
భూ సమస్యలే ఎక్కువ..
భూపాలపల్లి: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి మొత్తం 52 దరఖాస్తులు రాగా.. అందులో భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులే ఎక్కువగా ఉన్నాయి. వినతులను కలెక్టర్ రాహుల్‌శర్మ స్వీకరించి, పరిష్కారం కోసం ఆయా శాఖల అధికారులకు పంపించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్‌కుమార్, విజయలక్ష్మి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
సర్వే నంబర్ లేదు.. పట్టా లేదు..
నా పేరు మేదరి వీరస్వామి. మాది చిట్యాల మండలంలోని చల్లగరిగె గ్రామం. నాకు ముచినిపర్తి శివారులో 14 గుంటల భూమి ఉంది. ఇప్పటివరకు ఆ భూమికి సర్వే నంబర్ లేదు. పట్టాదారు పాసుపుస్తకం రావడం లేదు. ఈ విషయమై తహసీల్దార్, కలెక్టర్‌కు చాలాసార్లు ఫిర్యాదు చేశాను. అయినా ఇప్పటి వరకు ఎవరూ సర్వే చేయించలేదు. మళ్లీ ప్రజావాణిలో దరఖాస్తు చేసుకునేందుకు వచ్చా. భూమి మా ఆధీనంలో ఉన్నా ఎటువంటి కాగితం లేకపోవడంతో ఇబ్బంది అవుతుంది.
భూమికి పరిహారం ఇప్పించండి..
మా ఊరు వెలిశాల శివారులోని 359 సర్వే నంబర్‌లో నాకు 12 గుంటల వ్యవసాయ భూమి ఉంది. ఆ భూమి మీదుగా మంచిర్యాల–వరంగల్ గ్రీన్‌ఫీల్డ్ హైవే రోడ్డు నిర్మాణం జరగబోతుంది. నాకు ఇప్పటివరకు ఎటువంటి నోటీసు ఇవ్వలేదు. నష్ట పరిహారం అందించలేదు. ఇప్పటికై నా తగు విచారణ జరిపించి భూమికి పరిహారం ఇప్పించండి.
– ఎండీ నైమా,
వెలిశాల, టేకుమట్ల
నా భూమిని కబ్జా చేశారు..
మా ఊరి శివారులోని సర్వే నంబర్ 831లో 1.10 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. మా తాతగారి పేరుపై ఉన్న ఆ భూమిని 2017లో పెద్ద మనుషుల సమక్షంలో మా నాన్న బండారి రమేష్, పెద్దనాన్న పోషాలు పంచుకున్నారు. కానీ మాకు తెలియకుండా 2018లో ఆ భూమి మొత్తాన్ని మా పెద్దనాన్న తన పేరు మీద పట్టా చేయించుకున్నాడు. ఇప్పటికై నా గ్రామంలో విచారణ చేపట్టి, ఆ పట్టాను రద్దు చేసి మాకు సగ భాగం వచ్చేలా చూడాలని ప్రజావాణిలో దరఖాస్తు చేసుకునేందుకు వచ్చాను.
– బండారి వేణు, జగ్గయ్యపేట, కొత్తపల్లిగోరి
ప్రజావాణికి 52దరఖాస్తులు
వినతులు స్వీకరించిన
కలెక్టర్ రాహుల్‌శర్మ

భూ సమస్యలే ఎక్కువ..

భూ సమస్యలే ఎక్కువ..

భూ సమస్యలే ఎక్కువ..