
గాలివానకు రాలిన ఆశలు
నంద్యాల(అర్బన్): అకాల వర్షాలు రైతులకు తీరని నష్టాన్ని మిగుల్చుతున్నాయి. రెండు రోజులుగా జిల్లాలో ఈదురు గాలులతో కూడిన వర్షాలతో వరితో పాటు ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. వర్షాలు, పెనుగాలులకు వరి, మొక్కజొన్న, కొర్ర, మినుము పంటలు 1,321 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. జిల్లాలో ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం వరకు ఉరుములు, మెరుపులతో కూడిన గాలి, వాన బీభత్సం సృష్టించింది. ఉదయం నుంచి తీవ్రమైన ఎండలు ఉండగా సాయంత్రం ఒక్కసారిగా వాతావరణంలో మార్పు లు చోటు చేసుకున్నాయి. కొలిమిగుండ్ల, అవుకు, బనగానపల్లె, ప్యాపిలి, బేతంచెర్ల మండలాల్లో కురిసిన వర్షాలకు అరటి, వరిపైర్లు నేలకొరిగాయి. ఈదురుగాలుల దాటికి పలు ప్రాంతాల్లో చెట్లు విరిగి రహదారుల రాకపోకలకు ఇబ్బంది కరంగా మారా యి. జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు 1,321 హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయాధికారులు ప్రాథమిక అంచనా వేశారు. అందులో వరి 1,057 వరి హెక్టార్లు, 2,18 హెక్టార్లు మొక్కజొన్న, మరికొన్ని పంటలు దెబ్బతిన్నట్లు అంచనాలు తయారు చేసి నివేదికలను రాష్ట్రస్థాయి అధికారులకు పంపారు. బండిఆత్మ కూరు మండలంలో 402 హెక్టార్లు, మహానందిలో 325, నంద్యాలలో 15, ఆళ్లగడ్డలో 81, అవుకులో 308, చాగలమర్రి మండలంలో 190 హెక్టార్ల పంటలు దెబ్బతినడంతో రైతులు ఆందోళన చెందుతు న్నారు.
ఉద్యాన పంటలకు నష్టం
గత నాలుగు రోజులుగా జిల్లాలో అక్కడక్కడ కురుస్తున్న అకాల వర్గాలకు ఉద్యానవన పంటలకు భారీగా నష్టం జరిగింది. మహానంది, కొలిమిగుండ్ల, బండిఆత్మకూరు, నంద్యాల, ఆళ్లగడ్డ, తదితర మండలాల్లో అరటి చెట్లు నేలకొరిగి రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. అదే విధంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు నేలకొరిగి విద్యుత్ సరఫరా నిలిచి పోయింది.
జిల్లాలో కురిసిన వర్షపాతం వివరాలు..
జిల్లాలో ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. మొత్తం మీద 139 మి.మీ వర్షం కురిసినట్లు అధికారులు తెలిపారు. అందులో కొలిమిగుండ్ల మండలంలో అత్యధికంగా 48.0 మి.మీ పగిడ్యాలలో అత్యల్పంగా 0.8 మి.మీ వర్షం కురిసింది. అదే విధంగా బనగానపల్లెలో 23.2, అవుకులో 22.4, ప్యాపిలిలో 16.4, బేతంచెర్లలో 8.2, డోన్ 4.2, మిడుతూరు 3.4, నందికొట్కూరు 3.2, కోవెలకుంట్ల 2.4, గోస్పాడు 2.2, జూపాడుబంగ్లా, పాణ్యం, సంజామల 1.2, ఉయ్యాలవాడ 1.0 మి.మీ వర్షం కురిసింది.
వరి, అరటి, మామిడి రైతులు కుదేలు