
భద్రకాళి అమ్మవారికి గంధోత్సవం
హన్మకొండ కల్చరల్ : శ్రీభద్రకాళి భద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం శ్రీభద్రకాళి దేవాలయంలో అమ్మవారికి గంధోత్సవం నిర్వహించారు. అర్చకులు భద్రకాళి శేషు ఆధ్వక్యాన ఉదయం నిత్యాహ్నికం, చతుస్థానార్చన అనంతరం అమ్మవారి స్వపనమూర్తికి గంధంతో అలంకరించి ప్రత్యేకపూజలు చేశారు. సాయంత్రం ఉత్సవమూర్తిని సాలభంజికవాహనంపై ప్రతిష్ఠించి ఊరేగించారు. పూజాకార్యక్రమాలకు ఉమ్మడి వరంగల్ జిల్లాల పద్మశాలి సంఘం వారు ఉభయదాతలుగా వ్యవహరించారు. జిల్లా అధ్యక్షుడు లయన్ డాక్టర్ ఆడెపు రవీందర్, నగర మేయర్ గుండు సుధారాణి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రభాకర్, కోఆర్డినేటర్ పడ్నాల నరేందర్, కుసుమ సతీష్, సాంబారి సమ్మారావు తదితరులు పాల్గొన్నారు.