ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తాజాగా ఢిల్లీలో జరుపుతున్న పర్యటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ప్రత్యేక హోదా సాధన కోసం ఢిల్లీకి రాలేదని, కేవలం వ్యవస్థలను తనకు అనుకూలంగా మేనేజ్ చేసుకునేందుకు ఢిల్లీకి వచ్చారని అన్నారు. నిన్న (మంగళవారం) రాత్రి చంద్రబాబు కొన్ని రహస్య సమావేశాలు జరిపారని తెలిపారు. చంద్రబాబు రహస్యంగా ఎవరిని కలిశారు? ఎందుకు కలిశారు? ఏయే లావాదేవీలు జరిపారో బయటపెట్టాలని విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. ఆయన బుధవారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు.