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. శనివారం రాత్రి భర్త పోలయ్య, అతని మూడో భార్య, బంధువుల మస్తాన్‌బీపై దాడి చేశారు. తీవ్ర గాయాలైన అక్కడే కూర్చుని దీక్ష కొనసాగిస్తోంది. తనకు న్యాయం చేయాలని ఆమె కోరుతోంది. -
ప్చ్.. బాబు 23 సెంటిమెంట్
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, విజయవాడ/రాజమహేంద్రవరం: చంద్రబాబును సీఐడీ అధికారులు ఆదివారం అర్ధరాత్రి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. జైలు అధికారులు ఆయనకు రిమాండ్ ఖైదీ నంబర్ 7691 కేటాయించారు. షెల్ కంపెనీల ముసుగులో నిధులు కొల్లగొట్టడంలో ప్రధాన భూమిక పోషించిన ఆయనపై సిట్ మోపిన అభియోగాలతో విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానం ఏకీభవించింది. చంద్రబాబుకు న్యాయస్థానం 14 రోజులపాటు అంటే ఈ నెల 22 వరకు రిమాండ్ విధించింది. దాంతో చంద్రబాబును జ్యుడిషియల్ రిమాండ్ కోసం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించాలని సిట్ అధికారులు నిర్ణయించారు. న్యాయస్థానంలో అధికారిక లాంఛనాలు పూర్తి చేశాక సిట్ అధికారులు జైళ్ల ఎస్కార్ట్‌తో ప్రత్యేక కాన్వాయ్‌లో విజయవాడ నుంచి తరలించారు. ప్రతిపక్ష నేతగా ప్రభుత్వం కల్పించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనంతో కూడిన కాన్వాయ్‌తోపాటు ప్రత్యేక బస్‌లో భద్రతా సిబ్బందితోపాటు ఎన్ఎస్జీ భద్రతా సిబ్బంది కూడా అనుసరించారు. విజయవాడ నుంచి ఆదివారం రాత్రి 10 గంటలకు చంద్రబాబు కాన్వాయ్ బయలుదేరింది. మార్గం మధ్యలో కాన్వాయ్‌లోని ఓ వాహనం (చంద్రబాబు ప్రయాణిస్తున్న వాహనం కాదు) బ్రేక్ డౌన్ అయ్యింది. దాంతో ఆ వాహనాన్ని పక్కన పెట్టేశారు. విజయవాడ నుంచి రాజమహేంద్రవరం వరకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ సమస్య లేకుండా ముందుగానే పోలీసులు రోడ్డు క్లియరెన్స్ చేశారు. చంద్రబాబును తరలిస్తున్న కాన్వాయ్ అర్ధరాత్రి ఒంటి గంట అనంతరం సురక్షితంగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు చేరుకుంది. అనంతరం రిమాండ్ ఖైదీ చంద్రబాబును జైలు అధికారులకు అప్పగించారు. జ్యుడిషియల్ రిమాండ్‌కు సంబంధించిన అధికారిక లాంచనాలు పూర్తి చేసి, ఆయనకు రిమాండ్ ఖైదీ నంబర్ 7691 కేటాయించారు. ఆ తర్వాత జైలులో స్నేహ బ్లాక్‌లోని ప్రత్యేక గదికి తరలించారు. కోర్టు ఆదేశాలతో ఆయనకు ప్రత్యేకంగా ఆహారం, అవసరమైన మందులు, ఇతర వసతులు కల్పించనున్నారు. రిమాండ్ ఖైదీగా చంద్రబాబును సెంట్రల్ జైలుకు తరలించడంతో ఎన్ఎస్జీ భద్రతా సిబ్బంది తాత్కాలికంగా ఆయన భద్రతా విధుల నుంచి వైదొలిగారు. చంద్రబాబు వెంట తనయుడు నారా లోకేష్, టీడీపీ నాయకులు జైలు వద్దకు చేరుకున్నారు. అధికారుల నుంచి అనుమతులు రాగానే జైలు లోపలికి వెళ్లిన లోకేష్ తిరిగి కొద్ది సేపటికే బయటకు వచ్చేశారు. జైలు అధికారుల సమావేశం చంద్రబాబుకు రిమాండ్ విధించిన నేపథ్యంలో రాజమహేంద్రవరం జైలు అధికారులు అత్యవసర సమావేశం నిర్వహించారు. బాబుకు గది కేటాయింపు మొదలు వివిధ అంశాలపై చర్చించారు. మాజీ ముఖ్యమంత్రి కావడంతో ఖైదీలకు ఇచ్చే డ్రస్ ఉండదని, మామూలుగా ఆయన ధరించే దుస్తులకు అనుమతిస్తామని చెప్పారు. కాగా, రాజమండ్రిలో భద్రతా ఏర్పాట్లను పోలీసు ఉన్నతాధికారులు దగ్గరుండి పర్యవేక్షించారు. ఖైదీ నంబర్.. సోషల్ మీడియాలో వైరల్ రిమాండ్ ఖైదీగా చంద్రబాబుకు 7691 నంబరు కేటాయించడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 7 + 6 + 9 + 1 = 23 కావడమే అందుకు కారణం. 2019 ఎన్నికల్లో టీడీపీకి 23 సీట్లే వచ్చాయి. చంద్రబాబు అరెస్ట్ అయిన తేదీ 9–9–23. ఆ అంకెలు కలిపితే మొత్తం 23 అవుతోంది. దాంతో ఈ అంశంపై సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అయ్యాయి. -
Babu @ Jail : న్యాయం గెలిచింది!
45 ఏళ్ళ రాజకీయ జీవితంతో కోర్టు బోన్ ఎక్కకుండా... ఎన్నో నేరాలు, ఘోరాలు చేసినా తప్పించుకున్న చంద్రబాబు, ఇప్పుడు మొట్టమొదటి సారిగా కటకటాల పాలవుతున్నాడు! తాను తప్పించుకునేందుకు మొత్తం భూమ్యాకాశాల్నీ ఏకం చేసినా... తప్పించుకోలేని తప్పులు చేసి మొట్టమొదటి సారిగా బోన్ ఎక్కాడు, జైల్లోకి వెళుతున్నాడు! తప్పు చేయనివాడిని నీతిమంతుడు అంటారు గానీ... తప్పులు చేయటమే పనిగా పెట్టుకుని, దొరక్కుండా మేనేజ్ చేసుకుంటూ తప్పించుకు తిరుగుతున్నవాడిని నీతిమంతుడంటారా? చివరికి తన సుప్రీం కోర్టు లాయర్ లూధ్రా, తన 15 మంది లాయర్ల వాదనలే కాకుండా... తానే లాయర్‌గా మారి వాదించినా చంద్రబాబుకు రిమాండ్ తప్పలేదు! చంద్రబాబు నాయుడు చేసిన వాదనలు చూస్తే... ఎక్కడా, తాను అవినీతి చేయలేదని చెప్పలేదు! బయట ప్రెస్‌మీట్ పెట్టిన అచ్చెన్నాయుడు కూడా, తమ చంద్రబాబు నీతిమంతుడని ఎక్కడా చెప్పలేదు! చివరికి ఎల్లో మీడియా కూడా! బాబు చేసినవన్నీ టెక్నికల్‌గా వాదనలే తప్ప... * తనను 24 గంటల్లోపు కోర్టులో ప్రవేశపెట్టలేదని * గవర్నర్‌కు చెప్పలేదని * 48 గంటలు అయిపోయింది... వదిలేయాలని * రిమాండ్ రిపోర్టులో చంద్రబాబు పేరు మొదట్లో లేదని * నంద్యాల కోర్టులోనే చంద్రబాబును ప్రవేశపెట్టి ఉండాలని * పీసీ యాక్ట్ ప్రకారం వారం ముందు నోటీస్‌లు ఇవ్వాలని... ఇలాంటి వాదనలు చేశారు తప్ప.... చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన ఈ కుంభకోణంలో ఆయన పాత్ర లేదని ఎక్కడా వాదించకపోవటం గమనించాల్సిన విషయం! అంటే... నేను అవినీతి పరుడిని కాదు... ఎలాంటి విచారణకైనా సిద్ధం లాంటి పదాలు చంద్రబాబు నోట రావటం లేదు! అంతే కాకుండా, ఎలాంటి జ్యుడీషియల్ స్రూటినీకి అయినా నిలబడతాను అని; అవినీతి జరగనే లేదని చంద్రబాబుగానీ, ఆయన లాయర్లుగానీ వాదించకపోవటం... రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ గమనించాల్సిన విషయం! స్కిల్ స్కాం అనేదే లేదని చంద్రబాబు, టీడీపీ, ఎల్లో మీడియాల్లో ఏ ఒక్కటీ చెప్పటం లేదు! వారి వాదనంతా... మా బాబుకు సంబంధం ఏమిటి అన్నది మాత్రమే! దీని అర్థం... బాబు, తప్పించుకునేందుకు అన్ని ప్రయత్నాలూ చేశాడన్నది, ఈ సారి తప్పించుకోవటం కుదరలేదన్నది! మా చంద్రబాబును జైల్లో పెడతారా అని ఆవేశపడి అరిచే వాళ్ళలో ఏ ఒక్కరూ... మా చంద్రబాబు ఎలాంటి విచారణకైనా సిద్ధం... ఎలాంటి దర్యాప్తు అయినా ఎదుర్కొంటాడు, ఆదాయానికి మించిన ఆస్తుల కేసుతో సహా, అని అనకపోవటాన్ని గమనించాలి! ఎందుకంటే చంద్రబాబు... వీరప్పన్ మాదిరిగా దొరకని దొంగే తప్ప, దొంగ కాదు అనటానికి ఎలాంటి ఆధారాలూ లేవు! అవినీతి, చట్ట విరుద్ధ కార్యక్రమాలు... అధికారాన్ని అడ్డం పెట్టుకుని వ్యవస్థల మేనేజ్మెంట్, ఇందుకు ఒక వర్గం ఎల్లో మీడియా మద్దతు... ఇవన్నీ ఈ రాష్ట్రంలో నాలుగు దశాబ్దాలుగా చంద్రబాబు రాజకీయాలు తెలిసిన వారందరికీ తెలుసు! * చివరికి ఎన్టీఆర్‌ను ఆయన సీఎం పదవి లాక్కున్నా... * తెలంగాణలో ఓటుకు కోట్లిస్తూ దొరికినా... ప్రతి సందర్భంలో బాబు దొంగతనాల్ని ఎల్లో మీడియా, టీడీపీతో పాటు... పవన్ కళ్యాణ్, సీపీఐ నారాయణ, రామకృష్ణ లాంటి వారు నిరంతరం సమర్థిస్తూ వచ్చారు! సుజనా, సీఎం రమేశ్ లాంటి వారిని బాబు, తన అవినీతి మేనేజ్‌మెంట్‌కే వేరే పార్టీలకు పంపాడు! ఇప్పుడు పురంధేశ్వరి కూడా అదే జాబితాలో చేరిపోయి బాబు కోసం లాబీయింగ్ చేసే బృందంలో చేరిపోయి; చివరికి కేంద్ర ప్రభుత్వ ఐటీ షోకాజ్ నోటీస్‌లకు కూడా విలువ లేదని చెపుతూ చంద్రబాబుకు ఎంతటి విలువ ఇచ్చారో చూస్తున్నాం! ఇక పవన్ కళ్యాణ్ అయితే చంద్రబాబు కోసం నడి రోడ్డుమీద నడక నుంచి పడక వరకు ఎందుకైనా రెడీ అయిపోయాడు! ప్యాకేజీ స్టార్‌కు బాబే చట్టం, బాబే రాజ్యాంగం, బాబే పీసీ యాక్ట్, బాబే ఐపీసీ, బాబే సీఆర్పీసీ! ఇదీ పరిస్థితి! ఇక తెలుగుదేశం పార్టీ, ఎల్లో మీడియా కంబైన్డ్‌గా సృష్టించి, నారు–నీరు పోస్తున్న రకరకాల బృందాలు, JACలు, విశ్లేషకులు... వీరంతా స్లీపర్ సెల్స్‌గా చంద్రబాబు నడుపుతున్న ఒక ముఠాకు సపోర్టింగ్ వ్యవస్థ. చదవండి: చంద్రబాబుకు జైలే -
Babu @ Jail : బెయిల్ కాదు చంద్రబాబుకు జైలే
సాక్షి, విజయవాడ: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబుకు రిమాండ్ విధించింది ఏసీబీ కోర్టు. స్కిల్ డెవలప్ మెంట్ పేరిట చంద్రబాబు భారీ కుంభకోణానికి పాల్పడ్డారన్న కేసుకు సంబంధించి ఈరోజు(ఆదివారం) ఏసీబీ కోర్టులో వాదనలు జరిగాయి. సుదీర్ఘంగా ఏడున్నర గంటలపాటు ఇరుపక్షాల వాదనలు విన్న ఏసీబీ కోర్టు.. సాయంత్రం గం.6.50ని.ల సమయంలో రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ నెల 22వరకూ రిమాండ్ విధించింది కోర్టు. చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించే అవకాశం ఉంది. చంద్రబాబు అరెస్ట్ రిమాండ్ రిపోర్ట్‌ను CID ఉదయమే కోర్టుకు సమర్పించింది. ఈ కేసులో 2021లో ఎఫ్ఐఆర్ నమోదు అయిందని, విచారించేందుకు చంద్రబాబును 15 రోజుల కస్టడీ ఇవ్వాలని సిఐడీ కోరింది. ఈ కేసుకు సంబంధించి సీఐడీ 34 అభియోగాలను చంద్రబాబుపై నమోదు చేసింది. రిమాండ్ రిపోర్ట్‌లో అన్ని ఆంశాలను పకడ్భందీగా చేర్చిన సీఐడీ... రూ. 271 కోట్ల స్కిల్ స్కామ్ సూత్రధారి బాబేనంటూ సీఐడీ అన్ని ఆధారాలతో బలంగా వాదించింది. ఈ కుంభకోణంలో వివిధ పాత్రల్లో బాబు పాత్ర ఉందని సీఐడీ తరుపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఏఏజీ పొన్నవోలు వాదనతో ఏకీభవించిన కోర్టు.. చంద్రబాబుకు 14 రోజులు పాటు రిమాండ్ విధించింది. స్కిల్ స్కాం రాజకీయ ప్రేరేపితమని, చంద్రబాబును కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని, హక్కులను భంగం కలిగేలా సీఐడీ వ్యవహరించిందని, ఈ కేసులో చంద్రబాబును ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని బాబు తరపు లాయర్ సిద్ధార్థ లుథ్రా వాదనలు వినిపించినా వాటితో కోర్టు ఏకీభవించలేదు. (చదవండి: న్యాయం గెలిచింది! ) కోర్టు వద్దు హై అలర్ట్ విజయవాడలోని ఏసిబి కోర్టు దగ్గర ముందు జాగ్రత్తగా భారీగా పోలీసు బలగాలను మోహరించారు. బందోబస్తు నేపథ్యంలో ఏసీబీ కోర్టుకు వచ్చిన సిపి క్రాంతిరాణా అక్కడి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. రిమాండ్ విధిస్తే బెయిల్ పిటిషన్ తీసుకోండి ఏసీబీ కోర్టులో చంద్రబాబు తరఫు లాయర్ లూథ్రా మరో విజ్ఞప్తి చేశారు. ఏసీబీ కోర్టు చంద్రబాబుకు రిమాండ్ విధిస్తే బెయిల్ అప్లికేషన్ ను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. దీనిపై న్యాయస్థానం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. నంద్యాలలో కోర్టు ఉండగా చంద్రబాబును విజయవాడ ఎందుకు తీసుకువచ్చారని కొత్త వాదన లేవనెత్తారు. ఆ ఒక్కటి తప్ప..! చంద్రబాబు కానీ, ఆయన లాయర్లు కానీ వినిపించిన మొత్తం వాదనలు పరిశీలిస్తే.. ఎక్కడా నేరం జరగలేదని కానీ, లేదా చంద్రబాబు నిర్దోషి అని గానీ చెప్పలేదు. కేవలం సాంకేతిక కారణాలను చూపిస్తూ రిమాండ్ వద్దని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. CID సమర్పించిన ఏ సాక్ష్యంతోనూ లాయర్లు విభేదించలేదు. మరో మారు సిద్ధార్థ లుథ్రా వాదనలు ► స్కిల్ స్కాం రాజకీయ ప్రేరేపితం ►చంద్రబాబును కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు ►హక్కులను భంగం కలిగేలా CID వ్యవహరించింది ►శుక్రవారం ఉదయం 10 నుంచి CID పోలీసుల ఫోన్ సంభాషణలను కోర్టుకు సమర్పించాలి 409 సెక్షన్ పై ఏసీబీ కోర్టులో సుదీర్ఘ వాదనలు లుథ్రా లేవనెత్తిన ప్రశ్నలకు సీఐడీ తరపున AAG వాదనలు వినిపించారు. ► చంద్రబాబుపై సీఐడీ 34 అభియోగాలు నమోదు చేసింది ► రిమాండ్ రిపోర్ట్ లో అన్ని అంశాలు చేర్చాం ► స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణంతోపాటు వివిధ అక్రమాల్లో బాబు పాత్ర ఉంది బాబు తప్పు చేయలేదని ఎందుకు చెప్పలేకపోతున్నారు? : ఏఏజీ ►చంద్రబాబు తప్పు చేయడం లేదని ఆయన తరఫు లాయర్లు చెప్పడం లేదు ►అవినీతి చేయలేదని ఒక్క మాట కూడా చెప్పలేకపోతున్నారు ►ఎంతసేపూ సాంకేతిక అంశాల గురించి మాట్లాడుతున్నారు ►గవర్నర్ అనుమతి కోరాలని కొత్తగా అడుగుతున్నారు ►రిమాండు రిపోర్టులో భాష గురించి మాట్లాడుతున్నారు ►అంతేకాని ఇచ్చిన ఆధారాలు తప్పని కాని, అవినీతి జరగలేదని కానీ చెప్పడం లేదు బాబు లాయర్ల వాదనలకు ఇవీ సమాధానాలు : ఏఏజీ ►అరెస్టు చేయడానికి గవర్నర్ అనుమతి అవసరం లేదు, స్పీకర్‌కు సమాచారం ఇస్తే సరిపోతుంది, ఈ నియమాలు మేం పాటించాం ►గవర్నర్‌కు అరెస్టయిన మూడునెలలోపు ఎప్పుడైనా సమాచారం ఇవ్వొచ్చు ►మాజీ ముఖ్యమంత్రి అనేది గౌరవ ప్రదమైన హోదా మాత్రమే, ఆయన వాస్తవ హోదా ఎమ్మెల్యే మాత్రమే ►మామూలు కేసుల్లో వారం అవసరం తప్ప.. ప్రజాధనం దుర్వినియోగం, అవినీతికి సంబంధించిన కేసుల్లో నోటీసు అవసరంలేదు ►తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారిని ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే అరెస్టు చేయొచ్చు ►ముఖ్యమంత్రి హోదాలో నిధుల విడుదలకు చంద్రబాబు ఆదేశించారు, దీనికి సంబంధించిన ఆధారాలున్నాయి ►రాజ్యాంగ ప్రకారం వచ్చిన పదవిని దుర్వినియోగం చేస్తూ అవినీతికి పాల్పడ్డారు ►సెక్షన్ 409 చంద్రబాబుకు సంపూర్ణంగా వర్తిస్తుంది ► చంద్రబాబుకు రిమాండ్ విధించండి -
బాబు చేసింది పెద్ద నేరమే!
సాక్షి, అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుపై సీఐడీ బలమైన ఆధారాలతో అంతకంటే బలమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. ముఖ్యంగా చట్టం పట్ల విధేయత చూపుతానని ప్రమాణం చేసిన ప్రజా సేవకుడు దురుద్దేశంతో ఆ చట్టాలను ఉల్లంఘించడం, తప్పుడు లేదా నకిలీ సంస్థలను సృష్టించి ప్రజా ధనాన్ని సొంతం చేసుకునేందుకు ఫోర్జరీ పత్రాలను నిజమైనవిగా వినియోగించడాన్ని తీవ్రమైన నేరాలుగా పరిగణిస్తారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఈ నేరాలకు పాల్పడినట్లు సీఐడీ భావిస్తోంది. మొత్తం 11 ఐపీసీ సెక్షన్లు, రెండు అవినీతి నిరోధక సెక్షన్ల కింద అరెస్టు చేసింది. తీవ్రమైన నేరాలు చేయడంతో పాటు నేరాలను ప్రోత్సహించిన చంద్రబాబుకు ఈ చట్టాల కింద 7 నుంచి 25 ఏళ్ల కారాగార శిక్ష, భారీ జరిమానా విధించే అవకాశం ఉంది. బాబుపై నమోదైన కేసులో సెక్షన్లు ఏం చెబుతున్నాయంటే.. ఐపీసీ సెక్షన్లు 120–బి: నేరపూరిత కుట్ర 166: ప్రభుత్వ సేవకుడు ఎవరికైనా హాని కలిగించే ఉద్దేశంతో చట్టాన్ని ఉల్లంఘించడం, చట్టం పట్ల విధేయత చూపుతానని ప్రమాణం చేసిన వారు దురుద్దేశంతో చట్టాన్ని ఉల్లంఘించి నేరానికి పాల్పడటం 167: పబ్లిక్ సర్వెంట్ ఉద్దేశపూర్వకంగా లేని/తప్పుడు సంస్థలను, పత్రాలను సృష్టించి మోసం చేయడం 418: ఎవరికైనా నష్టం వాటిల్లుతుందని తెలిసీ ఉద్దేశ పూర్వకంగానే మోసం చేయడం 420: మోసం చేయడం 465: ఫోర్జరీ చేయడం 468: మోసం చేయాలనే ఉద్దేశంతో ఫోర్జరీ చేసి నకిలీ పత్రాలు సృష్టించడం 471: ఫోర్జరీ పత్రాలను అసలైన పత్రాలుగా ఉపయోగించడం 409: నేరపూరిత విశ్వాస ఘాతుకం 201: నేరానికి సంబంధించిన సాక్ష్యాలను మాయం చేయడం, లేదా నేరస్థుడు దొరక్కుండా తప్పుడు సమాచారం ఇవ్వడం 109: నేరాన్ని ప్రేరేపించడం, ఆ నేరం లేదా కుట్రలో భాగస్వామిగా ఉండటం పీసీ (ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్) యాక్ట్ 12(బి)(1): అవినీతికి పాల్పడటం 13(1)(సి)(డి): పబ్లిక్ సర్వెంట్‌గా ఉండి అవినీతికి పాల్పడడం -
ఏ–1 చంద్రబాబు అరెస్ట్
14 ఏళ్లు ముఖ్యమంత్రి.. మరో 14 ఏళ్లు ప్రతిపక్షనేత.. మొత్తంగా 40 ఏళ్ల రాజకీయ జీవితం... కనుసన్నలతో రాజకీయాలను, రాజ్యాంగ వ్యవస్థలను శాసించగలరని సన్నిహితులు కీర్తించే నాయకుడు.. మాజీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు. ఏలేరు కుంభకోణం మొదలు ఎన్నో అవినీతి ఆరోపణలు.. రెండెకరాల నుంచి రూ.రెండు లక్షల కోట్లకు ఆస్తులు పెరిగాయన్న విమర్శలు.. ఎన్నో కేసులు.. స్టేలు.. ఎన్నడూ కోర్టుమెట్లెక్కిందే లేదు.... అరదండాలు ఆయన అరచేతులను తాకలేదు... కానీ చట్టం ఎవరికీ చుట్టం కాదు.. అది తన పని తాను చేసుకుపోతుంది. నూరు గొడ్లను తిన్న రాబందు ఒక్క చిన్న గాలివానకే కూలిపోయినట్లు.. సప్త సముద్రాలను ఈదిన గజ ఈతగాడు చిన్న గుంతలో పడి ప్రాణాలొదిలినట్లు.. ఓ చిన్న స్కామ్‌లో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారు. ఆయన ఎదుర్కొన్న ఆరోపణలతో పోలిస్తే ఇది సముద్రంలో ఇసుకరేణువంత... ఆయన ఆస్తులలో 0.0000001 శాతం కూడా లేనంత.. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో జరిగిన కుంభకోణమిది. అధికారులు వారిస్తున్నా కాదని రూ.371 కోట్ల ప్రజాధనాన్ని నిబంధనలకు విరుద్ధంగా చంద్రబాబు షెల్ కంపెనీలకు తరలించారు. కమీషన్లు పోను తిరిగి రూ.241 కోట్లు చంద్రబాబుకు చేరాయి. స్పష్టమైన ఆధారాలు దొరకడంతో చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. మాజీ సీఎం కావడంతో పటిష్టమైన భద్రత మధ్య హెలికాఫ్టర్‌లో నంద్యాల నుంచి విజయవాడకు తీసుకురావాలని అధికారులు భావించినా రోడ్డుమార్గంలో.. అదీ తన కాన్వాయ్‌లో వస్తానని చంద్రబాబు పట్టుబట్టారు. అదేం విచిత్రమో.. వలయంలా నిలబడి తనకు రక్షణ కల్పిస్తారని భావించిన ప్రజలు, నిరసనలతో దారిపొడవునా బోలెడంత ప్రచారానికి పనికివస్తారనుకున్న పార్టీ శ్రేణులు ముఖం చాటేయడం అరెస్టును మించిన షాక్‌కు బాబును గురిచేసింది. విజయవాడ చేరుకున్న అనంతరం సీఐడీ కార్యాలయంలో బాబును అధికారులు విచారిస్తున్నారు. ఆదివారం ఉదయం ఆయనను కోర్టులో ప్రవేశపెట్టే అవకాశముందని తెలుస్తోంది. ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణం కేసులో నిందితులు ఏ–1 చంద్రబాబు, టీడీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఏ–2 కింజరాపు అచ్చెన్నాయుడు, టీడీపీ ప్రభుత్వంలో కార్మిక శాఖ మంత్రి ఏ–3 గంటా సుబ్బారావు, టీడీపీ ప్రభుత్వంలో ఏపీఎస్ఎస్డీసీ ఎండీ–సీఈవో ఏ–4 కె.లక్ష్మీ నారాయణ, రిటైర్డ్ ఐఏఎస్, ఏపీఎస్ఎస్డీసీ సలహాదారు ఏ–5 నిమ్మగడ్డ వెంకట కృష్ణ ప్రసాద్, మాజీ ఓఎస్డీ, ఏపీఎస్ఎస్డీసీ ఏ–6 అపర్ణ ఉపాధ్యాయుల, ఐఏఎస్, టీడీపీ ప్రభుత్వంలో ఏపీఎస్ఎస్డీసీ డిప్యూటీ సీఈవో ఏ–7 ప్రతాప్ కుమార్ కర్, టీడీపీ ప్రభుత్వంలో ఫైనాన్సియల్ ఆఫీసర్, ఏపీఎస్ఎస్డీసీ ఏ–8 సుమన్ బోస్, సీమెన్స్ ఇండియా మాజీ ఎండీ ఏ–9 జీవీఎస్ భాస్కర్ ప్రసాద్, ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్ట్ హెడ్ ఏ–10 వికాస్ వినాయక్ కన్వేల్కర్, డిజైన్‌టెక్ ఎండీ వీరితోపాటు మొత్తం 40మందిని నిందితులుగా పేర్కొన్నారు. సాక్షి, అమరావతి /నంద్యాల/ నెట్వర్క్: టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) కుంభకోణానికి ప్రధాన సూత్రధారి, ఈ కేసులో ప్రధాన నిందితుడు (ఏ–1) అయిన నారా చంద్రబాబు నాయుడును సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) శనివారం నంద్యాలలో అరెస్టు చేసింది. జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీకి తెలియకుండా ఆ కంపెనీ ముసుగులో రూ.3,300 కోట్ల ప్రాజెక్ట్‌కు ఒప్పందం కుదుర్చుకుని, ఎలాంటి ప్రాజెక్ట్ చేపట్టకుండానే నిబంధనలకు విరుద్ధంగా రూ.371 కోట్లు విడుదల చేయించి.. అందులో రూ.241 కోట్లను కొల్లగొట్టిన చంద్రబాబు అవినీతి బండారం ఆధారాలతోసహా బట్టబయలైంది. ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణానికి కర్త కర్మ క్రియ అంతా ఆయనే అని సిట్ నిర్ధారించింది. దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ బయటపడిన కీలక ఆధారాలతో ఈ కేసులో చంద్రబాబును ఏ–1గా పేర్కొంటూ చార్జిషీట్ నమోదు చేసింది. ఆయనపై ఐపీసీ సెక్షన్లు 120(బి), 166, 167, 418, 420, 465, 468, 471, 477(ఏ), 409, 201, 109 రెడ్‌విత్ 34, 37లతోపాటు అవినీతి నిరోధక చట్టం సెక్షన్లు 13(2) రెడ్‌విత్ 13(1) (సి), (డి) కింద అభియోగాలు నమోదు చేశారు. టీడీపీ ప్రభుత్వంలో కార్మిక శాఖ మంత్రిగా వ్యవహరించిన కింజరాపు అచ్చెన్నాయుడు ఏ–2గా, మరో 38 మందిని నిందితులుగా పేర్కొంటూ సిట్ కేసు నమోదు చేసింది. కాగా, చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ కూడా ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణంలో కీలక పాత్ర పోషించారన్నది తాజాగా బయటపడటం గమనార్హం. దాంతో ఈ కేసులో లోకేశ్‌ను కూడా విచారించాలని సిట్నిర్ణయించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ కేసులో చంద్రబాబుతోసహా సిట్ ఇప్పటి వరకు 9 మందిని అరెస్ట్ చేసినట్లయింది. దర్యాప్తును ప్రభావితం చేసేందుకు చంద్రబాబు విఫలయత్నం ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణంలో తన అవినీతి బండారం బయట పడటంతో దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు చంద్రబాబు యత్నించారు. ఈ కేసులో షెల్ కంపెనీల ద్వారా నిధులు తరలించిన తన పీఎస్ పెండ్యాల శ్రీనివాస్, షాపూర్జీ– పల్లోంజీ కంపెనీ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ పార్థసాని, షెల్ కంపెనీల సృష్టికర్త యోగేశ్ యాదవ్‌లకు సిట్ నోటీసులు జారీ చేయడంతో బెంబేలెత్తిన ఆయన సాక్షులను ప్రభావితం చేసేందుకు యత్నించారు. ఆయన బెదిరింపులతోనే పెండ్యాల శ్రీనివాస్ అమెరికాకు, మనోజ్ పార్థసాని దుబాయ్‌కి పరారయ్యారు. దాంతో సిట్ వెంటనే అప్రమత్తమైంది. చంద్రబాబును అరెస్ట్ చేయకపోతే సాక్షులు, ఇతరులను బెదిరించడం ద్వారా దర్యాప్తును ప్రభావితం చేసి కేసును తప్పుదారి పట్టించే అవకాశం ఉందని గుర్తించారు. అప్పటికే ఆయన అవినీతి ఆధారాలు లభించడంతో అరెస్ట్ చేయాలని నిర్ణయించారు. నాటకీయ పరిణామాల మధ్య అరెస్ట్ సిట్ అధికారులు శుక్రవారం రాత్రి కార్యాచరణకు దిగారు. సిట్ ఇన్చార్జి కె.రఘురామిరెడ్డి, దర్యాప్తు అధికారి ధనుంజయ నేతృత్వంలో సిట్ బృందం నంద్యాల పర్యటనలో ఉన్న చంద్రబాబు వద్దకు బయలుదేరింది. తనను అరెస్ట్ చేస్తే రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య సృష్టించాలని అప్పటికే చంద్రబాబు టీడీపీ శ్రేణులను ఆదేశించారు. దాంతో ముందు జాగ్రత్తగా పెద్ద ఎత్తున పోలీసు బలగాలను చంద్రబాబు బస చేసిన ఆర్కే ఫంక్షన్ హాలు వద్ద మోహరించారు. సిట్ ఇన్చార్జి కె.రఘురామిరెడ్డి, నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్‌రెడ్డి, సిట్ దర్యాప్తు అధికారి ధనుంజయ తదితరులు శనివారం తెల్లవారుజామున 3 గంటలకు నంద్యాలలో చంద్రబాబు బస చేసిన ఆర్కే ఫంక్షన్ హాలుకు చేరుకున్నారు. ఆ ఫంక్షన్ హాల్‌కు వెళ్లే రహదారిలో వారిని అడ్డుకునేందుకు టీడీపీ నేతలు, కార్యకర్తలు అడ్డంగా నిలిపిన వాహనాల మధ్య నుంచి అక్కడకు వెళ్లారు. సిట్ అధికారులు చంద్రబాబును కలవనివ్వకుండా టీడీపీ నేతలు కాల్వ శ్రీనివాసులు, భూమా బ్రహ్మానందరెడ్డి, బీసీ జనార్ధన్‌రెడ్డిలు సిట్ అధికారులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు చంద్రబాబు బస చేసిన బస్సు తలుపులు తట్టినా ఆయన బయటకు రాలేదు. మరోవైపు టీడీపీ నాయకులు ఎంతగా రెచ్చిపోతున్నా పోలీసులు సంయమనంతో వ్యవహరిస్తూ వారికి ఓపికగా సమాధానం ఇస్తూ.. చంద్రబాబు బయటకు వచ్చేంత వరకు వేచి చూశారు. 2.30 గంటలపాటు నచ్చజెప్పి.. చంద్రబాబు వద్దకు వెళ్లడానికి అడ్డుగా ఉంచిన వాహనాలను ఎంత సేపటికీ తొలగించకపోవడంతో పోలీసులు వాటికి తాడు కట్టి బుల్డొజర్ సాయంతో పక్కకు జరిపారు. ఆ విధంగా సిట్ అధికారులు శనివారం తెల్లవారుజామున 3గంటల నుంచి 5.30 గంటల వరకు టీడీపీ నేతలు, న్యాయవాదులతో మాట్లాడుతూ నచ్చజెప్పేందుకు యత్నించారు. పోలీసులు, టీడీపీ నాయకుల మధ్య చర్చలు, వాగ్వాదం జరుగుతుండగా టీడీపీ అధినేత చంద్రబాబు ఉదయం 5.30 గంటలకు బస్సు నుంచి కిందకు దిగారు. ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణం కేసులో అరెస్ట్ చేయడానికి వచ్చామని చెప్పి తమకు సహకరించాలని పోలీసు అధికారులు ఆయన్ను కోరారు. ‘ఎఫ్ఐఆర్ ఎప్పుడు వేశారు.. అందులో నా పేరు ఉందా.. నా పేరు లేకుండా ఎలా అరెస్ట్ చేయడానికి వచ్చారు?’ అని బాబు ప్రశ్నించారు. రెండేళ్ల క్రితమే ఎఫ్ఐఆర్ వేశామని, అందులో మీ పేరు ఉందని వారు తెలుపగా, కేసుకు సంబంధించిన మొత్తం వివరాలు ఇవ్వాలని బాబు పోలీసులను కోరారు. కోర్టులో హాజరు పరిచే సమయంలో పూర్తి వివరాలు ఇస్తామని పోలీసులు చెప్పారు. అయినప్పటికీ ఎలా అరెస్ట్ చేస్తారని న్యాయవాదులు, చంద్రబాబు.. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అన్ని వివరాలు అప్పుడే ఇస్తామని చెబుతూ పోలీసులు చంద్రబాబుతో సంతకం తీసుకొని, వైద్య పరీక్షలు నిర్వహించి, ఉదయం 6 గంటల సమయంలో అరెస్ట్ చేశారు. ఆర్కే ఫంక్షన్ హాల్ నుంచి బయటకు వస్తున్న చంద్రబాబు వాహనానికి కొందరు టీడీపీ కార్యకర్తలు అడ్డం పడుకోవడానికి వెళ్లగా పోలీసులు వారిని పక్కకు తప్పించారు. రోడ్డు మార్గంలో విజయవాడకు తరలింపు హెలికాఫ్టర్‌లో విజయవాడకు తీసుకెళ్తామని సిట్ అధికారులు చంద్రబాబుతో చెప్పారు. అందుకు ఆయన తిరస్కరించారు. తాను తన వాహనంలో రోడ్డు మార్గంలోనే వస్తానన్నారు. అందుకు సిట్ అధికారులు సమ్మతించి ఆయనను నంద్యాల నుంచి విజయవాడకు రోడ్డు మార్గంలో తరలించారు. మధ్యలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. అక్కడక్కడ తప్ప ఎక్కడా ఎలాంటి అవాంతరాలు ఏర్పడ లేదు. బాపట్ల జిల్లా జే.పంగలూరు మండలం ముప్పవరం గ్రామం సమీపంలో టీడీపీ నేతలు జాతీయ రహదారిపై టైర్లు తగలబెట్టి చంద్రబాబు కాన్వాయ్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు స్వల్పంగా లాఠీ చార్జీ చేసి కాన్వాయిని ముందుకు పంపించారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట వద్ద టీడీపీ నేతలు ముందస్తు ప్రణాళికతో కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. పోలీసులను దుర్భాషలాడుతూ, తోసివేస్తూ దూసుకువచ్చారు. కొందరు టీడీపీ కార్యకర్తలు పోలీసులపై దాడికి ప్రయత్నించారు. ఎన్ఆర్టీ సెంటర్లో రోడ్డుపై తెలుగు తమ్ముళ్లు టైర్లు కాల్చి, చేతిలో పెట్రోల్ బాటిళ్లతో బెదిరింపులకు దిగారు. దాంతో జాతీయ రహదారిపై చంద్రబాబు కాన్వాయ్ అరగంటకుపైగా నిలిచిపోయింది. టీడీపీ కార్యకర్తలు సాధారణ ప్రజలను కూడా దూషిస్తూ వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్పెషల్ పార్టీ పోలీసులను తీవ్ర పదజాలంతో దూషిస్తూ వారి అంతు చూస్తామని హెచ్చరిస్తూ జెండా కర్రలతో దాడికి ప్రయత్నించారు. పోలీసులు అతి కష్టం మీద అల్లరి మూకలను చెదరగొట్టి కాన్వాయ్‌ని ముందుకు పోనిచ్చారు. గుంటూరు శివారులోని లాల్పురం వై.జంక్షన్ టీడీపీ కార్యకర్తలు కాన్వాయ్‌ను అడ్డుకునే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. సాయంత్రం ఐదు గంటలకు సిట్ అధికారులు చంద్రబాబును గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సిట్ కార్యాలయానికి తరలించారు. బాబుపై ప్రశ్నల వర్షం సిట్ విచారణకు చంద్రబాబు ఏమాత్రం సహకరించ లేదు. అధికారులు ఏ ప్రశ్నలు వేసినా సరే తెలియదు.. గుర్తు లేదు.. మర్చిపోయాను.. అంటూ సమాధానాలు చెప్పి తప్పించుకునేందుకు యత్నించారు. తాడేపల్లిలోని సిట్ కార్యాలయానికి చేరుకున్న తర్వాత చంద్రబాబు కాసేపు విశ్రాంతి తీసుకునేందుకు అధికారులు అనుమతించారు. రాత్రి 7 గంటల అనంతరం సిట్ అధికారులు విచారణ ప్రక్రియ మొదలు పెట్టారు. చంద్రబాబు లిఖితపూర్వక విజ్ఞప్తి మేరకు ఆయన న్యాయవాదులను లోపలికి అనుమతించారు. అనంతరం ఓ గదిలో చంద్రబాబును కూర్చోబెట్టి, సిట్ దర్యాప్తు అధికారి ధనుంజయ, ఇతర అధికారులు ఈ కేసుకు సంబంధించిన వివరాలను రాబట్టేందుకు ప్రయత్నించారు. సీమెన్స్ కంపెనీ పేరిట ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్ట్ ఒప్పందం కుదుర్చుకున్న విధానంపై సిట్ అధికారులు చంద్రబాబుపై ప్రశ్నల వర్షం కురిపించారు. కేవలం ప్రజాధనాన్ని కొల్లగొట్టేందుకే ఈ ప్రాజెక్ట్‌పై ఒప్పందం కుదుర్చుకోవడంలో సర్వం తానై చంద్రబాబు వ్యవహరించారనడానికి ఆధారాలను ఆయన ముందు ఉంచి ఒక్కొక్కటిగా ప్రశ్నించారు. అసలు సీమెన్స్ కంపెనీకి తెలియకుండానే ఆ కంపెనీ పేరుతో ప్రాజెక్ట్ కుదుర్చుకోవడం ఏమిటి? డిజైన్‌టెక్ కంపెనీని ఎందుకు తెరపైకి తెచ్చారు? అసలు ప్రాజెక్ట్ వ్యయం రూ.3,300 కోట్లుగా ఎలా నిర్ధారించారు? ముఖ్య కార్యదర్శిని పక్కనబెట్టి మరీ ఏపీఎస్ఎస్డీసీ ఎండీ గంటా సుబ్బారావుకు ఏకంగా నాలుగు పోస్టులు ఎందుకు కట్టబెట్టారు? ఒప్పందం ప్రకారం ప్రాజెక్ట్ వ్యయంలో 90 శాతం నిధులు సమకూర్చకుండా ప్రభుత్వ వాటా 10 శాతం కింద రూ.371 కోట్లు ఎందుకు విడుదల చేశారు? అందుకు సీనియర్ ఐఏఎస్ అధికారులు నోట్‌ఫైల్‌లో లిఖిత పూర్వకంగా తెలిపిన అభ్యంతరాలను ఎందుకు బేఖాతరు చేశారు? షెల్ కంపెనీల ద్వారా ఆయనకు చేరిన నిధుల విషయం ఏమిటి.. ఇలా పలు ప్రశ్నలను ఒక్కొక్కటిగా అడిగారు. చంద్రబాబుతో కుటుంబ సభ్యుల భేటీ సిట్ కార్యాలయంలో చంద్రబాబును విచారిస్తుండగానే ఆయన భార్య భువనేశ్వరి, తనయుడు లోకేశ్, కోడలు బ్రాహ్మణి, బావమరిది బాలకృష్ణ అక్కడకు చేరుకున్నారు. తాము చంద్రబాబును కలవాలని అధికారులతో చెప్పారు. దాంతో చంద్రబాబు విచారణకు కాసేపు విరామం ఇచ్చి కుటుంబ సభ్యులను కలిసేందుకు అధికారులు అనుమతించారు. సిట్ కార్యాలయంలో ఓ గదిలో చంద్రబాబు తన కుటుంబ సభ్యులతో భేటీ అయ్యారు. అరగంటకుపైగా మాట్లాడారు. అనంతరం సిట్ అధికారులు మరోసారి విచారణను కొనసాగించారు. ఈ విధంగా శనివారం అర్ధరాత్రి వరకు.. అంటే 6 గంటలకు పైగా విచారించారు. అనంతరం ఆయన నిద్రించేందుకు అవకాశం కల్పించారు. ఆదివారం తెల్లవారుజామున న్యాయస్థానంలో హాజరు పరుస్తారని భావిస్తున్నారు. నడిరోడ్డుపై ప్రజాస్వామ్యం హత్య: చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని నడిరోడ్డుపై హత్య చేశారని చంద్రబాబు ఆరోపించారు. తనను అరెస్ట్ చేయడంపై నంద్యాలలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ తాను ఏం తప్పు చేశానో చెప్పాలన్నారు. నాలుగున్నరేళ్లుగా ప్రజా సమస్యలపై పోరాడుతున్నందుకు అరెస్ట్ చేయడం బాధాకరమన్నారు. తప్పు చేసుంటే నిరూపించి కేసు పెట్టాలన్నారు. ఏదేమైనా న్యాయం, ధర్మం గెలుస్తుందన్నారు. స్కిల్ స్కామ్ కేసులో ఇప్పటి వరకు అరెస్టైన వారు.. ► నారా చంద్రబాబు నాయుడు, మాజీ ముఖ్యమంత్రి ► గంటా సుబ్బారావు, టీడీపీ ప్రభుత్వంలో ఏపీఎస్ఎస్డీసీ ఎండీ ► సుమన్ బోస్, అప్పట్లో సీమెన్స్ ఎండీ ► వికాస్ వినాయక్ కన్వేల్కర్, డిజైన్ టెక్ ఎండీ ► ముకుల్‌చంద్ర అగర్వాల్, స్కిల్లర్ కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ అధికారి ► శిరీష్ చంద్రకాంత్ షా, డైరెక్టర్ ఏసీఐఎల్ కంపెనీ ► విపిన్‌కుమార్ శర్మ, చార్టెడ్ అకౌంటెంట్ ► నీలమ్ శర్మ (విపిన్‌కుమార్ శర్మ భార్య) ► జీవీఎస్ భాస్కర్, ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్ట్ హెడ్ స్కిల్ స్కామ్ కేసులో ఇప్పటి వరకు అరెస్టైన వారు.. ► నారా చంద్రబాబు నాయుడు, మాజీ ముఖ్యమంత్రి ► గంటా సుబ్బారావు, టీడీపీ ప్రభుత్వంలో ఏపీఎస్ఎస్డీసీ ఎండీ ► సుమన్ బోస్, అప్పట్లో సీమెన్స్ ఎండీ ► వికాస్ వినాయక్ కన్వేల్కర్, డిజైన్ టెక్ ఎండీ ► ముకుల్‌చంద్ర అగర్వాల్, స్కిల్లర్ కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ అధికారి ► శిరీష్ చంద్రకాంత్ షా, డైరెక్టర్ ఏసీఐఎల్ కంపెనీ ► విపిన్‌కుమార్ శర్మ, చార్టెడ్ అకౌంటెంట్ ► నీలమ్ శర్మ (విపిన్‌కుమార్ శర్మ భార్య) ► జీవీఎస్ భాస్కర్, ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్ట్ హెడ్ -
స్కిల్ స్కాం: చంద్రబాబు విచారణకు తాత్కాలిక బ్రేక్
సాక్షి, కృష్ణా: చంద్రబాబు విచారణకు తాత్కాలిక బ్రేక్. చంద్రబాబు విశ్రాంతి తీసుకోవాలన్న అధికారులు. చంద్రబాబు అరెస్ట్ నేపద్యంలో కీలకంగా మారిన రిమాండ్ రిపోర్ట్. రిమాండ్ రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్న లాయర్లు. జడ్జి నివాసం వద్ద ఉద్రిక్తత. జడ్జి ఇంటి వద్ద హౌస్ మోషన్ పిటీషన్ దాఖలు చేసిన చంద్రబాబు లాయర్లు. స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అరెస్టయిన ప్రధాన నిందితుడు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని ఏపీ సీఐడీ విజయవాడ కోర్టులో ప్రవేశపెట్టనుంది. అంతకు ముందు ఆయన్ని సీఐడీ ఆఫీసుకు తరలించారు.. స్కిల్ స్కాంలో అవకతవకలపై సీఐడీ.. చంద్రబాబును ప్రశ్నిస్తోంది. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కాం ప్రధాన కుట్రదారుడైన చంద్రబాబుని శనివారం వేకువ ఝామునే నంద్యాలలో సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక కోర్టులో ప్రవేశపెట్టనున్న తరుణంలో.. శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా విజయవాడ సివిల్ కోర్టు వద్ద భారీగా పోలీసుల మోహరించారు. టీడీపీ కార్యకర్తలు వచ్చే అవకాశం ఉండడంతో సివిల్ కోర్టు వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. దాదాపు 200 మంది పోలీస్ సిబ్బందిని కోర్టు వద్ద మోహరించారు. ఇప్పటికే కోర్టు బయట ఆందోళన చేస్తున్న పలువురు టీడీపీ కార్యకర్తల్ని అదుపులోకి తీసుకున్నారు. చంద్రబాబుని విజయవాడ కోర్టు 3వ అదనపు జిల్లా, ఏసీబీ ప్రత్యేక కోర్టు జడ్జి వద్ద హాజరు పర్చనున్నట్లు తెలుస్తోంది. ఏసీబీ న్యాయమూర్తి ముందు చంద్రబాబు తరపున ఇప్పటికే ఆయన కేసులు చూస్తున్న న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపిస్తారని సమాచారం. ఈ మేరకు ఆయన ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ(గన్నవరం) చేరుకున్నారు. ఏపీ సీఐడీ, సిట్ తరపున అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకరరెడ్డి వాదనలు వినిపించనున్నారు. ఇక స్కిల్ డెవలప్మెంట్ స్కాం ప్రధాన సూత్రధారి అయిన చంద్రబాబును తమ రిమాండ్‌కు ఇవ్వాలని ఏపీ సీఐడీ కోరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. -
చంద్రబాబు అరెస్ట్.. విధ్వంసానికి టీడీపీ కుట్ర
సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కేసులో ప్రధాన సూత్రధారి, పాత్రధారి చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో విధ్వంసం సృష్టించడానికి టీడీపీ కుట్రకు తెరలేపింది. చంద్రబాబుని తీసుకొచ్చే మార్గంలో అల్లర్లకు పథక రచన చేసింది. పార్టీ కేంద్ర కార్యాలయం నుండి అన్ని జిల్లాల నేతలకు ఆదేశాలు అందినట్లు సమాచారం. పలు చోట్ల పోలీసులపై టీడీపీ గూండాలు దాడులకు పాల్పడ్డారు. ప్రజా జీవనాన్ని ఇబ్బంది పెట్టి.. శాంతి భద్రతల సమస్య సృష్టించాలంటూ టీడీపీ నేతలకు కేంద్ర కార్యాలయం నుంచి ఆదేశాలు అందినట్లు తెలిసింది. రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులను రెచ్చగొట్టి తద్వారా మైలేజ్ పొందాలని టీడీపీ ప్లాన్ చేస్తోంది. కాగా, నంద్యాలలో చంద్రబాబు బస చేసిన ఆర్కే పంక్షన్ హాల్ వద్ద ఆయన్ను అరెస్ట్ చేశారు సీఐడీ పోలీసులు. ఈ రోజు(శనివారం) తెల్లవారుజామున చంద్రబాబును అరెస్ట్ చేశారు పోలీసులు. సీఆర్పీసీ సెక్షన్ 50(1) నోటీస్ ఇచ్చిన సీఐడీ.. 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ చట్టం కింద చంద్రబాబు అరెస్ట్ చేసింది. ఈ కేసులో ఏ-1గా చంద్రబాబు ఉండగా, ఏ-2గా అచ్చెన్నాయుడు ఉన్నారు.చంద్రబాబు పై 120(బి), 166, 167,418, 420, 465, 468, 201, 109, రీడ్‌విత్ 34 and 37 ఐపీసీ సెక్షన్ ల కింద కేసులు నమోదు చేశారు. చదవండి: ఉద్రిక్తతలు రెచ్చగొట్టేందుకు బాబుగారి ప్లాన్! -
ఉద్రిక్తతలు రెచ్చగొట్టేందుకు బాబుగారి ప్లాన్!
ప్రతీ సందర్భాన్నీ తన రాజకీయ అవసరానికి వాడుకోవడం బాబుగారికి వెన్నతో పెట్టిన విద్య. చివరికి భారీ స్కామ్‌కు పాల్పడి అరెస్ట్ అయిన ప్రస్తుత సందర్భాన్ని కూడా తనకు అనుకూలంగా మలచుకోవడానికే చంద్రబాబు చూస్తున్నారు. ఒకవైపు టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు సంయమనం పాటించాలని ఏదో పైకి మొక్కుబడిగా మీడియా ముఖంగా చెప్పిన బాబు.. అందుకు భిన్నంగా వ్యవహరించాలని పార్టీ నాయకులకు దిశా నిర్దేశం చేసేశారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ప్రధాన సూత్రధారి, పాత్రధారి చంద్రబాబేనని సీఐడీ దర్యాప్తులో తేలిన తర్వాత అరెస్ట్ చేస్తే, అందులో సానుభూతిని సంపాదించుకోవడం చూస్తున్నాడు. నంద్యాలలో చంద్రబాబను అరెస్ట్ చేసిన తర్వాత విజయవాడ కోర్టుకు తరలించే క్రమంలో పెద్ద హైడ్రామే నడిచింది. చంద్రబాబు వయసు, హోదా దృష్ట్యా హెలికాప్టర్లో తరలిస్తామని చంద్రబాబుకు సీఐడీ సూచన చేయగా, హెలికాప్టర్లో తరలింపు వద్దని చంద్రబాబు నిరాకరించడమే కాకుండా తన కాన్వాయ్‌లోనే వస్తానంటూ పట్టుబట్టారు. దాంతో చేసేది లేక చంద్రబాబు కాన్వాయ్‌లోనే విజయవాడకు తరలించేందుకు అంగీకరించింది సీఐడీ. ఇక్కడ చంద్రబాబు ఉద్దేశం ఏమిటో క్లియర్‌గా అర్ధం అవుతోంది. ఎలాగోలా ఉద్రిక్తతలను రెచ్చగొట్టి సానుభూతి పొందాలనే తపనే కనిపించింది బాబు గారిలో.. దానిలో భాగంగా తనను తీసుకెళ్లే కాన్వాయ్‌ను అడ్డుకోవాలంటూ టీడీపీ శ్రేణులకు, పార్టీ నేతలకు సూచించారు చంద్రబాబు. రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులను రెచ్చగొట్టి తద్వారా దాని ద్వారా వచ్చిన మైలేజ్ పొందాలని ప్లాన్ చేసుకున్నారు చంద్రబాబు. అందుకే ఆకాశ మార్గం గుండా కాకుండా రోడ్డు మార్గంలోనే వెళదామని పట్టుబట్టడానికి ప్రధాన కారణం. ఇలా తనను రోడ్డు మార్గంలో తీసుకెళ్లే సమయంలో ఆందోళనలకు దిగాలని పిలుపునిచ్చారు బాబుగారు. అదే సమయంలో తమకు తెలియకుండా రూటు మార్చుతున్నారంటూ ఎల్లో మీడియా వార్తలు ఇవ్వసాగింది. ఒకవేళ చంద్రబాబును విజయవాడకు తీసుకెళ్లే క్రమంలో రూట్ మార్చాలంటే ఎల్లో మీడియా పర్మిషన్ అవసరమా? అనే ప్రశ్న తలెత్తక మానదు. చంద్రబాబును ఎలా తీసుకెళ్లాలన్నది పోలీసులకు తెలియదా?, ఎక్కడకు తీసుకెళుతున్నారు అనే విషయంపై క్లారిటీ ఉన్నప్పుడు.. ఎలా తీసుకెళుతున్నారు అనే విషయం అనవసరం. ఇటువంటి హైప్రొఫైల్ కేసులో అరెస్ట్‌లు జరిగినప్పుడు ఎలా తీసుకెళుతున్నారనే రూట్ మ్యాప్ అనేది తెలియకపోవడమే బెటర్ అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట. ఎంత పకడ్బందీగా చంద్రబాబును అధికారులు తరలించే యత్నం చేసినప్పటికీ టీడీపీ శ్రేణులు పలుమార్లు కాన్వాయ్‌లోకి చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నించడం గమనార్హం. దాంతో ఏ ఇతర వాహనాన్ని చంద్రబాబు కాన్వాయ్‌కు సమీపంగా రాకుండా పోలీసులు జాగ్రత్త పడ్డారు. మరొకవైపు కాన్వాయ్‌లో 108 ఉన్నా.. అంబులెన్స్ లేదంటూ తప్పుడు వార్తలు ఇచ్చింది ఎల్లో మీడియా. అరెస్ట్ చేసి తీసుకెళుతుంటే ఎన్ని వాహనాలు ఉండాలో కూడా ఎల్లో మీడియా చెప్పేస్తుంది. అసలు ఎన్ని వాహనాలు ఉండాలు అన్నది పోలీసులు నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది కానీ ఎల్లో మీడియా, టీడీపీ శ్రేణులో చెప్పినట్లు నడవదు. -
చంద్రబాబే ప్రధాన సూత్రధారి: ఏపీ సీఐడీ
సాక్షి, విజయవాడ: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో.. ప్రధాన నిందితుడు చంద్రబాబు నాయుడ్ని అరెస్ట్ చేసినట్లు ఆంధ్రప్రదేశ్ సీఐడీ ప్రకటించింది. శనివారం చంద్రబాబు నాయుడు అరెస్ట్.. విజయవాడ తరలింపు పరిణామాలతో పాటు ఆయన్ని ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందనే విషయాలను సీఐడీ అదనపు డీజీ సంజయ్ మీడియాకు తెలిపారు. ఇవాళ ఉదయం ఆరుగంటలకు నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్ చేశాం. స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో ఆయన ప్రధాన నిందితుడు. ఈ స్కామ్‌లో ప్రధాన కుట్రదారుడు.. ఫైనల్ బెనిఫిషీయరీ కూడా చంద్రబాబే. దర్యాప్తులోనూ ప్రధాన నిందితుడు చంద్రబాబే అని తేలింది. అందుకే ఆయన్ని అరెస్ట్ చేశాం. ఈ స్కాంలో మరిన్ని వివరాలు రాబట్టడానికి ఆయన్ని ప్రశ్నించాల్సి ఉంది. ► స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో.. నకిలీ ఇన్వాయిస్ల ద్వారా షెల్ కంపెనీకి నిధులు మళ్లించారు. చంద్రబాబుకు అన్ని లావాదేవీల గురించి తెలుసు. నిధుల దారి మళ్లింపునకు సంబంధించి చంద్రబాబును ప్రశ్నించాల్సి ఉంది. అందుకే.. న్యాయపరంగా అన్ని చర్యలు తీసుకునే అరెస్ట్ చేశాం. ► ఈ స్కామ్‌కు సంబంధించిన కీలక డాక్యుమెంట్లు మాయం చేశారు. ఈడీ, జీఎస్టీ ఏజెన్సీలు కూడా ఈ స్కామ్‌పై దర్యాప్తు చేశాయి. ► 2014లో ఏపీ ఉన్నత విద్యామండలి.. సీమెన్స్ మధ్య ఒప్పందం జరిగింది. ఎంవోయూ తర్వాత.. అదే ఏడాది జులైలో స్కిల్ కార్పొరేషన్ ఏర్పాటు అయ్యింది. గంటా సుబ్బారావు సీఈవోగా వ్యవహరించారు. ఉద్దేశపూర్వకంగానే గంటా సుబ్బారావుకి సీఈవోతో పాటు ఎండీ, ఉన్నత విద్యా మండలి సలహాదారుగా, సీఎం సలహాదారుగా పదవులు కట్టబెట్టారు. ► ఈ ఒప్పందానికి డిజైన్ టెక్ ప్రదాన సూత్రధారి. డిజైన్ టెక్ కి సంబంధించిన భాస్కర్ భార్య అపర్ణ యూపీ క్యాడర్ స్కిల్ కార్పోరేషన్ డిప్యూటీ సీఈవోగా వచ్చారు. ► సీమెన్స్ నుంచి 90 శాతం నిధులు విడుదల కాకపోయినా.. రూ. 371 కోట్లను ఏపీ ప్రభుత్వం తమ వాటాగా విడుదల చేసింది. ఆర్ధిక శాఖ, సీఎస్ అభ్యంతరాలని సైతం పట్టించుకోలేదు ► రూ. 58 కోట్ల సాఫ్ట్ వేర్ ని.. మూడు వేలకోట్ల ప్రాజెక్ట్ గా చూపించారు నారా లోకేష్ పాత్రపైనా విచారణ.. ప్రభుత్వ ధనం ఎవరిరెవరి ఖాతాల్లోకి అక్రమంగా మళ్లాయో సిఐడి దర్యాప్తు చేస్తోంది. చంద్రబాబు నాయుడి తనయుడు నారాలోకేష్ పాత్రపైనా సీఐడీ విచారణ జరుపుతోంది. అలాగే.. కిలారు రాజేష్ పాత్రపై కూడా సీఐడీ విచారణ చేస్తోంది. వీటితో పాటు ఏపీ ఫైబర్ నెట్, ఇన్నర్ రింగ్ రోడ్ కుంభకోణాలలో కూడా లోకేష్ పాత్రపై లోతైన దర్యాప్తు సాగుతుంది ► కుంభకోణంలో కీలక వ్యక్తి అయిన డిజైన్ టెక్ కి చెందిన మనోజ్ విదేశాలకి పారిపోయాడు. చంద్రబాబు పీఏ పెండ్యాల శ్రీనివాస్ కూడా అమెరికా పారిపోయాడు. విదేశాల్లో ఉన్న నిందితులను తీసుకొచ్చేందుకు ఇంటర్‌పోల్ సాయం కోరతాం. విదేశాల్లో తలదాచుకున్న ఈ నిందితులది ఈ స్కామ్‌లో కీలక పాత్రగా గుర్తించాం. ► ప్రభుత్వ ధనాన్ని పలు షెల్ కంపెనీల ద్వారా మళ్లించిన కేసులో చంద్రబాబే ప్రధాన సూత్రధారి. విచారణలో అదే వెల్లడైంది. అందుకే నంద్యాలలో అరెస్ట్ చేశాం. హెలికాఫ్టర్‌లో ప్రయాణానికి చంద్రబాబు నాయుడు ఒప్పుకోలేదు. అందుకే ఆయన సొంత వాహనంలోనే విజయవాడ రోడ్డు మార్గం ద్వారా తీసుకొస్తున్నాం. విజయవాడ చేరుకున్నాక వైద్య పరీక్షలు నిర్వహించి.. కోర్టులో హాజరు పరుస్తాం. మరిన్ని విషయాలు బయటకు రావాలంటే చంద్రబాబు కస్టడీ అవసరం అని ఏపీ సీఐడీ అదనపు డీజీ సంజయ్ వెల్లడించారు. -
చంద్రబాబు అరెస్ట్.. వాట్ నెక్స్ట్
సాక్షి, విజయవాడ: మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అరెస్ట్ చేసింది ఏపీ సీఐడీ. శనివారం ఉదయం నంద్యాలలో హైడ్రామా తర్వాత ఆయన్ని అదుపులోకి తీసుకుంది. ఆపై విజయవాడకు తరలించే యత్నం చేసింది. తన కాన్వాయ్‌లోనే వస్తానని చెప్పడంతో ఏపీ అధికారులు అంగీకరించారు. చంద్రబాబు నాయుడు వెంట కాల్వ శ్రీనివాసులు ఉన్నారు. తొలుత విజయవాడలోని సీఐడీ కార్యాలయానికి చంద్రబాబును తరలిస్తారని సమాచారం. ఆపై సీఐడీ పోలీసులు, మూడో అదనపు జిల్లా కోర్టులో చంద్రబాబు నాయుడ్ని హాజరు పర్చనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఉదయం పది గంటల ప్రాంతంలో ఏపీ సీఐడీ డీజీ ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. చంద్రబాబు అరెస్ట్ వివరాలను ఆయన మీడియాకు వ్యవహరించనున్నారు. ఇక నంద్యాలలో చంద్రబాబు అరెస్ట్ సమయంలో పెద్ద డ్రామానే నడిచింది. తొలుత సీఐడీ అధికారులతో చంద్రబాబు, ఆయన లాయర్లు వాదనకు దిగారు. టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున గుమిగూడి అడ్డుకునే యత్నం చేశారు. అయితే అధికారుల వివరణతో చివరకు అరెస్టుకు అంగీకరించారాయన. ఆపై శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా కార్యకర్తలు అక్కడి నుంచి పంపించివేసి.. చంద్రబాబును విజయవాడకు తరలించారు. -
చంద్రబాబు వాదనలు.. సీఐడీ సమాధానంతో చప్పుడు చేయకుండా..
సాక్షి, నంద్యాల: దాదాపు ఆరు గంటల హైడ్రామా తర్వాత.. స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో ఏ1గా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అరెస్ట్ సమయంలో చంద్రబాబు నాయుడితో పాటు ఆయన లాయర్లు సీఐడీ అధికారులతో వాదనలకు దిగారు. ఈ తరుణంలో రిమాండ్ రిపోర్ట్ ద్వారా అన్ని అనుమానాలను నివృత్తి చేస్తామని సీఐడీ అధికారులు చెప్పడంతో.. చంద్రబాబు చప్పుడు చేయకుండా అరెస్ట్ కావడానికి అంగీకరించారు. ‘‘ఎఫ్ఐఆర్ చేయలేదు. ఏదో జరిగిందని కేసు పెట్టారు. మీకూ, నాకు రాజ్యాంగం ఆధారం. ఆధారాలు లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారు. స్కిల్స్ స్కామ్‌లో నా పేరు ఎక్కడుందో చూపించండి. ఆధారాలు లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారు. ఆధారాలు ఉంటే ఉరి తీయండి. దర్యాప్తు అధికారి రాకుండా సూపర్ వైజర్ అధికారి రావడం ఏంటి?. మీరు చుట్టుముట్టి నన్ను బెదిరిస్తున్నారా?’’ అని చంద్రబాబు సీఐడీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో.. ‘‘విజయవాడ వెళ్లలోపు రిమాండ్ రిపోర్ట్ అందిస్తాం. ముందే రిమాండ్ ఇవ్వడం కుదరదు. రిమాండ్ రిపోర్ట్‌లోనే అన్ని విషయాలు ఉన్నాయి’’ అని ఏపీ సీఐడీ అధికారులు చెప్పారు. నాన్ బెయిలబుల్ కేసు పెట్టారు. సంబంధం లేని సెక్షన్స్ నమోదు చేశారు. అరెస్ట్‌కు ముందే కేసు వివరాలు చెప్పాలంటూ చంద్రబాబు లాయర్లు పట్టుబట్టడంతో.. ‘‘చంద్రబాబు పాత్ర ఉందని హైకోర్టుకు చెప్పామ’’ని సీఐడీ పోలీసులు సమాధానం ఇచ్చారు. దర్యాప్తు అధికారి రాకుండా మీరెందుకు వచ్చారు. నేను టెర్రరిస్టునా?. అన్న అర్ధరాత్రి పూట డిస్టర్బ్ చేయాల్సిన అవసరం ఏంటి?. ప్రాథమిక ఆధారాల్లేకుండా న్ను ఎలా అరెస్ట్ చేస్తారు. మా పార్టీ వాళ్లను అరెస్ట్ చేస్తున్నారు. నన్ను ఎందుకు రిమాండ్ చేస్తున్నారో చెప్పి.. అరెస్ట్ చేసుకోండి. నా హక్కుల్ని ఉల్లంఘిస్తున్నారు అని బాబు మరోసారి వాగ్వాదానికి దిగారు. ఆ తరుణంలో.. ‘‘మాకు అరెస్ట్ చేసిన తర్వాత 24 గంటల వరకు టైం ఉంటుంది. గడువులోగా కోర్టుకు అన్ని డాక్యుమెంట్లు ఇస్తాం. చంద్రబాబును ప్రశ్నించిన తర్వాతే పూర్తి రిమాండ్ రిపోర్ట్ ఇస్తాం’’ అని చంద్రబాబు తరపు న్యాయవాదులకు బదులిచ్చారు. ‘‘అరెస్టుకు ముందు ప్రాథమిక సాక్ష్యాలు అడుగుతున్నారు. అలా చూపించాలని చట్టంలో లేదు’’ అని సీఐడీ అధికారులు స్పష్టం చేశారు. నోటీసులు ఇలా.. స్కిల్ డెవలప్మెంట్లో.. చంద్రబాబు మీద నాన్‌బెయిలబుల్ వారెంట్ కింద కేసు నమోదు అయ్యింది. సీఆర్పీసీ సెక్షన్ 50(1)(2) కింద నోటీసులు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ నేర పరిశోధన విభాగం. ఐపీసీ సెక్షన్ 120(B), 166, 167, 418, 420, 465, 468, 471, 409, 201, 109.. r/w 34, 37 ఐపీసీతో పాటు 12, 13(2) r/w 13(1)(c)&(d) అవినీతి నిరోధక శాఖ చట్టం 1988 సెక్షన్ల కింద అరెస్ట్ చేస్తున్నట్లు నోటీసుల్లో పేర్కొంది. అరెస్ట్‌కు సంబంధించిన పేపర్లను చంద్రబాబుకు, లాయర్లకు ఇచ్చారు సీఐడీ పోలీసులు. గంట సేపు వాదించిన చంద్రబాబు, ఆయన తరపు లాయర్లు.. చివరకు సీఐడీ అధికారుల వివరణతో సంతకం చేసి అరెస్ట్‌కు ముందుకు వచ్చారు. హాల్ వద్ద హైడ్రామా నోటీసులతో ఏపీ సీఐడీ అధికారులు బస చేసిన జ్ఞానపురం ఆర్కే ఫంక్షన్ హాల్ వద్దకు చేరుకున్నారు. అయితే ఆయనకు భద్రత కల్పించే NSG అడ్డుకుంది. ఆ తర్వాత ప్రాంతంలో సీఐడీ అధికారులు లోపలికి వెళ్లారు. గంట సేపుల వాదోపవాదనల తర్వాత.. రిమాండ్ రిపోర్ట్‌లో అన్ని విషయాలు తెలియజేస్తామని చెప్పడంతో చంద్రబాబు అరెస్ట్ అయ్యేందుకు సిద్ధం అయ్యారు. -
చంద్రబాబు అరెస్టు
నంద్యాల: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబును పోలీసులు అరెస్టు చేశారు. నంద్యాలలో చంద్రబాబు బస చేసిన ఆర్కే పంక్షన్ హాల్ వద్ద ఆయన్ను అరెస్ట్ చేశారు సీఐడీ పోలీసులు. ఈ రోజు(శనివారం) తెల్లవారుజామున చంద్రబాబును అరెస్ట్ చేశారు పోలీసులు. సీఆర్పీసీ సెక్షన్ 50(1) నోటీస్ ఇచ్చిన సీఐడీ.. 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ చట్టం కింద చంద్రబాబు అరెస్ట్ చేసింది. ఈ కేసులో ఏ-1గా చంద్రబాబు ఉండగా, ఏ-2గా అచ్చెన్నాయుడు ఉన్నారు.చంద్రబాబు పై 120(బి), 166, 167,418, 420, 465, 468, 201, 109, రీడ్‌విత్ 34 and 37 ఐపీసీ సెక్షన్ ల కింద కేసులు నమోదు చేశారు. చంద్రబాబు అరెస్ట్ సమాచారం అందుకున్న టీడీపీ నాయకులు భారీగా చేరుకొని పోలీసులను అడ్డుకునేందుకు యత్నించారు . చంద్రబాబును కలువ నీయకుండా అడ్డుగా నిలబడి పోలీసు అధికారులతో టిడిపి నాయకులు వాగ్వాదానికి దిగారు . తమ నాయకుడు చంద్రబాబు విశ్రాంతిలో ఉన్నాడని, ఉదయం కలవండి అంటూ అధికారులతో టిడిపి నాయకులు వాధించారు. ఉదయం 6 గంటల తర్వాత చంద్రబాబునుకలవాలని విజ్ఞప్తి చేశారు. చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు వైద్యులను పిలిపించారు పోలీసులు. చంద్రబాబుతో పాటు పలువురు టిడిపి నాయకులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. చదవండి: ప్రజాధన కుంభకోణం.. అరెస్టు.. పదేళ్ల జైలు! చంద్రబాబుపై అభియోగాలు.. 👉ప్రభుత్వ డబ్బు రూ.371 కోట్లు అవినీతి 👉షెల్ కంపెనీల ద్వారా రూ. 241 కోట్ల కుంభకోణం 👉 కేబినెట్‌ను తప్పుదారిపట్టించి ఆ తర్వాత ఒప్పందంలో మరొకటిపెట్టి… డబ్బులు కాజేశారని అభియోగాలు. 👉స్కిల్ డెవలప్మెంట్ పేరిట స్కాం ఇది. 👉ఈడీ, సెబీ… ఇలా ఏజెన్సీలన్నీ కూడా దర్యాప్తుచేసిన స్కాం ఇది. 👉దోచేసిన సొమ్మును విదేశాలకు అక్కడనుంచి తిరిగి దేశంలోకి వచ్చింది. 👉చంద్రబాబుగారు జూన్ 2014లో అధికారం చేపట్టిన 2 నెలలకే ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కాంకు ఊపిరి. 👉ప్రాజెక్టు మొత్తం ఖర్చు రూ.3,356 కోట్లని, ఇందులో ప్రభుత్వ వాటా 10 శాతం అని, 90 శాతం సీమెన్స్ పెట్టుకుంటుందని చెప్పారు. అంటే దాదాపుగా రూ.౩వేల కోట్ల రూపాయలు సీమెన్స్ ఇస్తుందని చెప్పారు. 👉తమకు తాముగా తయారుచేసుకున్న అంచనా వ్యయాన్నే డీపీఆర్‌గా చూపిస్తూ స్కిల్‌డెవల్‌మెంట్ నుంచి నోట్ పెట్టించారు. ఇక ప్రభుత్వంలో సెక్రటరీ స్థాయి, ఆపైస్థాయి అన్నింటినీ ఓవర్‌రూల్ చేస్తూ కేబినెట్లోకి ఈనోట్‌ను తీసుకొచ్చారు. అదీ ఒక స్పెషల్ ఐటెంగా. కేబినెట్లోకి అలా రావడం, వెంటనే దానికి ఓకే చెప్పడం, తర్వాత జీవో విడుదల కావడం... అన్నీ ఆగమేఘాలమీద జరిగిపోయాయి. 👉ఈ పద్ధతిలో కేబినెట్‌కు నోట్ పెట్టడం అన్నది నియమాలకు, నిబంధలనకు, రూల్స్‌కు పూర్తిగా విరుద్ధం. 👉ఇక ఒప్పందం విషయానికొస్తే.. జీఓ ఒకలా ఉంటుంది, ఒప్పందం ఇంకోలా ఉంటుంది. 👉జీవోలో ఉన్నది... ఒప్పందంలో లేనప్పుడు సంతకాలు చేశారు?. 👉సీమెన్స్ నుంచి రావాల్సిన గ్రాంట్ ఇన్ ఎయిడ్‌గా ఒక్కపైసాకూడా రాకుండానే 5 దఫాలుగా ప్రభుత్వం రూ. 371 కోట్లు ఎలా విడుదలచేసింది. 👉డబ్బు విడుదలపై ఆర్థికశాఖ అధికారులు కొర్రీలు పెడితే… విడుదల చేయమని చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. 👉ఈ విషయాన్ని స్వయంగా అప్పటి ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ తన నోట్‌ఫైల్‌లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే విడుదలచేయమని ఆదేశాలు ఇచ్చినట్టుగా రాశారు. 👉సీఎంగారు చెప్పారు కాబట్టి విడుదలచేయమని చీఫ్ సెక్రటరీ నేరుగా ఫైలుపై రాశారు. 👉అన్నికంటే ముఖ్యంగా ప్రభుత్వం నుంచి విడుదలచేసిన ఈ డబ్బు పోయింది 👉మన అధికారులేకాదు… సీమెన్స్ సంస్థకూడా ఇంటర్నల్ ఎంక్వయిరీ చేసి… 164 సీఆర్పీసీ కింద ఏకంగా మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చారు. 👉ప్రభుత్వం జారీచేసిన జీవోకు, ఎంఓయూకు ఎలాంటి సంబంధం లేదని వాళ్లు కోర్టుకు తెలిపారు. 👉తమ కంపెనీలో పనిచేసే సుమన్‌బోస్ అనే వ్యక్తి మేనేజ్‌మెంట్‌నుగాని, లీగల్‌టీమ్‌కాని సంప్రదించలేదని సీమెన్స్ వాళ్లు ఏకంగా కోర్టుకు తెలియజేశారు. 👉ఈ డబ్బు 70కిపైగా షెల్ కంపెనీల ద్వారా చేతులు మారి మారి తిరిగి వచ్చింది, 👉వాస్తవంగా ఈ స్కిల్‌డెవలప్‌మెంట్ స్కాం గురించి ఒక వ్యక్తి రాష్ట్రంలో ఏసీబీ రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ప్రభుత్వానికి ఒక విజిల్‌బ్లోయర్ ఈ రకంగా జూన్ 2018న ఒక హెచ్చరిక జారీచేశారు. విచారణ మొదలుపెట్టి… దాన్ని ముందుకు కొనసాగించనీయకుండా పక్కనపెట్టేశారు. 👉ఇది ఎప్పుడైతే జరిగిందో… వెంటనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన నోట్‌ఫైల్స్‌ను మాయంచేసేశారు. 👉స్కిల్ స్కాంలో ప్రధాన పాత్ర పోషించిన పీవీఎస్పీ/స్కిల్లర్, డిజైన్‌టెక్ … 👉ఈరెండు కంపెనీలు సర్వీస్ ట్యాక్స్ కట్టకుండా సెన్‌వాట్‌కోసం క్లెయిమ్ చేశాయి. ఇన్ని కోట్ల రూపాయల మేర క్లెయిం చేయడంతో జీఎస్టీ అధికారులకు అనుమానం వచ్చి... ఆ కంపెనీ లావాదేవీలపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టారు. డబ్బులు హవాలా మార్గంలో తరలించినట్టు వెల్లడైంది. 2017లోనే ఇది బయటపడింది. అప్పుడు కూడా అప్పటి ప్రభుత్వం స్పందనలేదు. -
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
సాక్షి, చిత్తూరు: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వరుసగా మూడు వాహనాలు ఢీకొనడంతో నలుగురు మృతి చెందారు. వడమాలపేట చెక్‌పోస్ట్ దగ్గర ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొట్టింది. రోడ్డుకు అడ్డంగా పడిన లారీని మరో కారు ఢీకొట్టగా, ప్రమాదానికి గురైన కారును బైక్ ఢీకొట్టింది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. -
కర్నూలు: తుపాకీతో కాల్చుకుని హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య
సాక్షి, కర్నూలు: కర్నూలులో విషాదం చోటుచేసుకుంది. లోకాయుక్తా కార్యాలయంలో హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విధి నిర్వహణలో ఉన్న సత్యనారాయణ.. గన్‌తో పేల్చుకుని అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. సత్యనారాయణకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తె హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నారు. కానిస్టేబుల్ ఆత్మహత్యకు గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. చదవండి: నా భర్తను తగలబెట్టారు: రవీందర్ భార్య -
మార్గదర్శి దందాపై విచారించాలి
సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్‌ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆర్థిక అవకతవకలు, తప్పుడు రికార్డుల నిర్వహణ, నిధుల మళ్లింపు, ఇతర చట్ట ఉల్లంఘనలపై రామోజీ, శైలజా కిరణ్ తదితరులపై నమోదు చేసిన కేసులో తాము దాఖలు చేసిన చార్జిషీట్లను గుంటూరు, విశాఖపట్నంలోని డిపాజిటర్ల పరిరక్షణ చట్టం ప్రత్యేక కోర్టులు ‘రిటర్న్’ చేస్తూ గత నెల 28న జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ సీఐడీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ ఉత్తర్వులను రద్దు చేయడంతో పాటు, కేసును విచారణకు స్వీకరించేలా ఆ కోర్టులను ఆదేశించాలని కోరుతూ సీఐడీ అదనపు ఎస్పీ ఈ అప్పీళ్లను దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాల్లో మార్గదర్శి చైర్మన్ చెరుకూరు రామోజీరావు, ఎండీ శైలజా కిరణ్, ఆడిటర్ కుదరవల్లి శ్రవణ్‌లతో పాటు వైస్ ప్రెసిడెంట్లు, డైరెక్టర్లు, జనరల్ మేనేజర్లు, బ్రాంచ్ మేనేజర్లు ఇలా మొత్తం 15 మందిని ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ అప్పీళ్లపై హైకోర్టు వచ్చే వారం విచారణ జరిపే అవకాశం ఉంది. ఒకే రోజు రెండు కోర్టులు దాదాపు ఒకే రకం ఉత్తర్వులు మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆర్థిక అవకతవకలు, తప్పుడు రికార్డుల నిర్వహణ, నిధుల మళ్లింపు, ఇతర చట్ట ఉల్లంఘనలపై చిట్స్ అసిస్టెంట్ రిజిస్ట్రార్లు సీఐడీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా రామోజీరావు, శైలజా కిరణ్‌లతో పాటు మొత్తం 15 మందిపై ఐపీసీ, డిపాజిటర్ల పరిరక్షణ చట్టం, చిట్‌ఫండ్ చట్టాల కింద సీఐడీ కేసులు నమోదు చేసింది. దర్యాప్తు చేసి డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద ఏర్పాటైన ప్రత్యేక కోర్టుల్లో చార్జిషీట్లు దాఖలు చేసింది. ఈ చార్జిషీట్లను పరిశీలించిన ప్రత్యేక కోర్టులు, సీఐడీ దాఖలు చేసిన చార్జిషీట్లను రిటర్న్ చేశాయి. గుంటూరులో ప్రిన్సిపల్ జిల్లా జడ్జి ఉత్తర్వులు జారీ చేయగా, విశాఖపట్నంలో మెట్రో పాలిటన్ సెషన్స్ జడ్జి ఉత్తర్వులిచ్చారు. రెండు కోర్టులు కూడా ఆగస్టు 28వ తేదీనే ఉత్తర్వులు వెలువరించడం విశేషం. రెండు కోర్టులు ఇచ్చిన ఉత్తర్వులు దాదాపు ఒకే రకంగా ఉండటం గమనార్హం. జాప్యానికి చాలా కారణాలు.. ‘డిపాజిటర్ల పరిరక్షణ చట్టంలోని సెక్షన్ 5 కింద ప్రత్యేక కోర్టు తన పరిధిని వినియోగించాలంటే, నిందితులు చందాదారులకు చెల్లించాల్సిన ప్రైజ్ మొత్తాలను ఎగవేసినట్లు ఫిర్యాదుతో పాటు ప్రాథమిక ఆధారాలను కోర్టు ముందుంచాల్సి ఉంటుంది. చార్జిషీట్లను పరిశీలిస్తే, ఏ చందాదారు కూడా తమకు చెల్లించాల్సిన మొత్తాలను నిందితులు ఎగవేసినట్లు ఎక్కడా చెప్పలేదు. జాప్యానికి అనేక కారణాలుంటాయి. నిధుల మళ్లింపు డిపాజిటర్ల చట్టం పరిధిలోకి రాదు. భవిష్యత్తు చందా చెల్లింపుల కోసం కొంత మొత్తాలను మార్గదర్శి తమ వద్దే అట్టిపెట్టుకున్నట్లు, ఆ మొత్తాలకు వడ్డీ చెల్లిస్తామని చెప్పినట్లు కొందరు చందాదారులు తమ వాంగ్మూలాల్లో చెప్పారు. దీనిని ఎగవేతగా భావించడానికి వీల్లేదు. ప్రైజ్ మొత్తాలను ఎగవేశారనేందుకు ఆధారాలు సమర్పిస్తేనే ప్రత్యేక కోర్టు జోక్యం చేసుకోవడానికి వీలుంటుంది. కేసు విచారణకు స్వీకరించేంత ఆధారాలు ఏవీ చార్జిషీట్లో లేవు. అందువల్ల చార్జిషీట్లను రిటర్న్ చేస్తున్నాం. ఫిర్యాదుదారు సంబంధిత కోర్టును గానీ, సంబంధిత సమార్థాధికారిని గానీ ఆశ్రయించాలి’ అని రెండూ ప్రత్యేక కోర్టులు వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేశాయి. కళ్లెదుటే చట్ట ఉల్లంఘన కనిపిస్తున్నా.. ఈ ఉత్తర్వులపై సీఐడీ తన అప్పీళ్లలో అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘గడువు ముగిసి, ష్యూరిటీలు సమర్పించిన తర్వాత కూడా బ్రాంచ్ మేనేజర్లు సకాలంలో చెల్లింపులు చేయలేదని పలువురు చందాదారులు దర్యాప్తు సంస్థకు వాంగ్మూలం ఇచ్చారు. కుంటిసాకులు చెబుతూ ష్యూరిటీలను తిరస్కరించడం, అదనపు ష్యూరిటీలు సమర్పించాలని కోరడంతో పాటు ప్రైజ్ మొత్తాలను చెల్లించకుండా మార్గదర్శి ఇబ్బంది పెడుతోందంటూ చందాదారులు స్పష్టంగా చెప్పారు. తమ బ్రాంచ్ బ్యాంకు ఖాతాల్లో తమ మొత్తాలున్నాయో లేదో తెలుసుకోకుండా చందాదారులను మార్గదర్శి అధికారులు అడ్డుకున్నారు. సకాలంలో చెల్లింపులు చేయకపోవడం, చెల్లించాల్సిన ప్రైజ్ మొత్తాన్ని డిపాజిట్‌గా తమ వద్దే అట్టిపెట్టుకోవడం, తక్కువ వడ్డీ చెల్లించడం, చెల్లింపులు ఎగవేయడం వంటివన్నీ కూడా డిపాజిటర్ల పరిరక్షణ చట్టంలోని సెక్షన్ 5 కిందకే వస్తాయి. ఇన్ని ఉల్లంఘనలు స్పష్టంగా కనిపిస్తున్నా కూడా ప్రత్యేక కోర్టు మాత్రం వాటిని పట్టించుకోకుండా ప్రైజ్ మొత్తాల ఎగవేత జరిగినట్లు కనిపించడం లేదని పేర్కొనడం సరికాదు. చందాదారులకు చెల్లించాల్సిన ప్రైజ్‌మనీ చెల్లించకుండా వడ్డీ చెల్లింపు పేరుతో తమ వద్దే అట్టిపెట్టుకోవడానికి ప్రధాన కారణం ఏమిటంటే, చెల్లింపులు చేయడానికి సరిపడనంత డబ్బు లేకపోవడమే. తమ వద్ద డబ్బు లేదు కాబట్టి, చందాదారులకు చెల్లించాల్సిన డబ్బునే భవిష్యత్తులో చెల్లించాల్సిన చందాగా తమ వద్ద అట్టిపెట్టుకుని ఆ మొత్తాలను మార్గదర్శి రోటేషన్ చేస్తూ వస్తోంది. ప్రత్యేక ఖాతాల్లో చందాదారుల డబ్బు ఉంచాల్సి ఉన్నప్పటికీ, అలా ఉంచకుండా దానిని ఇతర అవసరాలకు మళ్లించేస్తోంది. ఈ విషయాలన్నింటినీ తగిన ఆధారాలతో చార్జిషీట్లో స్పష్టంగా పేర్కొన్నాం. చార్జిషీట్లను రిటర్న్ చేస్తూ ఇచ్చిన ఉత్తర్వుల్లో ప్రత్యేక కోర్టులు పలు అంశాలను స్పష్టంగా నిర్ధారించాయి. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినకుండానే అలా నిర్ధారించడం చట్ట విరుద్ధం’ అని సీఐడీ తన అప్పీళ్లలో వివరించింది. ఎగవేతలపై స్పష్టంగా వాంగ్మూలాలు ‘చార్జిషీట్లోని అంశాలపై మినీ ట్రయల్ నిర్వహించడానికి వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. డిపాజిటర్ల పరిరక్షణ చట్టంలోని సెక్షన్ 5కు ప్రత్యేక కోర్టులు భాష్యం చెప్పాయి. అలా చెప్పి ఉండకూడదు. డిపాజిటర్ల పరిరక్షణచట్ట నిబంధనల ప్రకారం ప్రైజ్ మొత్తాల ఎగవేత శాశ్వతమా లేక తాత్కాలికమా అన్న దాని మధ్య ఎలాంటి తేడా లేదు. కేసును విచారణకు స్వీకరించకుండానే ఆయా అంశాల మధ్య తేడాలు లేవనెత్తడం సమంజసం కాదు. చార్జిషీట్లను లోతుగా పరిశీలిస్తే మార్గదర్శి పాల్పడిన ఉల్లంఘనలు, ఎగవేతలపై చందాదారుల వాంగ్మూలాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. డిపాజిటర్ల పరిరక్షణచట్ట నిబంధనల ప్రకారం ఓ ఆర్థికసంస్థ ఉల్లంఘనలు, ఎగవేతలపై చందాదారుడే ఫిర్యాదుదారు అయి ఉండాల్సిన అవసరం లేదు. చందాదారులకు చెల్లించాల్సిన మొత్తాల ఎగవేత, చెల్లింపుల్లో జాప్యం అంశాలను ప్రత్యేక కోర్టులు పరిగణనలోకి తీసుకోలేదు. సీతంపేట బ్రాంచ్‌లో చందాదారులకు చెల్లింపులు చేయడానికి తగినంత మొత్తాలు లేవన్న విషయం చార్జిషీట్లో స్పష్టంగా ఉంది. ప్రత్యేక కోర్టు ఈ విషయాన్ని పట్టించుకోలేదు. చార్జిషీట్లో పేర్కొన్నవన్నీ ప్రాథమిక ఆధారాలే అయినప్పటికీ, వాటిని సరైన దృష్టికోణంలో ప్రత్యేక కోర్టులు చూడలేకపోయాయి’ అని సీఐడీ తన అప్పీళ్లలో పేర్కొంది. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని చార్జిషీట్లను రిటర్న్ చేస్తూ ప్రత్యేక కోర్టులు జారీచేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని హైకోర్టును కోరింది. తదుపరి తమ కేసును విచారణకు స్వీకరించేలా కూడా ప్రత్యేక కోర్టులను ఆదేశించాలని అభ్యర్థించింది. -
టీడీపీ నేతల కనుసన్నల్లోనే విధ్వంసం.. యువగళం వలంటీర్లు అరెస్ట్
సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా: టీడీపీ నేతల కనుసన్నల్లోనే భీమవరంలో విధ్వంసకాండ జరిగిందని పోలీసులు గుర్తించారు. 44 మంది యువగళం వలంటీర్లను అరెస్ట్ చేయగా, 13 మంది టీడీపీ నేతలపై కేసు నమోదు చేశారు. మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, టిడిపి రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు కేసులు నమోదయ్యాయి. భీమవరం, ఉండి, వీరవాసరం మండలాల టీడీపీ నాయకులపై ఐపీసీ సెక్షన్ 307, 324, 332, రెడ్ విత్ 149 తదితర సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే సీఎం జగన్, ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన లోకేష్‌కు భీమవరం పోలీసులు నోటీసులు జారీ చేశారు. చదవండి: జనంపై టీడీపీ దండయాత్ర!