ప్రత్యేక హోదా పోరాటాన్ని ఢిల్లీ వరకు తీసుకెళ్లి.. పార్లమెంటు వేదికగా అలుపెరగని పోరాటం సాగించి.. అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించేందుకు అవిశ్రాంతంగా ప్రయత్నించి.. దేశవ్యాప్తంగా చర్చనీయాం శంగా మార్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేడు అంతిమ పోరాటాన్ని ప్రారంభించింది. హోదా సాధన పోరాటంలో భాగంగా నేడు పదవులకు రాజీనామాలు చేయనున్న ఎంపీలు.. సంతకాలు చేసిన రాజీనామా పత్రాలను మహానేత వైఎస్సార్ పాదాల వద్ద ఉంచి, నమస్కరించారు. అనంతరం పార్లమెంట్‌కు బయలుదేరారు..