ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు కాపాడుకునే విషయంలో ఏ రాజకీయ పక్షానికైనా మద్దతు ఇచ్చేందుకు వెనుకాడబోమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. తమ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మొదటి నుంచి చెబుతున్నట్లే.. హోదా అంశంపై ఎవరు అవిశ్వాసం పెట్టినా మద్దతు ఇస్తామని, రేపటి టీడీపీ తీర్మానానికి కూడా అనుకూలంగా ఓటేస్తామని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. సభ వాయిదా అనంతరం పార్లమెంట్ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు.