
దీంతో ఆయనపై క్రైమ్ నంబర్ 14/2022 ఐపీఎసీ సెక్షన్లు 419, 469, 153–ఎ, 505(2), 120–బి రెడ్‌విత్ 34, ఐటీ చట్టం సెక్షన్ 66(సి) కింద కేసు నమోదు చేశారు.
సాక్షి, అమరావతి: టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడి కుమారుడు విజయ్.. సీఐడీ విచారణకు హాజరుకాలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సతీమణి వైఎస్ భారతిపై టీడీపీ సోషల్ మీడియా విభాగం ఐ–టీడీపీ దుష్ప్రచారం చేసిన విషయం తెలిసిందే. దీని వెనుక ఐ–టీడీపీ విభాగ నిర్వహణ బాధ్యతలు చూస్తున్న చింతకాయల విజయ్ పాత్ర ఉన్నట్టు సీఐడీ దర్యాప్తులో వెల్లడైంది.
చదవండి: వైఎస్సార్‌సీపీ నేత వేణుబాబుపై హత్యాయత్నం
దీంతో ఆయనపై క్రైమ్ నంబర్ 14/2022 ఐపీఎసీ సెక్షన్లు 419, 469, 153–ఎ, 505(2), 120–బి రెడ్‌విత్ 34, ఐటీ చట్టం సెక్షన్ 66(సి) కింద కేసు నమోదు చేశారు. మంగళగిరిలోని సీఐడీ కార్యాలయంలో గురువారం విచారణకు హాజరుకావల్సిందిగా ఈ నెల 1న హైదరాబాద్‌లోని విజయ్ నివాసానికి వెళ్లి సీఐడీ అధికారులు నోటీసులిచ్చారు. కానీ విజయ్ మాత్రం విచారణకు హాజరుకాకపోవడం గమనార్హం. కాగా, ఆ కేసు ఎఫ్‌ఐఆర్ కాపీతో పాటు, ఇతర వివరాలు ఇవ్వాలని కోరుతూ ఓ లేఖను విజయ్ తరఫు న్యాయవాదులు సీఐడీ కార్యాలయంలో అందించారు.